Tuesday, January 31, 2012

టమాటా - ప్రాన్స్ పులావ్

టమాటా ప్యూరీ, ప్రాన్స్ కలిపి చేసే ఈ పులావ్ సింపుల్ గా త్వరగా 

అయిపోతుంది.కొంచెం స్పైసీగా,ప్రాన్స్ ఫ్లేవర్,టమాటా ఫ్లేవర్ తో రుచిగా

ఉంటుంది.







కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                     రెండు కప్పులు 

ప్రాన్స్                            20 -25 

టమాటాలు                      మూడు 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     మూడు 

పుదీనా                         అర కట్ట 

కొత్తిమీర                        అర కట్ట 

అల్లంవెల్లుల్లి ముద్ద            రెండు టీ స్పూన్స్ 

గరంమసాలా పొడి            రెండు టీ స్పూన్స్

ఉప్పు,కారం,పసుపు,నూనె 

లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర,అనాసపువ్వు,బిర్యానీ ఆకు 


తయారు చేసే విధానం;


బియ్యం కడిగి ఒక పావుగంట నాననివ్వాలి.

టమాటాలు ఉడికించి,గ్రైండ్ చేసి వడపోసి చిక్కని గుజ్జు తీసుకోవాలి.

నూనె వేడిచేసి మసాలా దినుసులు వేయాలి.

సన్నగా వాలికలుగా కోసిన ఉల్లి,మిర్చి వేసి ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు తరిగిన పుదీనా,కొత్తిమీర,శుభ్రం చేసిన రొయ్యలు వేసి 

ఉడికించాలి.

అల్లంవెల్లుల్లి ముద్ద,మసాలా పొడి,పసుపు,కారం వేసి బాగా కలిపి 

రొయ్యలు కొంచెం ఉడికిన తరువాత టమాటాగుజ్జు వేసి చిక్కబడే 

వరకు ఉడికించాలి.

ఇప్పుడు తగినన్ని నీళ్ళు,ఉప్పు వేసి మరిగిన తరువాత బియ్యం వేసి 

కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి పెరుగు పచ్చడితో సర్వ్ 

చేస్తే బావుంటుంది.





Share/Bookmark

Sunday, January 29, 2012

వంకాయ - బటానీ కూర

వంకాయతో చాలా రకాల కూరలు చెయ్యొచ్చు.ఈ సీజన్లో బాగా దొరికే 

బటానీలు కలిపి చేస్తే కూడా బావుంటుంది.అయితే సన్నగా పొడవుగా 

ఉండే వంకాయలు వాడితే మంచిది.








కావలసిన పదార్ధాలు:



వంకాయలు                    పావుకిలో 

బటానీలు                        అర కప్పు 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     నాలుగు 

అల్లం                           చిన్నముక్క

కరివేపాకు                      ఒక రెమ్మ 

మసాలాపొడి                  అర స్పూన్

ఉప్పు,కారం,పసుపు,నూనె,కొత్తిమీర

తాలింపుకు శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 



తయారు చేసే విధానం:


నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి.

కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లం,మిర్చి,కొత్తిమీర కలిపి నూరిన పేస్ట్ వేసి వేగనివ్వాలి.

సన్నగా కోసిన వంకాయ ముక్కలు,చిటికెడు పసుపు వేసి కలిపి 

మగ్గనివ్వాలి. 

వంకాయ ముక్కలు వేగిన తరువాత,తగినంత ఉప్పు,కారం వేసి కలిపి 

ఉడికించిన బటానీలు కూడా వేసి వేయించాలి.

చివరగా గరంమసాలాపొడి చల్లి రెండు నిముషాలు ఉంచి దింపెయ్యాలి.










Share/Bookmark

Friday, January 27, 2012

యాపిల్ - డేట్స్ మిల్క్ షేక్

యాపిల్ ముక్కలు,కొంచెం ఖర్జూరాలు కలిపి చేసే మిల్క్ షేక్ ఇది 

వెరైటీ రుచితో పిల్లలు ఇష్టపడేలా ఉంటుంది.

 




 కావలసిన పదార్ధాలు:



యాపిల్ ముక్కలు               చిన్నకప్పు 

ఖర్జూరాలు                       అయిదారు 

పంచదార                         ఒక టీస్పూన్ 

పాలు                             ఒక కప్పు 

ఇలాచీ పొడి                      చిటికెడు 


తయారు చేసే విధానం:


సన్నగా తరిగిన ఖర్జూరాలను కొంచెం పాలలో పావుగంట నాననివ్వాలి.

ఇందులో పంచదార,యాపిల్ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు పాలు పోసి ఒకసారి బ్లెండ్ చేస్తే సరిపోతుంది.

ఇష్టమైతే ఇలాచీపొడి వేయొచ్చు.వేయకపోయినా పర్లేదు.

కొద్దిగా యాపిల్ ముక్కలు,ఖర్జూర ముక్కలు వేసి ఇస్తే బావుంటుంది.

ఇందులో పంచదార బదులు తేనె అయినా వేసుకోవచ్చు.




Share/Bookmark

Tuesday, January 24, 2012

కారట్ - పాలక్ పులావ్

కారట్,పాలకూర రెండూ ఆరోగ్యానికి మంచివే.ఈ రెండూ కలిపి పులావ్ 

చేస్తే చాలా హెల్దీ రైస్ ఐటం రెడీ అవుతుంది.పిల్లలకి లంచ్ బాక్స్ లోకి  

ఇవ్వడానికి కూడా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                          రెండు కప్పులు

పాలకూర                             మూడు కట్టలు 

కారట్                                 మూడు 

ఉల్లిపాయ                             ఒకటి 

పచ్చిమిర్చి                           రెండు 

కొత్తిమీర                               ఒక కట్ట  

అల్లంవెల్లుల్లి పేస్ట్                      రెండు టీ స్పూన్స్ 

గరం మసాలా పొడి                   రెండు టీ స్పూన్స్ 

ఉప్పు,కారం,పసుపు,నూనె.

లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర 


తయారు చేసే విధానం:


బియ్యం కడిగి పదినిమిషాలు నాననివ్వాలి.కారట్ తురుముకోవాలి.

పాలకూర,కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి.

నూనె వేడిచేసి మసాల దినుసులు వేయాలి.సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి

వేసి వేయించాలి. 

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత పాలకూర,కారట్ తురుము 

వేసి వేగనివ్వాలి.

చిటికెడు పసుపు,కారం,గరం మసాలాపొడి,కొత్తిమీర వేసి కలపాలి.

ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మరిగాక బియ్యం,తగినంత ఉప్పు వేసి

కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయాక తీసి ఒకసారి కలిపి వేడిగా రైతాతో వడ్డిస్తే రుచిగా 

ఉంటుంది.


Share/Bookmark

Saturday, January 21, 2012

కారట్ హల్వా

ఈ సీజన్ లో మంచి ఆరెంజ్ కలర్ లో ఊరించే కారట్స్ చూస్తే హల్వా 

చేసెయ్యాలనిపిస్తుంది.సింపుల్ గా అయిపోయే ఈ స్వీట్ ఇష్టపడని 

వారు ఉండరు.






కావలసిన పదార్ధాలు:


కారట్ తురుము                 రెండు కప్పులు 

పాలు                             రెండు కప్పులు 

పంచదార                         రెండుకప్పులు 

నెయ్యి,ఇలాచీ పొడి,కాజు,కిస్మిస్  


తయారు చేసే విధానం:


రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడిచేసి కాజు,కిస్మిస్ వేయించి 

తీసుకోవాలి.

మరో రెండు స్పూన్స్ నెయ్యి వేసి కారట్ తురుము వేసి పచ్చివాసన 

పోయేవరకూ వేయించాలి,

ఇప్పుడు పాలు పోసి కారట్ బాగా ఉడికి పాలు ఇగిరిపోయి కోవాలా 

అయ్యేవరకు  ఉడికించాలి.

పంచదార వేసి కలిపి,హల్వా బాగా ముద్దగా దగ్గరయ్యేవరకు 

ఉడికించాలి.

చివరగా ఇలాచీ పొడి,మరికొంచెం నెయ్యి వేసి కాజు,కిస్మిస్ తో 

అలంకరించాలి.

.


Share/Bookmark

Tuesday, January 17, 2012

చికెన్ 65

చికెన్ తో చేసే స్నాక్ వెరైటీస్ లో ముఖ్యమైనది చికెన్ 65 .అందరూ 

చాలా ఇష్టపడే ఈ ఐటంని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు.







కావలసిన పదార్ధాలు:


మారినేషన్ కు 
 

చికెన్                             పావుకిలో

మైదా                            రెండు టీ స్పూన్స్ 

కార్న్ ఫ్లోర్                      రెండు టీ స్పూన్స్ 

ఎగ్                                ఒకటి 

మిరియాలపొడి                  అర స్పూన్ 

ఉప్పు,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాలా పొడి 


తాలింపుకు 


వెల్లుల్లి రెబ్బలు                  నాలుగు 

అల్లం                            చిన్న ముక్క 

పచ్చిమిర్చి                       ఆరు 

కరివేపాకు                       రెండు రెమ్మలు 

పెరుగు                           ఒక చిన్న కప్పు 

అజినిమోటో                      చిటికెడు 

నూనె,ఉప్పు,కారం,కొత్తిమీర.


తయారు చేసే విధానం:


బోన్ లెస్ చికెన్ ను చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

ఒక బౌల్ లో మైదా,కార్న్ ఫ్లోర్,ఉప్పు,మిరియాలపొడి,అర టీ స్పూన్ 

అల్లంవెల్లుల్లి ముద్ద,అర స్పూన్ గరంమసాలా పొడి,ఎగ్ వేసి బాగా 

కలిపి,చికెన్ ముక్కలు కూడా వేసి ఒక అరగంట నానబెట్టుకోవాలి.

కాగిన నూనెలో ఈ ముక్కలని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి.

ఇప్పుడు రెండు టీ స్పూన్స్ నూనె వేడిచేసి సన్నగా తరిగిన వెల్లుల్లి,

అల్లం ముక్కలు,వాలికలుగా కోసిన మిర్చి వేసి వేయించాలి.

కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి.

పెరుగులో కొంచెం కారం కలిపి బీట్ చేసి తాలింపులో వేసి వేయించిన 

చికెన్ ముక్కలు కూడా వేయాలి.

చిటికెడు ఉప్పు,అజినిమోటో వేసి కలుపుతూ తడి లేకుండా డ్రైగా 

అయ్యేవరకూ ఉంచాలి.

చివరగా కొత్తిమీర చల్లితే ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 నోరూరిస్తుంది.

నోట్: నేను ఫుడ్ కలర్ వాడలేదు.ఇష్టమైతే నానబెట్టేటప్పుడు కానీ,

పెరుగులో కానీ కొంచెం రెడ్ ఆరెంజ్ కలర్ కలుపుకోవచ్చు.


Share/Bookmark

Thursday, January 12, 2012

సగ్గుబియ్యం పునుగులు

ఎన్ని కొత్త కొత్త వెరైటీలు వచ్చినా ట్రెడిషనల్ గా ఉండే వంటలు కొన్ని 

ఉంటాయి.కమ్మని రుచితో నోరూరిస్తాయి.వాటిలో ఈ సగ్గుబియ్యం 

పునుగులు ఒకటి.క్రిస్పీగా కరకరలాడుతూ బావుంటాయి.








కావలసిన పదార్ధాలు:


సగ్గుబియ్యం                    ఒక కప్పు 

పెరుగు                          ఒక కప్పు 

మైదాపిండి                     రెండు కప్పులు 

బియ్యంపిండి                   ఒక కప్పు 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     నాలుగు 

కరివేపాకు,కొత్తిమీర,అల్లం ,ఉప్పు,వంటసోడా,నూనె 



తయారు చేసే విధానం : 


సగ్గుబియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి 

ఇందులో మైదా,బియ్యంపిండి,తగినంత ఉప్పు,చిటికెడు వంటసోడా 

వేసి తగినంత పెరుగుతో పిండి కలిపి ఒక గంట ఉంచాలి.పెరుగు 

లేకపోతే కొద్ది నీళ్ళతో కలపొచ్చు.అయితే పెరుగుతో కలిపితే రుచి 

చాలా బావుంటుంది.

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,కరివేపాకు,కొత్తిమీర వేసి బాగా కలిపి 

స్పూన్ తో చిన్నచిన్న పునుగుల్లా కాగిన నూనెలో వేయాలి.

రెండువైపులా వేయించి తీసుకుని టిష్యూ పేపర్ పైన పెడితే ఎక్సెస్ 

ఆయిల్ ఉంటే పోతుంది.

వేడిగా సాస్ తో కానీ చట్నీతో కానీ  తింటే ఛాలా బావుంటాయి.


Share/Bookmark

Sunday, January 8, 2012

పొట్లకాయ పెరుగుపచ్చడి

పెరుగు కలిపి చేసే పచ్చళ్లలో ముఖ్యమైనది ఈ పొట్లకాయ పచ్చడి.

అన్ని రోటిపచ్చళ్ళ లాగానే ఇది కూడా చేయడం తేలికే.అన్నంలోకి 

బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


పొట్లకాయ                  ఒకటి చిన్నది 

పచ్చిమిర్చి                 ఏడెనిమిది 

పెరుగు                     ఒక చిన్న కప్పు 

వెల్లుల్లిరెబ్బలు              నాలుగు

జీలకర్ర                       అర స్పూన్ 

చింతపండు                  కొద్దిగా 

ఉల్లిపాయ                    ఒకటి 

తాలింపుదినుసులు,కరివేపాకు,ఉప్పు,నూనె 


తయారు చేసే పధ్ధతి :


పొట్లకాయ చెక్కు గీసి చిన్నముక్కలు కోసుకోవాలి.ఈముక్కల్లో కొంచెం 

ఉప్పు కలిపి పదినిమిషాలు ఉంచి నీరు పిండేయాలి.ఇలా చేయకపోతే 

పచ్చడి వగరుగా ఉంటుంది.

ఈ ముక్కలకు పచ్చిమిర్చిని కలిపి రెండు టీ స్పూన్స్ నూనె వేసి 

వేయించుకోవాలి.మిర్చి,ఉప్పు,చింతపండు,జీలకర్ర,వెల్లుల్లి కలిపి గ్రైండ్ 

చేసుకుని,పొట్లకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి.

చివరగా పెరుగు వేసి ఒకసారి గ్రైండ్ చెయ్యాలి.

ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి.కరివేపాకు 

కూడా వేగాక చిటికెడు పసుపు,సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 

వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.ఉల్లిముక్కలు వేయించకూడదు,అప్పుడే అవి 

కరకరలాడుతూ పచ్చడి బావుంటుంది.

ఈ తాలింపును పచ్చడిలో కలపాలి.


Share/Bookmark

Wednesday, January 4, 2012

వెజ్ మసాలా రైస్

ఈ రైస్ ఐటం అన్ని ఫ్లేవర్స్ తో బిర్యానీ లాగానే ఉంటుంది.చాలా ఈజీగా 

చేసెయ్యొచ్చు.లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది. 







కావలసిన పదార్ధాలు:


అన్నం                          రెండు కప్పులు 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     రెండు 

కరివేపాకు                      ఒక రెమ్మ 

ఆలూ                           ఒకటి చిన్నది 

కారట్                            ఒకటి 

కాలీఫ్లవర్                       అర కప్పు (తరిగిన తురుము)

టమాటాలు                      రెండు 

పుదీనా,కొత్తిమీర               కొద్దిగా 

ఉప్పు,కారం,పసుపు,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాలాపొడి,నూనె.

తాలింపుకు షాజీర.లవంగాలు,చెక్క,అనాసపువ్వు 


తయారు చేసే విధానం:


రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి మసాల దినుసులు వేయాలి.

ఇవి వేగాక సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఆలూ,కాలీఫ్లవర్,కారట్ తురుము వేసి 

వేయించాలి.

ఇవి ఉడికిన తరువాత టమాటా ముక్కలు వేయాలి. తరిగిన పొదీనా,

కొత్తిమీర,పసుపు,కారం,అర టీ స్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా 

కలిపి వేగనివ్వాలి.

చివరగా అన్నం,తగినంత ఉప్పు,అర టీ స్పూన్ గరంమసాలాపొడి వేసి 

సన్నని సెగపై వేయించాలి.కొంచెం కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే 

మసాలా రైస్ రెడీ అయిపోతుంది 

ఇంకా ఇందులో ఉడికించిన బీన్స్,బటానీలు కూడా వేయొచ్చు.

టమాటా మిశ్రమం అంతా ఉడికిన తరువాత రెండు ఎగ్స్ బ్రేక్ చేసి 

వేసి పొడిపొడిగా వేగాక అప్పుడు అన్నం వేసి వేయించినా చాలా 

బావుంటుంది.






Share/Bookmark

Sunday, January 1, 2012

సేమ్యా ఖీర్

అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరపు తొలిరోజు.ఏడాదంతా బావుండాలని ఎన్నోఆశలు 

చిగుళ్ళు వేసే రోజు.అందుకే తీయతీయగా ఈ సేమ్యా ఖీర్.









కావలసిన పదార్ధాలు:


సన్న సేమ్యా                      ఒక కప్ 

పాలు                              అర లీటరు 

పంచదార                          ఒక కప్ 

ఇలాచీ పొడి                     అర టీ స్పూన్ 

నెయ్యి                           రెండు టీ స్పూన్స్ 

కాజూ,బాదం,కిస్మిస్,సారపప్పు.


తయారు చేసే పధ్ధతి:


నెయ్యి వేడిచేసి కాజూ,బాదం,కిస్మిస్,సారపప్పు అన్నీ వేయించి 

తీసుకోవాలి.

ఇదే నేతిలో సేమియా వేసి వేయించాలి.వేగిన తరువాత కాచిన పాలు

పోసి ఒక నిమిషం ఉడికించాలి.

పంచదార కలిపి మరొక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.ఇలాచీ

పొడి,వేయించిన డ్రై ఫ్రూట్స్ కలపాలి. 

నోట్ : సన్న సేమియా బదులు మామూలు వెరైటీ అయినా వాడొచ్చు,

సన్నసేమియా వాడితే ఎక్కువసేపు ఉడికిస్తే ముద్దగా అయిపోతుంది.

అందుకని పాలు వేశాక ఒక నిమిషం ఉడికితే చాలు.


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP