Showing posts with label సూప్స్. Show all posts
Showing posts with label సూప్స్. Show all posts

Saturday, July 16, 2011

టమాటా - ఓట్స్ సూప్

టమాటాలు ఓట్స్ కలిపి చేసే సూప్ ఇది.ఓట్స్ ఆహారంలో ఎక్కువ

తీసుకోమంటున్నారు కనుక విడిగా తినడానికి ఇష్టపడనివారు ఇలా 

సూప్స్ లోను,కూరలలోను చేర్చుకుంటే సరిపోతుంది.








కావలసిన పదార్ధాలు :

 

టమాటాలు                              మూడు
 
ఉల్లిపాయ                               ఒకటి                      

కారట్                                   ఒకటి 
 
ఓట్స్                                    మూడు టీ స్పూన్స్
 
ఉప్పు , మిరియాలపొడి


తయారు చేసే విధానం :


 
టమాటా,కారట్,ఉల్లి ముక్కలు కోసి కొంచెం నీరుపోసి ఉడికించాలి.

మైక్రోవేవ్ లో  మూడు నిమిషాలు హైలో పెడితే  ఉడికిపోతాయి.

ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తగినన్ని నీళ్ళు చేర్చి మరిగించాలి.
 
ఓట్స్ ను విడిగా దోరగా వేయించి ఇందులో వేయాలి.ఓట్స్ ఉడికి సూప్ 

చిక్కబడ్డ తరువాత ఉప్పు,మిరియాలపొడి వేసి వేడిగా సర్వ్ చెయ్యడమే.

ఇంకా ఫ్లేవర్స్ మన ఇష్టం.ఉడికించేటప్పుడు రెండు లవంగాలు,దాల్చిన

చెక్క, బిర్యాని ఆకు వేసి గ్రైండ్ చేసే ముందు వాటిని తీసేయవచ్చు.

లేదా కొంచెం గరంమసాలాపొడి అయినా వేసుకోవచ్చు.

ఇంకా ఓట్స్ ను కొంచెం వెన్నలో వేయించుకోవచ్ఛు. సర్వ్ చేసేప్పుడు 

బ్రెడ్ ముక్కలను నేతిలో వేయించి సూప్ లో వేసి ఇవ్వొచ్చు.

టమాటాలు హైబ్రిడ్ వి అయితే సూప్ మరీ పుల్లగా లేకుండా ఉంటుంది.


Share/Bookmark

Thursday, July 14, 2011

స్వీట్ కార్న్ సూప్

చల్లని వాతావరణంలో వేడివేడి సూప్స్ బావుంటాయి.స్వీట్ కార్న్,

కొంచెం కారట్ తురుము కలిపి చేసిన ఈ సూప్ కొంచెం తియ్యగా,

కొంచెం స్పైసీగా అందరికీ నచ్చుతుంది  







కావలసిన పదార్ధాలు:

స్వీట్ కార్న్                         ఒక కప్

 
కారట్ తురుము                   పావు కప్
 
ఉల్లిముక్కలు                       రెండు స్పూన్స్
 
మిర్చి                                ఒకటి
 
ఉప్పు                                 తగినంత
 
మిరియాల పొడి                   ఒక టీ స్పూన్
 
కార్న్ ఫ్లోర్                          అర స్పూన్

 

తయారు చేసే విధానం 

 

స్వీట్ కార్న్,కారట్ తురుము, ఉల్లి,మిర్చి ముక్కలు  ఉడికించాలి
 
ఒక స్పూన్ కార్న్,కారట్ విడిగా తీసి మిగిలినవి మెత్తగా గ్రైండ్ 

చేసుకోవాలి.
 
ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్ళు పోసి మరిగించాలి.
 
కార్న్ ఫ్లోర్ ను ఒక స్పూన్ నీటిలో కలిపి పోసి సూప్ చిక్కబడేదాకా 

ఉంచాలి.
 
చివరగా ఉప్పు,మిరియాలపొడి వేసి కలిపి పైన కార్న్,కారట్ తురుము 

వేసి వేడిగా సర్వ్ చెయ్యాలి.
 
ఇంకా చిక్కగా కావాలంటే కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవచ్చు.అలాగే ఉల్లి 

మిర్చిముక్కలని ఒక స్పూన్ వెన్నలో వేయించి తరువాత కార్న్ 

మిశ్రమం వేసి కూడా చేసుకోవచ్చు


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP