Saturday, January 21, 2012

కారట్ హల్వా

ఈ సీజన్ లో మంచి ఆరెంజ్ కలర్ లో ఊరించే కారట్స్ చూస్తే హల్వా 

చేసెయ్యాలనిపిస్తుంది.సింపుల్ గా అయిపోయే ఈ స్వీట్ ఇష్టపడని 

వారు ఉండరు.






కావలసిన పదార్ధాలు:


కారట్ తురుము                 రెండు కప్పులు 

పాలు                             రెండు కప్పులు 

పంచదార                         రెండుకప్పులు 

నెయ్యి,ఇలాచీ పొడి,కాజు,కిస్మిస్  


తయారు చేసే విధానం:


రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడిచేసి కాజు,కిస్మిస్ వేయించి 

తీసుకోవాలి.

మరో రెండు స్పూన్స్ నెయ్యి వేసి కారట్ తురుము వేసి పచ్చివాసన 

పోయేవరకూ వేయించాలి,

ఇప్పుడు పాలు పోసి కారట్ బాగా ఉడికి పాలు ఇగిరిపోయి కోవాలా 

అయ్యేవరకు  ఉడికించాలి.

పంచదార వేసి కలిపి,హల్వా బాగా ముద్దగా దగ్గరయ్యేవరకు 

ఉడికించాలి.

చివరగా ఇలాచీ పొడి,మరికొంచెం నెయ్యి వేసి కాజు,కిస్మిస్ తో 

అలంకరించాలి.

.


Share/Bookmark

2 comments:

జ్యోతిర్మయి

చూస్తేనే నోరూరిపోతుంది..మీ బాగు చాలా బావుంది. ఫోటోలు చక్కగా పెడతారు..

లత

థాంక్యూ జ్యోతిర్మయిగారూ

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP