టమాటా - ప్రాన్స్ పులావ్
టమాటా ప్యూరీ, ప్రాన్స్ కలిపి చేసే ఈ పులావ్ సింపుల్ గా త్వరగా
అయిపోతుంది.కొంచెం స్పైసీగా,ప్రాన్స్ ఫ్లేవర్,టమాటా ఫ్లేవర్ తో రుచిగా
కావలసిన పదార్ధాలు:
బాస్మతి రైస్ రెండు కప్పులు
ప్రాన్స్ 20 -25
టమాటాలు మూడు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి మూడు
పుదీనా అర కట్ట
కొత్తిమీర అర కట్ట
అల్లంవెల్లుల్లి ముద్ద రెండు టీ స్పూన్స్
గరంమసాలా పొడి రెండు టీ స్పూన్స్
ఉప్పు,కారం,పసుపు,నూనె
లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర,అనాసపువ్వు,బిర్యానీ ఆకు
తయారు చేసే విధానం;
బియ్యం కడిగి ఒక పావుగంట నాననివ్వాలి.
టమాటాలు ఉడికించి,గ్రైండ్ చేసి వడపోసి చిక్కని గుజ్జు తీసుకోవాలి.
నూనె వేడిచేసి మసాలా దినుసులు వేయాలి.
సన్నగా వాలికలుగా కోసిన ఉల్లి,మిర్చి వేసి ఎర్రగా వేయించాలి.
ఇప్పుడు తరిగిన పుదీనా,కొత్తిమీర,శుభ్రం చేసిన రొయ్యలు వేసి
ఉడికించాలి.
అల్లంవెల్లుల్లి ముద్ద,మసాలా పొడి,పసుపు,కారం వేసి బాగా కలిపి
రొయ్యలు కొంచెం ఉడికిన తరువాత టమాటాగుజ్జు వేసి చిక్కబడే
వరకు ఉడికించాలి.
ఇప్పుడు తగినన్ని నీళ్ళు,ఉప్పు వేసి మరిగిన తరువాత బియ్యం వేసి
కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.
స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి పెరుగు పచ్చడితో సర్వ్
చేస్తే బావుంటుంది.

2 comments:
లత గారు,
బ్లాగు మానేశారే? నెల కి కరెక్ట్ గా పది టపాలు రాశారా లేదా అని చూడటం ఒక హాబీ అయ్యింది నాకు :)
ఈ నెల ఒకటి కూడా రాయలేదు?
కొంచెం పని వత్తిడి కృష్ణప్రియగారూ, అందుకని రాయలేకపోయాను
త్వరలో రాస్తాను.
థాంక్యూ వెరీమచ్
Post a Comment