Monday, July 30, 2012

మేథీ - కార్న్ పులావ్

రకరకాల కాంబినేషన్స్ తో చేసే రైస్ ఐటమ్స్ ఎప్పుడూ నచ్చుతాయి.

ఆకుపచ్చని మెంతికూర,స్వీట్ కార్న్ కలిపి చేసే ఈ పులావ్ కూడా 

ఈజీగా చేసెయ్యొచ్చు.పెరుగు చట్నీ దీనిలోకి బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                        రెండు కప్పులు

స్వీట్ కార్న్                         ఒక కప్పు

మెంతి కూర                        మూడు కట్టలు

టమాటాలు                         రెండు

ఉల్లిపాయ                          ఒకటి

పచ్చిమిర్చి                        రెండు

కొత్తిమీర                           ఒక కట్ట

ఉప్పు,కారం,పసుపు,నూనె,అల్లంవెల్లుల్లి పేస్ట్,గరంమసాలా పొడి.

లవంగాలు,చెక్క,షాజీర.


తయారు చేసే విధానం:


బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.

పాన్ లో నూనె వేడిచేసి చెక్క,లవంగాలు,షాజీర వేసి వేగనివ్వాలి.

ఇప్పుడు వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేయించి టమాటా 

ముక్కలు వేయాలి. 

టమాటాలు మెత్తగా ఉడికిన తరువాత పసుపు,కారం,ఒక టేబుల్ 

స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి తరిగిన మెంతికూర,స్వీట్ 

కార్న్,ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి కలపాలి.

రెండు మూడు నిముషాలు వేయించి తగినన్ని నీళ్ళు,ఉప్పు వేయాలి.

నీరు మరిగినప్పుడు బియ్యం వేసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ 

వచ్చాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

స్టీం అంతా పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి వేడిగా సర్వ్ 

చెయ్యాలి. వేడివేడిగా ఏదైనా రైతాతో తింటే బావుంటుంది.

ఇందులో స్వీట్ కార్న్ బదులు మామూలు కార్న్ అయినా వాడొచ్చు.
               


Share/Bookmark

Tuesday, July 24, 2012

పనీర్ ఎగ్ కర్రీ

పనీర్,ఎగ్  రెండూ పిల్లలు ఇష్టంగా తినేవే.ఈ రెంటితో సింపుల్ గా 

అయిపోయే ఈ కూర అన్నంలోకి,చపాతీ లోకీ కూడా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు :




పనీర్                          100 గ్రాములు 

ఎగ్స్                            రెండు 

టమాటాలు                    రెండు 

ఉల్లిపాయ                     ఒకటి 

పచ్చిమిర్చి                   రెండు 

కరివేపాకు                    ఒక రెమ్మ 

కొత్తిమీర                      కొద్దిగా 

అల్లం తురుము             అర స్పూన్ 

వెల్లుల్లి                       రెండు రెబ్బలు 

ఉప్పు,కారం,పసుపు,నూనె,గరంమసాలా పొడి.

తాలింపుకు ఆవాలు,జీలకర్ర,శనగపప్పు,ఎండుమిర్చి.



తయారు చేసే విధానం:




పనీర్ ను పొడిపొడిగా చిదిమి ఉంచుకోవాలి.

నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి 

వేయించాలి.

ఇప్పుడు సన్నగా తురిమిన అల్లం,వెల్లుల్లి,కరివేపాకు వేసి వేగిన 

తరువాత టమాట ముక్కలు వేయాలి.

తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి టమాటా బాగా మెత్తగా అయ్యేదాకా 

ఉడికించాలి.

ఈలోగా మరొక పాన్ లో ఒక టీ స్పూన్ నూనెలో ఎగ్స్ బ్రేక్ చేసి వేసి 

పొడిగా వేయించాలి.

టమాట మెత్తగా ఉడికిన తరువాత పనీర్ ను,వేయించుకున్న ఎగ్స్ ను

 వేసి బాగా కలపాలి.

చివరగా గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి కలిపి కొంచెంసేపు వేయించి 

దింపెయ్యాలి.


ఇష్టం ఉంటే ఇందులో ఉడికించిన పచ్చిబటానీ లేదా కాప్సికం కూడా 

వేసుకోవచ్చు.


Share/Bookmark

Sunday, July 22, 2012

చికెన్ పులావ్

చికెన్ బిర్యానీ చేయడం కొంచెం కష్టమైన పని అయితే ఈ పులావ్

చేయడం చాలా తేలిక.అన్నీ రెడీ చేసుకుంటే పావుగంటలో 

అయిపోతుంది.చల్లచల్లని వెదర్ లో స్పైసీగా నోరూరిస్తుంది.








కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                              ఒక గ్లాస్ 

చికెన్                            పావుకిలో 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     మూడు 

టమాటాలు                     రెండు 

కొత్తిమీర                        ఒక కట్ట 

పుదీనా                         ఒక కట్ట

పెరుగు                        రెండు టీ స్పూన్స్ 

గరంమసాలాపొడి             రెండు టీ స్పూన్స్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్              రెండు టీ స్పూన్స్ 

ఉప్పు,పసుపు,కారం,నూనె  

మసాలాదినుసులు 

లవంగాలు,చెక్క,యాలకులు,మరాటీ మొగ్గ ,అనాసపువ్వు,జాపత్రి,

బిర్యానీ ఆకు.



తయారు చేసే విధానం:


బియ్యం కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. 

పుదీనా,కొత్తిమీర,పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

పెరుగులో అల్లంవెల్లుల్లి పేస్ట్,ఒక టీస్పూన్ గరంమసాల పొడి,పుదీనా 

పేస్ట్,కొద్దిగా ఉప్పు,పసుపు,కారం వేసి బాగా కలిపి చికెన్ వేసి కలిపి ఒక 

అరగంట నాననివ్వాలి.

నూనె వేడిచేసి మసాలా దినుసులు వేసి వాలికలుగా కోసిన ఉల్లి

ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు తరిగిన టమాటాముక్కలు వేసి ఇవి ఉడికిన తరువాత చికెన్ 

మిశ్రమం వేసి కలపాలి.

చికెన్ కొద్దిగా ఉడికిన తరువాత ఒక స్పూన్ మసాలాపొడి వేసి కలిపి 

తగినన్ని నీళ్ళు,ఉప్పు వేయాలి.

నీరు మరుగుతుండగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి 

మూడు విజిల్స్ రానివ్వాలి.

రెడీ అయిన చికెన్ పులావు ను ఒకసారి కలిపి పెరుగు చట్నీతో 

వడ్డించాలి.
 


                     


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP