Saturday, July 30, 2011

అటుకుల దోశ

దోశలు ఎవరికైనా ఫేవరేట్ ఐటెం.అందులోనూ బోలెడు వెరైటీలు.

మామూలు దోశలు బోర్ కొట్టినప్పుడు ఈ అటుకుల దోశ చేసుకోవచ్చు.

కొంచెం మందంగా పొంగి స్పాంజ్ లా మెత్తగా ఉంటుంది.వేడివేడిగా 

కొబ్బరిపచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది






కావలసిన పదార్ధాలు:


బియ్యం                           మూడు కప్పులు 

అటుకులు                        ఒక కప్పు 

మినప్పప్పు                       అర కప్పు 

సగ్గుబియ్యం                     రెండు టీ స్పూన్లు 

ఉప్పు                               తగినంత 

నూనె 


తయారు చేసే విధానం :


బియ్యం,మినప్పప్పు,సగ్గుబియ్యం కలిపి కడిగి నాలుగైదు గంటలు 

నానబెట్టాలి 

అటుకులు కడిగి ఒక గంట  నాననివ్వాలి.

అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరునాడు ఉదయం తగినంత 

ఉప్పు కలిపి చిన్నచిన్న దోసెలు వేసుకోవాలి. 

పేనంపై వేశాక కొంచెం స్ప్రెడ్ చేసి ఉంచేస్తే చక్కగా పొంగుతుంది.మరీ 

పలుచగా చేయొద్దు 

కొంచెం నూనె వేసి రెండువైపులా కాలనిచ్చి చట్నీతో సర్వ్ చెయ్యడమే. 


Share/Bookmark

Thursday, July 28, 2011

పల్లీ - ఓట్స్ లడ్డు

లడ్డూలలో ఎన్నో వెరైటీలు.స్వీట్ ఇష్టంగా తినే ఎవరికైనా లడ్డూ ఫేవరేట్  

ఐటం.ఇప్పుడు అంతా ఆరోగ్యరీత్యా నెయ్యి,పంచదార ఇలాంటివాటికి 

దూరం కనుక వెరైటీగా పల్లీలు,ఓట్స్ కలిపి చేసే ఈలడ్డూలు హాపీగా 

తినొచ్చు.చేయడం కూడా చాలా తేలిక.





కావలసిన పదార్ధాలు :


పల్లీలు                            ఒక కప్పు 

ఓట్స్                              ఒక కప్పు 

బెల్లం                             ఒకటిన్నర కప్పు 

నెయ్యి                           రెండు మూడు స్పూన్లు 

ఇలాచీ పొడి                     ఒక స్పూన్ 


తయారు చేసే విధానం:


పల్లీలు వేయించి పొట్టు తీసుకోవాలి.

ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఓట్స్ ను దోరగా వేయించుకోవాలి.

చల్లారిన తరువాత ఈ రెండూ మెత్తగా గ్రైండ్ చేయాలి.

ఇందులో సన్నగా తరిగిన బెల్లం,ఇలాచి పొడి వేసి గ్రైండ్ చెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కరిగిన నెయ్యి రెండు స్పూన్స్ వేసి కలిపి 

లడ్డూలు చేసుకోవాలి.

నెయ్యివద్దు అనుకుంటే ఒక స్పూన్ పాలు అయినా వాడొచ్చు.పాలు 

వాడితే చాలా కొంచెం వేయాలి.ఎక్కువైతే పలుచగా అయ్యి లడ్డూ రాదు.
 


Share/Bookmark

Monday, July 25, 2011

ములక్కాయ (పాలు పోసి కూర)

ములక్కాయ,సొరకాయ ఇలా అన్ని పాలుపోసి చేసే కూరలూ వేడి 

వేడి అన్నంలో తినడానికి బావుంటాయి.బుజ్జి కుక్కర్ లో చేస్తే అయిదు 

నిమిషాల్లో చాలా తొందరగా అయిపోతాయి







కావలసిన పదార్ధాలు :


ములక్కాయలు                            రెండు 

ఉల్లిపాయలు                               మూడు

మిర్చి                                      మూడు 

కరివేపాకు                                 ఒక రెమ్మ 

ఉప్పు,కారం                               తగినంత 

పసుపు                                    కొంచెం

పాలు                                      అర కప్పు 

నూనె                                     మూడు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 


తయారు చేసే విధానం:


నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి.

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా 

వేయించాలి.

ఇప్పుడు కడిగిన ములక్కాయ ముక్కలు వేసి వేయించాలి 

రెండునిమిషాల తరువాత ఉప్పు,కారం పసుపు వేసి అరగ్లాసు నీళ్ళు 

పోసి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు 

ఉడికించాలి 

స్టీం పోయిన తరువాత తీసి నీరు ఇగిరే వరకు ఉడికించి అప్పుడు ఒక 

కప్పు పాలుపోసి అవి ఇగిరి కూర చిక్కబడేవరకు ఉంచి దించెయ్యాలి 

ఇందులో పాలు పోసేటప్పుడు ఒక స్పూన్ శనగపిండి పాలలో కలిపి వేస్తే 

కూడా కూర చాలా రుచిగా ఉంటుంది.గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది 


Share/Bookmark

Friday, July 22, 2011

స్పైసీ చికెన్ ఫ్రై

చాలా ఇష్టంగా తినే ఈ చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసెయ్యొచ్చు.కొంచెం 

స్పైసీగా ఉంటేనే రుచి బావుంటుంది.రైస్ లోకి సాంబారు,రసం వీటిలోకి 

తినడానికి బావుంటుంది 








కావలసిన పదార్ధాలు:

 

చికెన్                             అర కేజీ
 
ఉల్లిపాయలు                     రెండు
 
మిర్చి                             మూడు
 
కొత్తిమీర                          అర కప్పు
 
కరివేపాకు                        ఒక రెమ్మ
 
పచ్చి కొబ్బరి                     అర కప్పు
 
ఉప్పు,కారం                       తగినంత
 
పసుపు                           కొంచెం
 
నూనె
 
అల్లంవెల్లుల్లి ముద్ద              రెండు టీ స్పూన్స్
 
గరం మసాలా పొడి              రెండు టీ స్పూన్స్


తయారు చేసే విధానం:

 
కొబ్బరి తురుము,కొత్తిమీర,మిర్చి గ్రైండ్ చేసుకోవాలి.
 
నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,కరివేపాకు వేసి ఎర్రగా 

వేయించాలి.
 
అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొంచెం వేగాక కొబ్బరి కొత్తిమీర పేస్ట్ వేసి బాగా 

వేయించాలి.
 
పసుపు,కారం వేసి కలిపి నూనె తేలాక చికెన్ వేసి కలిపి హై లో రెండు 

మూడు నిముషాలు ఉంచాలి.
 
ఒకసారి  కలిపి మూతపెట్టి సిమ్ లో ఉడికించాలి.అవసరం అయితే 

ఒక పావుకప్ నీళ్ళు పోయొచ్చు.
 
చికెన్ మెత్తగా ఉడికిన తరువాత ఉప్పు,గరంమసాలా పొడి వేయాలి.
 
గ్రేవీ అంతా ఇగిరేవరకు ఫ్రై చెయ్యాలి.సన్నని మంటపై వేయిస్తే 

బావుంటుంది.ఇంకా స్పైసీగా కావాలంటే చివరలో మిరియాలపొడి 

కూడా వేసుకోవచ్చు.


Share/Bookmark

Tuesday, July 19, 2011

మొక్కజొన్న వడలు

వర్షాలతో పాటే మొక్కజొన్న పొత్తులు వచ్చేస్తాయి.వీటితో చాలా 

వెరైటీలు చేసుకోవచ్చు.చల్లని వర్షపు సాయంత్రాలకు ఈ మొక్కజొన్న 

వడలు మంచి కాంబినేషన్.చాలా సింపుల్ గా త్వరగా అయిపోతాయి.








కావలసిన పదార్ధాలు:

 
మొక్కజొన్న కండెలు                        రెండు
 
ఉల్లిపాయ                                    ఒకటి
 
మిర్చి                                       నాలుగు
 
కొత్తిమీర                                   ఒక కట్ట
 
కరివేపాకు                                ఒక రెమ్మ 
 
అల్లం                                      చిన్న ముక్క
 
జీలకర్ర                                    ఒక టీ స్పూన్
 
ఉప్పు                                       తగినంత
 
నూనె
 
శనగపిండి                                రెండు టేబుల్ స్పూన్స్ 

(అవసరం అయితే )

 
తయారు చేసే విధానం:


మొక్కజొన్నలు వలిచి తగినంత ఉప్పు,జీలకర్ర ,అల్లం,రెండు మిర్చి 

కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసేప్పుడు నీరు అసలు వాడొద్దు

ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కొత్తిమీర,కరివేపాకు వేసి 

కలపాలి.
 
చిన్నచిన్న వడలు చేసి కాగిన నూనెలో వేయించాలి.

పొత్తులు లేతగా ఉండి, పిండి పలుచగా అయితే శనగపిండి కలపాలి. 

లేకపోతే అవసరం లేదు 

అలాగే ఇష్టం ఉంటే కొన్ని గింజలు గ్రైండ్ చెయ్యకుండా ఉంచి పిండిలో 

కలుపుకోవచ్చు


Share/Bookmark

Saturday, July 16, 2011

టమాటా - ఓట్స్ సూప్

టమాటాలు ఓట్స్ కలిపి చేసే సూప్ ఇది.ఓట్స్ ఆహారంలో ఎక్కువ

తీసుకోమంటున్నారు కనుక విడిగా తినడానికి ఇష్టపడనివారు ఇలా 

సూప్స్ లోను,కూరలలోను చేర్చుకుంటే సరిపోతుంది.








కావలసిన పదార్ధాలు :

 

టమాటాలు                              మూడు
 
ఉల్లిపాయ                               ఒకటి                      

కారట్                                   ఒకటి 
 
ఓట్స్                                    మూడు టీ స్పూన్స్
 
ఉప్పు , మిరియాలపొడి


తయారు చేసే విధానం :


 
టమాటా,కారట్,ఉల్లి ముక్కలు కోసి కొంచెం నీరుపోసి ఉడికించాలి.

మైక్రోవేవ్ లో  మూడు నిమిషాలు హైలో పెడితే  ఉడికిపోతాయి.

ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసి తగినన్ని నీళ్ళు చేర్చి మరిగించాలి.
 
ఓట్స్ ను విడిగా దోరగా వేయించి ఇందులో వేయాలి.ఓట్స్ ఉడికి సూప్ 

చిక్కబడ్డ తరువాత ఉప్పు,మిరియాలపొడి వేసి వేడిగా సర్వ్ చెయ్యడమే.

ఇంకా ఫ్లేవర్స్ మన ఇష్టం.ఉడికించేటప్పుడు రెండు లవంగాలు,దాల్చిన

చెక్క, బిర్యాని ఆకు వేసి గ్రైండ్ చేసే ముందు వాటిని తీసేయవచ్చు.

లేదా కొంచెం గరంమసాలాపొడి అయినా వేసుకోవచ్చు.

ఇంకా ఓట్స్ ను కొంచెం వెన్నలో వేయించుకోవచ్ఛు. సర్వ్ చేసేప్పుడు 

బ్రెడ్ ముక్కలను నేతిలో వేయించి సూప్ లో వేసి ఇవ్వొచ్చు.

టమాటాలు హైబ్రిడ్ వి అయితే సూప్ మరీ పుల్లగా లేకుండా ఉంటుంది.


Share/Bookmark

Thursday, July 14, 2011

స్వీట్ కార్న్ సూప్

చల్లని వాతావరణంలో వేడివేడి సూప్స్ బావుంటాయి.స్వీట్ కార్న్,

కొంచెం కారట్ తురుము కలిపి చేసిన ఈ సూప్ కొంచెం తియ్యగా,

కొంచెం స్పైసీగా అందరికీ నచ్చుతుంది  







కావలసిన పదార్ధాలు:

స్వీట్ కార్న్                         ఒక కప్

 
కారట్ తురుము                   పావు కప్
 
ఉల్లిముక్కలు                       రెండు స్పూన్స్
 
మిర్చి                                ఒకటి
 
ఉప్పు                                 తగినంత
 
మిరియాల పొడి                   ఒక టీ స్పూన్
 
కార్న్ ఫ్లోర్                          అర స్పూన్

 

తయారు చేసే విధానం 

 

స్వీట్ కార్న్,కారట్ తురుము, ఉల్లి,మిర్చి ముక్కలు  ఉడికించాలి
 
ఒక స్పూన్ కార్న్,కారట్ విడిగా తీసి మిగిలినవి మెత్తగా గ్రైండ్ 

చేసుకోవాలి.
 
ఈ మిశ్రమంలో తగినన్ని నీళ్ళు పోసి మరిగించాలి.
 
కార్న్ ఫ్లోర్ ను ఒక స్పూన్ నీటిలో కలిపి పోసి సూప్ చిక్కబడేదాకా 

ఉంచాలి.
 
చివరగా ఉప్పు,మిరియాలపొడి వేసి కలిపి పైన కార్న్,కారట్ తురుము 

వేసి వేడిగా సర్వ్ చెయ్యాలి.
 
ఇంకా చిక్కగా కావాలంటే కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకోవచ్చు.అలాగే ఉల్లి 

మిర్చిముక్కలని ఒక స్పూన్ వెన్నలో వేయించి తరువాత కార్న్ 

మిశ్రమం వేసి కూడా చేసుకోవచ్చు


Share/Bookmark

Monday, July 11, 2011

పాలక్ - ఎగ్ ఫ్రై

ఎగ్ కర్రీ రెగ్యులర్ గా చేస్తుంటాము ఎవరమైనా.అందులోనే పాలకూర,

మెంతికూర ఇలాంటివి కలిపితే కొత్తరుచితో కూర బావుంటుంది.కొంచెం 

వెరైటీగా ఉంటుంది.ఆకుకూరలు ఎక్కువ వాడినట్టు ఉంటుంది.





కావలసిన పదార్ధాలు

ఎగ్స్                          మూడు

 
పాలకూర                   రెండు కట్టలు
 
ఉల్లిపాయ                   ఒకటి పెద్దది
 
మిర్చి                         రెండు
 
ఉప్పు,కారం                  తగినంత
 
పసుపు                      కొంచెం
 
నూనె                        రెండు టేబుల్ స్పూన్లు
 
గరంమసాల పొడి          అర టీ స్పూన్    

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి.కరివేపాకు 


తయారు చేసే విధానం:


 
నూనె వేడి చేసి తాలింపు వేయాలి.
 
సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి కరివేపాకు వేసి వేయించాలి.
 
ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూర వేసి చిటికెడు ఉప్పు వేసి నీరంతా 

పోయేవరకూ ఉడికించాలి.
 
పసుపు,కారం,తగినంత ఉప్పు వేసి కలిపి కొంచెం వేయించి, గుడ్లు 

కొట్టి ఇందులో వేయాలి.
 
కొంచెం ఉడికాక ఒకసారి కలిపి గరంమసాలాపొడి చల్లి  పొడిపొడిగా 

వేయించుకోవాలి.
 
ఈ కూర అన్నంలోకి,చపాతీ లోకి బావుంటుంది.ఇందులో పాలకూర 

బదులు మెంతికూర కూడా వేసి చెయ్యొచ్చు


Share/Bookmark

Thursday, July 7, 2011

చికెన్ మసాలా రైస్

చికెన్ తో రైస్ అంటే ఫ్రైడ్ రైస్ ఎక్కువ చేస్తుంటాము.దీన్నే చైనీస్ 

పద్ధతిలో కాకుండా చేసుకోవచ్చు.చికెన్,ఎగ్స్ ,పుదీనా,కొత్తిమీర అన్నీ 

ఉండడంతో స్పైసీ ఫ్లేవర్స్ తో అందరూ చాలా ఇష్టపడతారు.చల్లచల్లగా 

ఉండే ఈ వెదర్ లో  వేడివేడిగా ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇది 

ఇండియన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట.








కావలసిన పదార్ధాలు:


చికెన్                                  ఒక కప్పు 

ఎగ్స్                                   రెండు 

అన్నం                                రెండు కప్పులు 

పుదీనా                               పావుకప్పు 

కొత్తిమీర                              పావు కప్పు

ఉల్లిపాయ                             ఒకటి 

పచ్చిమిర్చి                           రెండు 

టమాటా                               ఒకటి

కరివేపాకు                            ఒక రెమ్మ 

ఉప్పు,కారం                           తగినంత

పసుపు                               కొంచెం 

నూనె                                రెండు టేబుల్ స్పూన్స్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్                     ఒక టీ స్పూన్ 

గరం మసాలా పొడి                  ఒక టీ స్పూన్

తాలింపుకు  రెండు లవంగాలు,చిన్న దాల్చినచెక్క ముక్క,షాజీర  


తయారు చేసే విధానం:


చికెన్ ను చిటికెడు,ఉప్పు,కారం,వేసి ఉడికించి బోన్స్ తీసేసి సన్నగా 

కోసి ఉంచుకోవాలి.

ఒక టీస్పూన్ నూనె వేడిచేసి అందులో ఎగ్స్ బ్రేక్ చేసి పొడిపొడిగా 

ఉడికించి తీసుకోవాలి.

నూనె వేడిచేసి లవంగాలు,చెక్క,షాజీర వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి 

వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు కరివేపాకు, తరిగిన టమాటాముక్కలు వేయాలి. టమాటా 

మగ్గిన తరువాత సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక ఉడికించిన చికెన్ ముక్కలు,

ఎగ్స్ వేసి కారం,పసుపు వేసి కలిపి రెండు నిముషాలు వేయించాలి.

చివరగా అన్నం,తగినంత ఉప్పు,గరంమసాలాపొడి వేసి సన్నని సెగపై 

అంతా బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి.

కొంచెం కొత్తిమీర చల్లి వేడిగా వడ్డిస్తే చికెన్ మసాలా రైస్ నోరూరిస్తుంది.

ఇష్టం ఉంటే ఇంకా ఇందులో ఉడికించిన ప్రాన్స్,కీమా లేదా మటన్ వేసి 

మిక్స్ డ్ రైస్ కూడా చేసుకోవచ్చు.

 


Share/Bookmark

Monday, July 4, 2011

కొబ్బరి - శనగపప్పు కూర

పచ్చి కొబ్బరి తురుము,శనగపప్పు కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా 

ఉంటుంది.సింపుల్ గా అయిపోతుంది కూడా. 







కావలసిన పదార్ధాలు:

శనగపప్పు                                    ఒక కప్పు 

కొబ్బరి తురుము                            ఒక కప్పు 

ఉల్లిపాయ                                      ఒకటి 

మిర్చి                                           రెండు 

కరివేపాకు                                     ఒక రెమ్మ 

అల్లంవెల్లుల్లి పేస్ట్                             అర స్పూన్ 

గరం మసాల పొడి                           ఒక టీ స్పూన్ 

నూనె                                         ఒక టేబుల్ స్పూన్ 

తాలింపుకు  ఆవాలు,జీలకర్ర ఎండుమిర్చి


తయారు చేసే విధానం:


శనగపప్పు ఒక అరగంట నానబెట్టుకోవాలి 

ఇపుడు ఉల్లి,మిర్చి ముక్కలు కలిపి తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్లో వేసి 

ఉడికించుకోవాలి.

మూత తీసాక కొబ్బరితురుము,ఉప్పు,కారం,అల్లంవెల్లుల్లి పేస్ట్,మసాలా 

అన్నీ వేసి కూర చిక్కబడేదాకా ఉడికించుకోవాలి.

నూనె వేడిచేసి తాలింపు వేసి కలిపితే ఘుమఘుమలాడే కొబ్బరి కూర 

రెడీ అయిపోతుంది.అన్నంలోకి ఇది చాలా బావుంటుంది. 


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP