Friday, September 28, 2012

ఆలూ ఫ్రై

ఆలుగడ్డ వేపుడు ఇష్టపడని వారు బహుశా ఎవరూ ఉండరేమో.ఇంట్లో 

ఏ కూరగాయలూ లేనప్పుడు కూడా రెండు దుంపలు ఉంటే రెడీ 

అయిపోయే ఈకూరను మైక్రోవేవ్ లో ఇంకా సింపుల్ గా చేసెయ్యొచ్చు. 







కావలసిన పదార్ధాలు:


బంగాళదుంపలు              మూడు 

ఉల్లిపాయ                      ఒకటి 

పచ్చిమిర్చి                     రెండు 

కరివేపాకు                      ఒకరెమ్మ 

కొత్తిమీర                        కొద్దిగా 

అల్లంతురుము               అర స్పూన్ 

ఉప్పు,కారం,పసుపు,నూనె,గరంమసాలా పొడి 

తాలింపుకు శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి.



తయారు చేసే విధానం:



దుంపలు చెక్కు తీసి సన్నగా తరిగి నీళ్ళలో వేయాలి.

అల్లం,మిర్చి నూరుకోవాలి.

మైక్రో సేఫ్ బౌల్ లో నూనె వేసి వేడిచేసి తాలింపు దినుసులు వేసి 

ఒక నిమిషం హై లో పెట్టాలి.

సన్నగా తరిగిన ఉల్లిపాయ,అల్లం మిర్చి ముద్ద వేసి రెండు నిమిషాలు

 పెట్టాలి.

ఇప్పుడు ఆలు ముక్కలు వేసి కలిపి మూడు నిముషాలు హై లో పెట్టాలి.

ఉప్పు,పసుపు,కారం వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూడు నిముషాలు 

పెట్టాలి.

చివరగా గరం మసాలా పొడి,కొత్తిమీర వేసి కలిపి మరొక రెండు 

నిముషాలు పెడితే కమ్మని ఫ్రై రెడీ అవుతుంది.

మైక్రోవేవ్ లో చేయడం వలన కూర ముద్ద అవకుండా పొడిపొడిగా 

వస్తుంది.



Share/Bookmark

Monday, September 17, 2012

చాకో నట్ లాలీపప్స్



చాక్లెట్,బిస్కట్స్,నట్స్ ఇలా అన్నీ ఇష్టమైనవి కలిపి వాటిని లాలీపప్స్ 

లా ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టపడతారు పది నిమిషాల్లో చేసి వెరైటీగా 

ఇవ్వొచ్చు.చెపితే తప్ప ఇందులో బిస్కట్స్ కలిపినట్టు తెలియదు 











కావలసిన పదార్ధాలు:


మారీ బిస్కట్స్                    ఒక చిన్నపాకెట్ 

ఫైవ్ స్టార్ చాక్లెట్                  ఒకటి 50 గ్రామ్స్ 

పంచదార                         రెండు టీ స్పూన్స్ 

నెయ్యి లేదా వెన్న               రెండు టీ స్పూన్స్ 

క్రీం                               రెండు టీ స్పూన్స్ 

వెనీలా ఎసెన్స్                    కొద్దిగా 

కాజూ,బాదం,కిస్మిస్ అన్నీ కలిపి ఒక చిన్న కప్ 


తయారు చేసే విధానం:


మారీ బిస్కట్స్ ను పొడి చేసుకోవాలి 

చాక్లెట్ ను ముక్కలు చేసి మెల్ట్ చేసుకోవాలి.ఇందులో నెయ్యి,క్రీం 

వేసి కలపాలి.

పంచదారను పొడి చేసి బిస్కట్  పొడిలో వేయాలి.

కాజూ,బాదం ను కొన్నింటిని కోర్స్ గా గ్రైండ్ చేసి ,మరి కొన్నింటిని 

సన్నగా తరిగి ఈ మిశ్రమంలో వేయాలి.కిస్మిస్ కూడా వేయాలి.

చివరగా ఎసెన్స్,కరిగిన చాక్లెట్ మిశ్రమం కూడా వేసి బాగా కలిపి చిన్న

చిన్న బాల్స్ చేయాలి.

ఈ బాల్స్ కి టూత్ పిక్స్ గుచ్చి ఇస్తే లాలీపప్స్ రెడీ.  

ఒకవేళ బాల్స్ చెయ్యడానికి రాక పొడిపొడిగా ఉంటె ఒక స్పూన్ పాలు 

చల్లుకుని చెయ్యొచ్చు.

కావాలంటే చాక్లెట్ ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు


Share/Bookmark

Friday, September 14, 2012

ఫ్రూటీ కార్న్ సలాడ్

ఎప్పుడైనా ఒక పూట బ్రేక్ ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లైట్ గా చేసేద్దాం 

అనుకుంటే ఈ సలాడ్ మంచి ఆప్షన్.హాయిగా టేబుల్ దగ్గర కూర్చుని 

చేసుకోవచ్చు.







కావలసిన పదార్ధాలు:



ఉడికించిన స్వీట్ కార్న్     ఒక కప్పు 

బొప్పాయి,మామిడి,యాపిల్,అరటి,ద్రాక్ష,దానిమ్మ ఇలా ఇంట్లో ఉన్న 

ఏవైనా పళ్ళ ముక్కలు      రెండు కప్పులు 

ఉప్పు,మిరియాలపొడి        చిటికెడు 

చాట్ మసాలా                పావు స్పూన్ 

తేనె                         రెండు స్పూన్స్ 


తయారు చేసే విధానం:



అన్ని పళ్ళూ  సన్నగా కట్ చేసుకోవాలి.

ఇందులో ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేయాలి.

చిటికెడు ఉప్పు,మిరియాలపొడి,చాట్ మసాలా,తేనే అన్నీ వేసి బాగా 

కలిపి సర్వ్ చేసేయ్యడమే.

ఇష్టం ఉంటే కొంచెం నిమ్మరసం కూడా వెయ్యొచ్చు

మిగిలిన ఫ్రూట్స్ అన్నీ ముందు కట్ చేసి ఉంచుకున్నా,యాపిల్,అరటి 

మాత్రం సర్వ్ చేసేటప్పుడు కట్ చేసి కలపాలి.



Share/Bookmark

Sunday, September 9, 2012

సగ్గుబియ్యం - సొరకాయ పాయసం

చాలామంది సొరకాయ ఇష్టంగా తింటారు.చాలామంది తినరు కూడా.

ఏది ఏమైనా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిదైన ఈ సొరకాయతో 

కూరలే కాదు క్రీమీగా ఉండే ఈ పాయసం కూడా బావుంటుంది.చేసి 

చూడండి.






కావలసిన పదార్ధాలు:



సొరకాయ తురుము               ఒక కప్పు 

సన్న సగ్గుబియ్యం                రెండు టీ స్పూన్స్ 

పాలు                               అర లీటరు 

పంచదార                          అర కప్పు 

ఇలాచీ పొడి                       ఒక టీ స్పూన్ 

నెయ్యి                             ఒక టేబుల్ స్పూన్ 

కాజూ,బాదం,కిస్మిస్ 



తయారు చేసే విధానం:



సొరకాయ చెక్కు తీసి తురుముకుని నీరు పిండేసి ఉంచుకోవాలి.

నెయ్యి వేడి చేసి కాజూ,కిస్మిస్ వేయించి తీసుకోవాలి.

ఇదే నేతిలో సొరకాయ తురుము నాలుగైదు నిముషాలు వేయించాలి.

ఇప్పుడు పాలు పోసి,సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించాలి.

సగ్గుబియ్యం ఉడికి,సొరకాయ తురుము మెత్తగా అయ్యాక పంచదార 

వేసి కలపాలి.

పాయసం చిక్కబడుతుండగా ఇలాచీ పొడి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

కాజూ,బాదం,కిస్మిస్ వేసి కలిపి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చెయ్యాలి.

సగ్గుబియ్యం ఆప్షనల్.వెయ్యకుండా కూడా చెయ్యొచ్చు.అలాగే సన్నవి 

లేకపోతే మామూలు సగ్గుబియ్యం కూడా వాడొచ్చు.




Share/Bookmark

Thursday, September 6, 2012

కాప్సికమ్ - టమాటా రైస్

క్రంచీగా ఉండే కాప్సికం ఇష్టపడతారా,అయితే ఈ రైస్ వెరైటీ 

తప్పకుండా నచ్చుతుంది. లంచ్ బాక్స్ లోకి చేసి ఇవ్వాలన్నాఈజీగా 

చేసి ఇవ్వొచ్చు.ఎక్కువ మసాలాలు లేకుండా లైట్ ఫ్లేవర్ తో ఉంటుంది.








కావలసిన పదార్ధాలు:




అన్నం                       రెండు కప్పులు 

కాప్సికం                     ఒకటి 


టమాటా                     ఒకటి 


ఉల్లిపాయ                   ఒకటి


పచ్చిమిర్చి                 ఒకటి 


కొత్తిమీర                     కొద్దిగా


కాజూ                        అయిదారు 


ఉప్పు,కారం,పసుపు,నూనె


వేయించిన పల్లీలు,నువ్వుల పొడి లేదా గరం మసాలా పొడి 





తయారు చేసే విధానం:


రెండు టీ స్పూన్స్ నూనె వేడిచేసి కాజూ,జీలకర్ర,ఆవాలు వేయాలి.

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి వేగిన తరువాత సన్నగా తరిగిన 

టమాటా వేయాలి.

టమాటా ఉడికిన తరువాత కాప్సికం ముక్కలు వేసి బాగా కలిపి 

వేగనివ్వాలి.

చిటికెడు పసుపు,కారం వేసి అన్నం,తగినంత ఉప్పు వేసి బాగా 

కలపాలి.చివరగా అరస్పూన్ గరంమసాలా పొడి,కొత్తిమీర చల్లి కలిపి 

రెండు నిముషాలు  వేయించాలి.

మసాలా ఫ్లేవర్ వద్దు అనుకుంటే వేయించిన పల్లీలు,నువ్వుల పొడి 

ఒక టీ స్పూన్ వేస్తే కూడా చాలా బావుంటుంది.




Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP