Friday, September 30, 2011

జీడిపప్పు పాకం

ఈ బ్లాగ్ లో ఇది 100 వ పోస్ట్.నిజంగా చాలా ఆనందంగా ఉంది.

సరదాగా మొదలుపెట్టిన బ్లాగ్ ఎన్ని అనుభూతులు మిగిల్చిందో 

మాటల్లో చెప్పలేను.నచ్చినవాటికి కామెంట్స్ పెట్టి ఆదరించిన మీ 

అందరికీ థాంక్ యూ వెరీమచ్.

ఈ సందర్భంగా మావారికి స్పెషల్ గా థాంక్స్ చెప్పుకోవాలి.ఈ బ్లాగ్ 

కోసమే కెమేరా కొనుక్కొచ్చి గిఫ్ట్ గా ఇచ్చి ప్రోత్సహించినందుకు. 

              వందవ పోస్ట్ కాబట్టి కొంచెం స్పెషల్ గా ఈస్వీట్.జీడిపప్పు 

పాకం చేయడం చాలా తేలిక.ఇదే బయట కొనాలంటే చాలా కాస్ట్లీగా 

ఉంటుంది.ఒక్క పావుగంట కష్టపడితే సింపుల్ గా కాజూ వేయించుకుని 

పాకం పట్టేసుకోవచ్చు.
కావలసిన పదార్ధాలు:


జీడిపప్పు                            పావుకిలో

బెల్లం                                ఒక కప్

పంచదార                           అర కప్

నెయ్యి                              మూడు టీ స్పూన్స్

ఇలాచీ పొడి                         అర స్పూన్


తయారు చేసే విధానం :


నెయ్యి వేడి చేసి జీడిపప్పును దోరగా వేయించుకోవాలి.

బెల్లం,పంచదార కొంచెం నీళ్ళు పోసి ,కరిగిన తరువాత వడపోసుకోవాలి

తిరిగి స్టవ్ మీద పెట్టి ఉండ పాకం రానివ్వాలి.కొంచెం పాకం నీళ్ళల్లో 

వేస్తే ఉండలా ఫాం అవుతుంది

ఇప్పుడు ఇలాచీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.వేయించిన జీడిపప్పును 

పాకంలో వేసి బాగా కలపాలి.

ఒక ప్లేట్ లో కొంచెం నెయ్యి రాసి అచ్చు పోసెయ్యాలి.

ఆరాక కదిపితే అచ్చు వచ్చేస్తుంది.దీన్ని ముక్కలు చేసుకుని స్టోర్  

చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే  జీడిపప్పు పాకం నిమిషాల్లో రెడీ 

అయిపోతుంది


Share/Bookmark

Wednesday, September 28, 2011

స్వీట్ కార్న్ హల్వా

స్వీట్ కార్న్ తో హల్వా చేసుకుంటే వెరైటీగా ఉంటుంది.మామూలు 

మొక్కజొన్నపొత్తులతో కూడా ఇలాగే చేసుకోవచ్చు.కావలసిన  పదార్ధాలు:


స్వీట్ కార్న్                         ఒక కప్పు 

పాలు                                ఒక కప్పు 

పంచదార                           అర కప్పు 

నెయ్యి                             రెండు మూడు టేబుల్ స్పూన్స్ 

ఇలాచీ పొడి                        అర స్పూన్ 

కాజూ,కిస్మిస్


తయారు చేసే విధానం:


స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి మైక్రోవేవ్ లో రెండు 

నిముషాలు పెడితే సరిపోతుంది.

వీటిని కొంచెం పాలతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

నెయ్యి వేడిచేసి కార్న్ ముద్దను కొంచెం వేయించి పాలు పోసి 

ఉడకనివ్వాలి.

ఇప్పుడు పంచదార వేసి కలిపి దగ్గరయ్యేవరకూ ఉడికించాలి.

చివరగా ఇలాచీపొడి వేయాలి.ఇష్టం ఉంటే నెయ్యి ఇంకొంచెం 

వేసుకోవచ్చు.

ఒక బౌల్ లోకి తీసుకుని నేతిలో వేయించిన కాజూ,కిస్మిస్ తో 

అలంకరించుకోవాలి.


Share/Bookmark

Monday, September 26, 2011

డేట్స్ మిల్క్ షేక్

ఖర్జూరాలు,తేనె కలిపి చేసే ఈ మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది.

పిల్లలు చాలా ఇష్టపడతారు.హెల్త్ కి కూడా మంచిది.


కావలసిన పదార్ధాలు :


ఖర్జూరాలు                         ఎనిమిది 

చల్లని పాలు                       ఒక కప్ 

తేనె                                ఒక టీ స్పూన్ 

పంచదార                          అర స్పూన్ 

కాజూ,కిస్మిస్ 


తయారు చేసే విధానం :


ఖర్జూరాలను గింజలు తీసేసి కొంచెం పాలలో నానబెట్టాలి.

ఒక గంట తరువాత మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

ఇందులో పంచదార,మిగిలిన పాలు పోసి బ్లెండ్ చెయ్యాలి.

తేనె కలిపి ఒక గ్లాస్ లో పోసి కాజూ,కిస్మిస్ వేసి ఇవ్వాలి.

ఇందులో మొత్తం తేనె,లేదా మొత్తం పంచదార అయినా వాడొచ్చు
 


Share/Bookmark

Saturday, September 24, 2011

అటుకుల కట్లెట్

ఎప్పుడూ పకోడీలు,బజ్జీలు స్నాక్స్ అంటే ఇవేనా అనుకున్నప్పుడు 

వెరైటీగా ఉండాలంటే ఈ కట్లెట్స్ చెయ్యొచ్చు.అటుకులు,ఆలూ కలిపి 

చేసే ఈ కట్లెట్ చేయడం కూడా సింపుల్.కావలసిన పదార్ధాలు:


అటుకులు                        ఒక కప్పు 

బంగాళదుంప                   ఒకటి (కొంచెం పెద్దది)

శనగపిండి                       రెండు టేబుల్ స్పూన్స్ 

ఉల్లిపాయ                         ఒకటి 

మిర్చి                             మూడు 

కొత్తిమీర                          అర కప్పు 

అల్లం తురుము                  అర స్పూన్

కరివేపాకు                        ఒక రెమ్మ 

ఉప్పు,నూనె,టమాటా సాస్


తయారు చేసే విధానం:


అటుకులు కడిగి నీరు వంపి ఉంచాలి.ఆలూ ఉడికించి తీసుకోవాలి.

మెత్తబడ్డ అటుకులు,మాష్ చేసిన ఆలు ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,అల్లం,కరివేపాకు 

వేయాలి.

తగినంత ఉప్పు,శనగపిండి వేసి అన్నీ బాగా కలిపి ముద్ద చేసుకోవాలి.

అవసరం అయితే కొంచెం నీరు చల్లుకోవచ్చు.

ఇష్టమైన షేప్ లో కట్లెట్స్ చేసుకుని కాగిన నూనెలో వేయించుకోవాలి.

వేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి.
Share/Bookmark

Thursday, September 22, 2011

చికెన్ తంగ్డి కబాబ్

కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి,వాటిని ఎంత ఇష్టపడినా ఇంట్లో 

చేయడం తక్కువే.మైక్రోవేవ్ తో పాటు వచ్చిన బుక్ లో రెసిపీ చూసి 

చేసిన ఈ చికెన్ కబాబ్ చాలా బాగా కుదిరింది.మారినేషన్ తయారు 

చేసుకుంటే చాలు సింపుల్ గా అయిపోతుంది.కావలసిన పదార్ధాలు:


చికెన్ లెగ్స్                   రెండు 


ఫస్ట్ మారినేషన్ 


నిమ్మరసం                      ఒక టీ స్పూన్ 

నూనె                           ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం                      కొంచెం 


సెకండ్ మారినేషన్ కు 


పెరుగు                                 పావు కప్ 

నూనె                                 ఒక టీ స్పూన్

మీగడ                                రెండు టీ స్పూన్స్ 

కొత్తిమీర                             రెండు టీ స్పూన్స్ 

కసూరి మేతి                         ఒక టీ స్పూన్ 

కార్న్ ఫ్లోర్                            ఒక టీ స్పూన్ 

కాజూ పౌడర్                         ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం                          తగినంత 

గరంమసాలాపొడి                   ఒక టీ స్పూన్ 

అల్లంవెల్లుల్లి ముద్ద                 ఒక టేబుల్ స్పూన్ 


తయారు చేసే విధానం:


చికెన్ పీసెస్ కు రెండుమూడు చోట్ల చాకుతో చిన్నకట్స్ చెయ్యాలి.
నిమ్మరసం,నూనె,ఉప్పు,కారం ఒక బౌల్ లో వేసి కలిపి చికెన్ 
 పీసెస్ వేసి ఒక అరగంట నాననివ్వాలి.

మరొక బౌల్ లో సెకండ్ మారినేషన్ కు రాసినవాటిని వేసి బాగా కలిపి 

నిమ్మరసంలో ఉన్న చికెన్ పీసెస్ ను ఈ పెరుగు మిశ్రమంలో వేసి 

మరో అరగంట నాననివ్వాలి.మిగిలిన నిమ్మరసం వేయొద్దు.

ఎక్కువసేపు ఉంచినా ఇంకా బావుంటుంది.ఉదయాన్నేఇది రెడీ చేసేసి 

సాయంత్రం చేసుకోవాలంటే మాత్రం ఫ్రిజ్ లో ఉంచేస్తే సరిపోతుంది.

ఒక వెడల్పు గాజుడిష్ లో కొంచెం నూనె వేసి ఈ చికెన్ పీసెస్ ఉంచి 

మైక్రోవేవ్ కాంబినేషన్ మోడ్(మైక్రో480w +గ్రిల్) లో ఆరేడు 

నిముషాలు ఉంచాలి.

ఒకసారి తీసి చికెన్ పీసెస్ కు మిగిలిన మిశ్రమం పట్టించి రెండోవైపు 

ఉంచి మరొక నాలుగు నిముషాలు ఇదే మోడ్ లో ఉంచితే రుచికరమైన 

కబాబ్స్ రెడీ అవుతాయి.

ఓవెన్ లేకపోయినా నాన్ స్టిక్ పాన్లో సన్నని సెగపై చికెన్ ఉడికి బాగా 

వేగే వరకూ ఉంచి చేసుకోవచ్చు.


Share/Bookmark

Monday, September 19, 2011

ఓట్స్ , అటుకుల లడ్డు

ఓట్స్ ,అటుకులు కలిపి చేసే ఈలడ్డూ చేయడం చాలా తేలిక.వెరైటీగా 

కూడా ఉంటాయి.మూడు నాలుగు రోజులు ఉండాలి అంటే పాలు

కాకుండా నెయ్యి వాడితే బావుంటుంది.
కావలసిన పదార్ధాలు

 
ఓట్స్                            ఒక కప్పు

అటుకులు                     ఒక కప్పు
 
పంచదార                      ఒక కప్పు  

నెయ్యి                          రెండు స్పూన్లు
 
పాలు                            కొంచెం
 
ఇలాచి పొడి                     పావు స్పూన్
 
కాజు,బాదం                     కొద్దిగా

 
తయారు చేసే విధానం

 
నెయ్యి వేడి చేసి ఓట్స్ ను,అటుకులను సన్నని సెగపై  బంగారు రంగు 

వచ్చేవరకు వేయించాలి.
 
మైక్రోవేవ్ లో అయితే ఒక సేఫ్ బౌల్ లో నెయ్యి ,ఓట్స్,అటుకులు వేసి 

ఒక నిమిషం హై లో పెట్టాలి.ఒకసారి కలిపి టెంపరేచర్ తగ్గించి ఇంకో 

రెండు నిముషాలు పెడితే చక్కగా ఫ్రై అవుతాయి,
 
చల్లారిన తరువాత ఓట్స్,అటుకులు,పంచదార మిక్సీలో మెత్తగా గ్రైండ్ 

చేసుకోవాలి
 
ఈ పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకుని కాజు, బాదం  వేసి ఇలాచి పొడి 

కూడా వేసి కలపాలి.
 
ఇప్పుడు రెండు స్పూన్లు పాలు వేసి కలిపి చిన్నచిన్న లడ్డూలు 

చేసుకోవాలి
 
పాలు కాకుండా కొంచెం కరిగిన నెయ్యి వేసి కూడా లడ్డూలు 

చేసుకోవచ్చు.


Share/Bookmark

Thursday, September 15, 2011

దొండకాయ కొబ్బరి పచ్చడి

దొండకాయలు,కొత్తిమీర, కొబ్బరి కలిపి చేసే ఈ రోటిపచ్చడి అన్నంలోకి 

చాలా బావుంటుంది.కొబ్బరి వేయకుండా దొండకాయలు,కొత్తిమీర తో 

చేసుకున్నా బావుంటుంది.


కావలసిన పదార్ధాలు:


దొండకాయలు                     పావుకిలో 

కొబ్బరి తురుము                  ఒక కప్పు 

కొత్తిమీర                            ఒక కట్ట 

పచ్చిమిర్చి                        పది 

చింతపండు                        కొంచెం 

జీలకర్ర                            అర స్పూన్ 

వెల్లుల్లి రెబ్బలు                   నాలుగు 

ఉప్పు                               తగినంత

పసుపు                           చిటికెడు 

నూనె                              రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు  తయారు చేసే విధానం;


చక్రాల్లా తరిగిన దొండకాయలు,మిర్చి కలిపి ఒక స్పూన్ నూనె వేసి 

వేయించాలి 

మిర్చి,ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర,చింతపండు కలిపి మెత్తగా గ్రైండ్ 

చెయ్యాలి.

ఇప్పుడు దొండకాయ ముక్కలు,కొబ్బరి కూడా వేసి మరీ మెత్తగా 

కాకుండా కోరులా గ్రైండ్ చేసుకోవాలి.

ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసుకుని,అందులో 

ఈ పచ్చడి, చిటికెడు పసుపు వేసి రెండు నిముషాలు వేయించాలి.

ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బావుంటుంది.కారం తక్కువ 

కావాలంటే  మిర్చి తగ్గించుకోవచ్చు.


Share/Bookmark

Monday, September 12, 2011

టమాటా - కొబ్బరి పులావ్

కొంచెం పచ్చికొబ్బరి ఫ్లేవర్,పుల్లపుల్లని టమాటా టేస్ట్ తో ఉండే ఈ 

పులావ్ చేయడం చాల తేలిక.పదినిమిషాల్లో రెడీ అయిపోతుంది.

కావలసిన పదార్ధాలు:


బియ్యం                           రెండు కప్పులు 

టమాటాలు                        రెండు 

కొబ్బరితురుము                 అర కప్పు 

ఉల్లిపాయ                        ఒకటి 

మిర్చి                            రెండు 

పసుపు                           కొంచెం 

ఉప్పు,నూనె                     తగినంత 

కొత్తిమీర                         ఒక కట్ట 

కరివేపాకు                       ఒక రెమ్మ

అల్లంవెల్లుల్లి పేస్ట్               రెండు టీస్పూన్స్

గరంమసాలా పొడి              రెండు టీస్పూన్స్

 రెండు లవంగాలు,చెక్క,యాలకులు,బిర్యానీ ఆకు 


తయారు చేసే పధ్ధతి ;


బియ్యం కడిగి నానబెట్టుకోవాలి.

టమాటాలు ముక్కలు కోసి పచ్చికొబ్బరితో కలిపి మెత్తగా గ్రైండ్ 

చేసుకోవాలి.

నూనె వేడిచేసి మసాలాదినుసులు వేగాక సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి 

వేసి వేయించాలి.

అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత కరివేపాకు,టమాటా పేస్ట్ వేసి 

ఉడికించాలి.

ఇప్పుడు పసుపు,గరంమసాలా పొడి కొత్తిమీర వేసి కొంచెం వేయించి 

నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేయాలి.

చివరగా నానబెట్టిన బియ్యం వేసి కలిపి పాన్ మూత పెట్టి మూడు 

విజిల్స్ రానివ్వాలి.

ఒకసారి కలిపి వేడిగా సర్వ్ చేస్తే టమాటాపులావ్ నోరూరిస్తుంది.


Share/Bookmark

Saturday, September 10, 2011

మేథీ మటర్ మలై

పూరీ,చపాతీ,రోటీ వీటిలోకి వెరైటీ కర్రీస్ బావుంటాయి.ఎప్పుడూ చేసే 

మిక్స్డ్ వెజిటబుల్ కూర బదులు ఇలాంటివి చేస్తే రెస్టారెంట్ లో తిన్న 

ఫీల్ వచ్చేస్తుంది.మెంతికూర,బటానీల ఫ్లేవర్స్ తో ఈ కర్రీ చాలా రుచిగా 

ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:


మెంతికూర                            మూడు కట్టలు 

పచ్చి బటానీలు                        ఒక కప్పు 

ఉల్లిపాయ                               ఒకటి 

పచ్చిమిర్చి                             ఒకటి

అల్లంవెల్లుల్లి పేస్ట్                      ఒక టీస్పూన్

గరం మసాల పొడి                    అర టీస్పూన్

పసుపు                                చిటికెడు 

కారం                                   పావు స్పూన్

ఉప్పు                                   తగినంత 

నూనె                                  రెండు టీ స్పూన్స్ 

మీగడ                                 రెండు టేబుల్ స్పూన్స్ 

జీడిపప్పు పొడి                       ఒక స్పూన్

గసగసాలు పొడి                     ఒక స్పూన్

రెండు లవంగాలు,ఒక ఇలాచీ,చిన్న దాల్చినచెక్క,జీలకర్ర


తయారు చేసే విధానం:


బటానీలు ఉడికించుకోవాలి.

ఉల్లిపాయముక్కలు,మిర్చి ఉడికించి పేస్ట్ చేసుకోవాలి.  

నూనె వేడిచేసి జీలకర్ర,లవంగాలు,చెక్క,ఇలాచీ వేసి ఉల్లిపాయ పేస్ట్

వేయించాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత మెంతికూర,ఉడికించిన 

బటానీలు వేయాలి.

పసుపు,కారం,కాజూ గసగసాల పొడి వేసి బాగాకలిపి కొంచెం నీరు పోసి

ఉడికించాలి.తగినంత ఉప్పు,గరంమసాల పొడి వేసి కలపాలి

కూర చిక్కబడుతుండగా మీగడ వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి,

వేడిగా చపాతీతో వడ్డిస్తే బావుంటుందిShare/Bookmark

Wednesday, September 7, 2011

ఫ్రూట్ రబ్డి

పాలను బాగా మరిగించి అన్నిరకాల ఫ్రూట్స్ కలిపి సర్వ్ చేసే ఈ రబ్డి

చాలా రుచిగా ఉంటుంది.పిల్లలకు బాగా నచ్చుతుంది.కావలసిన పదార్ధాలు :చిక్కని పాలు               అరలీటరు 

పంచదార                    అర కప్పు 

ఇలాచీ పొడి                 అర స్పూన్ 

బాదంమిక్స్                  అర స్పూన్

యాపిల్,మామిడి,ద్రాక్ష,అరటి,పైన్ యాపిల్.దానిమ్మగింజలు  ఇలా 

ఏవైనా ఒక కప్పు పళ్ళముక్కలు


తయారు చేసే విధానం:


నాన్ స్టిక్ పాన్ లో పాలు పోసి బాగా మరిగించాలి.అరలీటరు పాలు   

పావులీటరు అయ్యాక పంచదార కలిపి ,అది కరిగి మిశ్రమం కొంచెం 

చిక్కగా అయ్యాక బాదం పౌడర్ ,ఇలాచీపొడి వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. 

చల్లారాక ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసేప్పుడు సన్నగా కోసిన అన్నిరకాల 

పళ్ళు కలపాలి.

పళ్ళు వద్దు అనుకుంటే కాజూ,బాదం,ఖర్జూరాలు,కిస్మిస్ ఇలా డ్రైఫ్రూట్స్ 

అన్నీ కలపొచ్చు.

వీటితోపాటు చిట్టిచిట్టి గులాబ్ జామూన్స్ కానీ,రసగుల్లాలు కానీ 

వేసినా బావుంటుందిShare/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP