Monday, April 30, 2012

కొబ్బరన్నం

కొబ్బరన్నం అంటే సాధారణంగా పచ్చికొబ్బరి తురుముతో చేస్తారు.అది 

ఒక వెరైటీ అయితే కొబ్బరిపాలు ఉపయోగించి చేసే వెరైటీ ఇది.ఎక్కువ 

మసాలాలు లేకుండా కొబ్బరి పాలతో ఉడికిన ఈ రైస్ మంచి ఫ్లేవర్ తో 

చాలా రుచిగా ఉంటుంది.








కావలసిన పదార్ధాలు:



బాస్మతి రైస్                           పావుకిలో 

కొబ్బరితురుము                      రెండుకప్పులు

ఉల్లిపాయ                              ఒకటి 

పచ్చిమిర్చి                            రెండు 

కొత్తిమీర                               ఒక కట్ట 

టమాటాలు                           రెండు 

అల్లంవెల్లుల్లి పేస్ట్                  ఒక టేబుల్ స్పూన్ 

గరంమసాలాపొడి                ఒక టేబుల్ స్పూన్

ఉప్పు,పసుపు,నూనె 

లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర,బిర్యానీ ఆకు  


తయారు చేసే విధానం:


బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టాలి.

కొబ్బరి తురుము  గ్రైండ్ చేసి కొబ్బరిపాలు తీసుకోవాలి.

నూనె వేడిచేసి షాజీర,లవంగాలు,చెక్క,యాలకులు వేయాలి.సన్నగా 

తరిగిన ఉల్లి,మిర్చి వేసి ఎర్రగా వేయించాలి.

తరిగిన టమాటాలు,కొత్తిమీర వేసి ఉడికిన తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద

వేసి వేయించాలి.నూనె విడుతుండగా గరమ్మసాలాపొడి కూడావేసి 

బియ్యానికి సరిపోయేంత కొబ్బరి పాలు పోయాలి.(సగం కొబ్బరిపాలు,

సగం నీళ్ళు కూడా వాడొచ్చు.)

తగినంత ఉప్పు,చిటికెడు పసుపు వేసి మరిగిన తరువాత బియ్యం వేసి 

కలిపి కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

వేడిగా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ,పనీర్ కర్రీతో కానీ సర్వ్ చెయ్యాలి.

 



Share/Bookmark

Saturday, April 28, 2012

కారట్ మూంగ్ దాల్ ఖీర్

కారట్ పెసరపప్పు కలిపి చేసే హెల్దీ ఖీర్ ఇది.పెసరపప్పు నానబెట్టుకుని 

రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది.







కావలసిన పదార్ధాలు


పెసరపప్పు                         ఒక కప్పు 

కారట్ తురుము                   ఒక కప్పు 

చిక్కని పాలు                      అర లీటరు 

పంచదార                          రెండు కప్పులు 

ఇలాచీ పొడి                      ఒక టీ స్పూన్ 

కాజూ,నెయ్యి



తయారు చేసే విధానం:


పెసరపప్పు రెండుగంటలు నానబెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.

ఒక టీ స్పూన్ నెయ్యి వేడిచేసి కాజూ వేయించి తీసుకోవాలి.

మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసి కారట్ తురుమును వేయించాలి.

ఇప్పుడు పాలు పోసి కారట్ తురుము ఉడికించాలి.

ఉడికిన పప్పు కూడా కలిపి పంచదార వేయాలి.బాగా ఉడికి ఖీర్ చిక్కగా

అయ్యాక ఇలాచీ పొడి వేసి కలపాలి.

కాజూ వేసి ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే బావుంటుంది.


Share/Bookmark

Thursday, April 26, 2012

రొయ్యల పచ్చడి (ప్రాన్స్ పికిల్ )

చికెన్ తో ఎలా చేస్తామో అలాగే మటన్,రొయ్యలు,ఫిష్ వీటితో కూడా 

పచ్చళ్ళు పెట్టేయ్యొచ్చు.అయితే తప్పనిసరిగా ఫ్రిజ్ లోనే స్టోర్ 

చేసుకోవాలి.లేకపోతే నిలువ ఉండవు.అదొక్క జాగ్రత్త తీసుకుంటే ఎంతో 

రుచిగా ఉండే నాన్ వెజ్ పచ్చళ్ళు ఇంట్లోనే చేసుకుని వాడుకోవచ్చు.







కావలసిన  పదార్ధాలు : 


రొయ్యలు                                        కేజీ

అల్లంవెల్లుల్లి ముద్ద                     రెండు  టీ స్పూన్లు

కారం                                      నాలుగు టీ స్పూన్లు

ఉప్పు                                      నాలుగు టీ స్పూన్లు

పసుపు                                   పావు టీ స్పూన్ 

నూనె                                      పావు కిలో 

నిమ్మకాయలు                            నాలుగు 

కరివేపాకు                                 రెండు రెమ్మలు 

ఆవాలు                                     కొంచెం


మసాలాకు

లవంగాలు                               పది

చెక్క                                     రెండు పెద్ద ముక్కలు

జీలకర్ర                                  రెండు టీ స్పూన్లు

ధనియాలు                             రెండు టేబుల్ స్పూన్లు

గసగసాలు                              రెండు  టేబుల్ స్పూన్లు

ఎండుకొబ్బరి                           పావు చిప్ప


తయారు చేసే విధానం ;


ముందుగ రొయ్యలను శుభ్రంచేసి  కడిగి నీరు పోయేలా జల్లెడలో వేసి 

ఉంచుకోవాలి.


నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి వేగాక రొయ్యలు వేయాలి.

నీరంతా ఇగిరిపోయి రొయ్యలు ఉడికి నూనె తేలేవరకు మధ్యమధ్యలో 

కలుపుతూ ఉడకనివ్వాలి.దీనికి షుమారుగా పావుగంట పడుతుంది.


ఈలోగా అల్లంవెల్లుల్లిని తడి తగలకుండా మెత్తగా ముద్ద చేసుకోవాలి.


మసాలాకు  రాసిన దినుసుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి.


రొయ్యలు ఉడికి  నూనె తేలిన తరువాత పసుపు,అల్లంవెల్లుల్లి ముద్ద 

వేసి బాగా కలిపి పచ్చిదనం పోయేవరకూ వేయించాలి.


మసాలాపొడి,ఉప్పు వేసి కలిపి సన్నని సెగపై ఈ మిశ్రమం మొత్తం వేగి 

నూనె తేలేవరకు వేయించాలి. 


చివరిగా కారం వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి .


చల్లారిన తరువాత నిమ్మరసం పోసి కలిపితే రుచికరమైన రొయ్యల 

పచ్చడి రెడీ అవుతుంది.


ఒక బాటిల్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో ఉంచుకుని తడి తగలకుండా 

వాడుకోవాలి.


నోట్:  ఎవరి రుచికి తగ్గట్టు ఉప్పు,కారం,మసాలాలు,నిమ్మరసం 

ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.

అలాగే కొందరు ముందు రొయ్యలు ఉడకపెట్టి వాటిని నూనెలో వండి 

చేస్తారు.అలా కూడా చెయ్యొచ్చు కానీ ముక్క గట్టిగా అయిపోతుంది.

అందుకని నేను ఈ పధ్ధతి ఫాలో అవుతాను.


Share/Bookmark

Tuesday, April 24, 2012

సోయా - గ్రీన్ పీస్ కర్రీ

పూరీ,చపాతీ ఇలాంటి వాటికి ఈ కూర మంచి జోడీ .అన్నంలోకి కూడా 

బావుంటుంది.ఎక్కువ కూరలు తరిగే పని లేకుండా సింపుల్ గా 

అయిపోతుంది.





కావలసిన పదార్ధాలు:



సోయా గ్రాన్యూల్స్                  ఒక కప్పు 

పచ్చి బటానీలు                     ఒక కప్పు 

టమాటాలు                          రెండు 

ఉల్లిపాయ                           ఒకటి 

పచ్చిమిర్చి                         రెండు 

కరివేపాకు                          ఒక రెమ్మ 

కొత్తిమీర                            కొద్దిగా 

అల్లంవెల్లుల్లి పేస్ట్                 ఒక టీ స్పూన్ 

గరంమసాలాపొడి               అర టీ స్పూన్

ఉప్పు,కారం,పసుపు,నూనె,తాలింపు దినుసులు 


తయారు చేసే విధానం:


సోయా గ్రాన్యూల్స్ ను మరిగే నీటిలో వేసి రెండు మూడు నిముషాలు 

ఉడికించాలి.

చల్లారక వడపోసి చల్లని నీళ్ళతో రెండుసార్లు కడిగి నీరు పిండేసి 

ఉంచాలి.

నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు

వేయించాలి.ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి టమాటా 

ముక్కలు వేయాలి.

టమాటా బాగా ఉడికిన తరువాత సోయా గ్రాన్యూల్స్,తగినంత

ఉప్పు,కారం,పసుపు వేసి  వేయించాలి.

చివరగా ఉడికించిన బటానీలు,కొత్తిమీర,మసాలాపొడి కూడా వేసి బాగా 

కలిపి కూర డ్రైగా అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.     


Share/Bookmark

Sunday, April 22, 2012

ప్రాన్స్ కాజూ ఫ్రై

సీ ఫుడ్ లో అందరూ చాలా ఇష్టంగా తినేవి రొయ్యలు.వీటికి కాజూ 

కలిపి ఫ్రై చేస్తే చాలా బావుంటుంది.బిర్యానీ,పులావ్ ల్లోకి మంచి 

కాంబినేషన్ అవుతుంది.





కావలసిన పదార్ధాలు:


రొయ్యలు                   ఒక కేజీ 

ఉల్లిపాయ                   ఒకటి 

పచ్చిమిర్చి                 రెండు 

కరివేపాకు                  రెండు రెమ్మలు 

కొత్తిమీర                    ఒక కట్ట 

టమాటా ప్యూరీ             ఒక టేబుల్ స్పూన్

జీడిపప్పు                    కొద్దిగా

ఉప్పు,కారం,పసుపు,నూనె 

మసాలాకు 

ఆరేడు లవంగాలు,చిన్న దాల్చినచెక్క,ఒక టేబుల్ స్పూన్ ధనియాలు,

ఒక టీస్పూన్ జీలకర్ర,ఒక టేబుల్ స్పూన్ గసగసాలు,

చిన్న అల్లంముక్క,వెల్లుల్లి రెబ్బలు ఏడెనిమిది     


తయారు చేసే విధానం:



నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు కరివేపాకు,శుభ్రం చేసుకున్న రొయ్యలు,పసుపు వేయాలి.

ఈలోగా మసాలాలు అన్నీ మెత్తగా పొడి చెయ్యాలి. ఇందులోనే 

అల్లం,వెల్లుల్లి,కొత్తిమీర కొంచెం నీరు పోసి పేస్ట్ చేసుకోవాలి.

రొయ్యలు కొంచెం ఉడికిన తరువాత ఈ పేస్ట్,టమాటా ప్యూరీ,తగినంత

ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.

రొయ్యలు పూర్తిగా ఉడికి కూర బాగా దగ్గరవుతుండగా వేయించుకున్న 

జీడిపప్పు వేసి,కొంచెం తరిగిన కొత్తిమీర వేసి రెండు నిముషాలు ఉంచి 

స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

జీడిపప్పును కూరలో కలిపి కూడా ఉడికించవచ్చు.అయితే ఇలా విడిగా 

వేయించి కలిపితే క్రిస్పీగా బావుంటాయి.






Share/Bookmark

Wednesday, April 18, 2012

ఆలూ జీరా రైస్

రైస్ ఐటమ్స్ చేయడం చాలా తేలిక.ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 

కానీ ఒక పూట కూర చెయ్యలేకపోయినా  అయిదు నిమిషాల్లో ఇవి

చేసెయ్యొచ్చుఎక్కువ మసాలాలు లేకుండా జీరా ఫ్లేవర్,ఆలూ కలిపి 

చేసే ఈ ఐటం లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది.




 .
   




కావలసిన పదార్ధాలు:


ఆలూ                                 ఒకటి 

అన్నం                               రెండు కప్పులు 

ఉల్లిపాయ                            ఒకటి 

పచ్చిమిర్చి                          రెండు 

కరివేపాకు                           ఒక రెమ్మ 

కొత్తిమీర                             కొద్దిగా 

అల్లం                                చిన్న ముక్క

మసాలాపొడి                       ఒక టీ స్పూన్ 

జీలకర్ర                             ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం,పసుపు,నూనె,ఆవాలు,ఎండుమిర్చి.



తయారు చేసే విధానం:



నూనె వేడి చేసి జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి వేయాలి.ఇవి కొంచెం 

వేగగానే సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం వేసి వేయించాలి.

కరివేపాకు,సన్నగా తరిగిన ఆలూ వేసి కలిపి కొంచెం ఉప్పు,పసుపు 

చల్లి మగ్గనివ్వాలి.

ఆలూ ఉడికిన తరువాత కారం,గరంమసాలాపొడి, కొత్తిమీర, అన్నం 

కూడా వేయాలి.తగినంత ఉప్పు చల్లి బాగా కలిపి రెండు నిముషాలు 

ఉంచితే సరిపోతుంది.

ఇష్టం ఉంటే చివరగా ఒక స్పూన్ కరివేపాకు కారం కానీ,పుట్నాలపప్పు 

కారంపొడి కానీ చల్లితే మంచి టేస్ట్ వస్తుంది.ఇది వేసినప్పుడు కారం 

కొంచెం తక్కువ వేసుకోవాలి.  


Share/Bookmark

Sunday, April 15, 2012

మిక్స్డ్ వెజ్ పకోడా

ఆలూ,కారట్,కాబేజ్ ఇలా అన్ని కూరలూ కలిపి చేసే పకోడీలు ఇవి.

సాయంత్రాలు స్నాక్స్ గా అయినా సాంబారు,రసం వీటిలోకి తినడానికి 

కూడా బావుంటాయి.






కావలసిన పదార్ధాలు:


ఆలూ                             ఒకటి చిన్నది 

కారట్                             ఒకటి 

కాబేజ్                             అర కప్పు 

కాలీఫ్లవర్                         అర కప్పు 

ఉల్లిపాయ                        ఒకటి

పచ్చిమిర్చి                      నాలుగు 

కరివేపాకు                       రెండు రెమ్మలు 

అల్లం ముక్కలు                 ఒక స్పూన్ 

కసూరి మేతి                     ఒక టేబుల్ స్పూన్ 

శనగపిండి                       ఒక కప్పు 

బియ్యం పిండి                   రెండు టేబుల్ స్పూన్స్ 

ఉప్పు,వంట సోడా,నూనె 




తయారు చేసే విధానం:



కూరలు అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి.

ఉల్లిపాయ,మిర్చి కూడా పొడవుగా వాలికలుగా కట్ చెయ్యాలి.

వీటిని ఒక బౌల్ లోకి తీసుకుని శనగపిండి,బియ్యం పిండి,ఉప్పు,

వంట సోడా,కసూరి మేతి వేసి కొద్దిగా నీళ్ళు పోసి పకోడీ పిండిలా 

కలుపుకోవాలి,

కాగిన నూనెలో ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న పకోడీలు వేసి వేయించాలి.

వేడిగా సాస్ తో తింటే బావుంటాయి.

కసూరిమేతి వేసినందు వలన ఫ్లేవర్ బావుంటుంది.ఇష్టం లేకపోతే 

వేయనక్కర్లేదు.   


Share/Bookmark

Thursday, April 12, 2012

సేమ్యా కేసరి

అప్పటికప్పుడు ఏమైనా స్వీట్ చెయ్యాలి అంటే ఈజీగా అయిపోయే వెరైటీ

ఈ సేమ్యా కేసరి. నెయ్యి కూడా తక్కువే పడుతుంది.








కావలసిన  పదార్ధాలు:


సేమ్యా                                 ఒక కప్పు 

పాలు                                  ఒక కప్పు 

పంచదార                              ఒక కప్పు 

నీళ్ళు                                 ఒక కప్పు 

నెయ్యి                               పావు కప్పు 

ఇలాచీ పొడి                        పావు స్పూన్ 

బాదం మిక్స్                       ఒక టీ స్పూన్ 


తయారు చేసే విధానం:


ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడిచేసి కాజూ,కిస్మిస్ వేయించి 

తీసుకోవాలి.

మరొక స్పూన్ నెయ్యి వేసి సేమ్యాను వేయించుకోవాలి.ఇందులో పాలు,

నీళ్ళు పోసి సేమ్యాను ఉడికించాలి.

సేమ్యా పూర్తిగా ఉడికిన తరువాత పంచదార వేయాలి.

మిశ్రమం ఉడికి కొంచెం దగ్గరవుతుండగా ఇలాచీ పొడి,బాదం మిక్స్ 

వేసి కలిపి మిగిలిన నెయ్యి వేయాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కాజూ,కిస్మిస్ పైన వేయాలి.

ఇన్ స్టంట్ బాదం మిక్స్ వేస్తే కొంచెం కలర్,ఫ్లేవర్ వస్తుంది.ఫుడ్ కలర్ 

వేయకుండా సరిపోతుంది.ఇది లేకపోతే ప్లెయిన్ గా కూడా 

చేసెయ్యొచ్చు.
 


Share/Bookmark

Monday, April 9, 2012

కుకీస్ మిల్క్ షేక్

మరొక చల్లని మిల్క్ షేక్ పిల్లల కోసం.ఇందులో బటర్ స్కాచ్ కుకీస్ 

కానీ,చాక్లెట్ కుకీస్ కానీ వాడొచ్చు.పాలు,ఐస్ క్రీం,కుకీస్ అన్నీ

ఉంటాయి కనుక వెరైటీగాఉంటుంది.







కావలసిన పదార్ధాలు:


బటర్ స్కాచ్ కుకీస్                     మూడు 

వెనీలా ఐస్ క్రీం                        అర కప్పు 

చల్లని పాలు                           ఒక కప్పు 



తయారు చేసే విధానం:


ముందుగా కుకీస్ ను చిన్న ముక్కలు చేసి పాలు కలిపి

బ్లెండ్ చేసుకోవాలి 

ఇప్పుడు ఐస్ క్రీం వేసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి. గ్లాస్ లో పోసి పైన  

కొంచెం ఐస్ క్రీం వేసి ఇస్తే బావుంటుంది 

ఐస్ క్రీం లోనూ,కుకీస్ లోనూ స్వీట్ ఉంటుంది కనుక పంచదార 

వేయనక్కర్లేదు


Share/Bookmark

Thursday, April 5, 2012

ఐస్ క్రీం - మాంగో మిల్క్ షేక్

ఐస్ క్రీం,మామిడిపండు ఇవి అందరికీ ఇష్టమే.ఈ రెండూ కలిపి చేసే 

మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది.







కావలసిన పదార్ధాలు:



మామిడి ముక్కలు                     అర కప్పు 

వెనీలా ఐస్ క్రీం                         ఒక కప్పు 

పంచదార                               రెండు టీ స్పూన్స్ 

చల్లని పాలు                            ఒక కప్పు 


తయారు చేసే విధానం:



మామిడి ముక్కలు,పంచదార కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు చల్లని పాలు పోసి బ్లెండ్ చెయ్యాలి 

చివరగా ఐస్ క్రీం వేసి బ్లెండ్ చేస్తే క్రీమీగా ఉండే మిల్క్ షేక్ రెడీ 

అవుతుంది.   


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP