Saturday, June 23, 2012

రైస్ - ఓట్స్ టిక్కీస్ (బాల్స్)

సన్నగా వర్షం పడుతుంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది ఎవరికైనా.

రెగ్యులర్ గా చేసే బజ్జీలు,పకోడీలు పక్కన పెట్టి కొంచెం వెరైటీగా ఇవి 

చేసి చూస్తే  భలే ఉన్నాయి.నాకైతే టిక్కీల కంటే కూడా బాల్స్ ఇంకా 

బాగా నచ్చాయి 

.కావలసిన పదార్ధాలు:


అన్నం                      ఒక కప్పు 

ఓట్స్                         అర కప్పు 

ఆలూ                         రెండు 

ఉల్లిపాయ                    ఒకటి 

పచ్చిమిర్చి                  రెండు 

అల్లం                       ఒక స్పూన్ 

పుదీనా                     రెండు స్పూన్స్ 

కొత్తిమీర                    రెండు స్పూన్స్ 

కార్న్ ఫ్లోర్                 ఒక టేబుల్ స్పూన్

చాట్ మసాలా              ఒక టీ స్పూన్ 

బ్రెడ్ క్రంబ్స్                   అర కప్పు 

ఉప్పు,నూనె 
తయారు చేసే విధానం:అన్నం ఒక బౌల్ లోకి తీసుకుని మెత్తగా మాష్ చేసుకోవాలి.

ఉడికించిన ఆలూ కూడా మాష్ చేసి అన్నంలో వెయ్యాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,పుదీనా,కొత్తిమీర వేయాలి.

చివరగా ఓట్స్,కార్న్ ఫ్లోర్ ,తగినంత ఉప్పు,చాట్ మసాలాపొడి వేసి 

బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న టిక్కీలు కానీ,బాల్స్ కానీ చేసి బ్రెడ్ 

క్రంబ్స్ లో రోల్ చేసి కాగిన నూనెలో వేయించాలి. ఎర్రగా వేగాక తీసి

 పేపర్ నాప్ కిన్ పై ఉంచాలి.

వేడివేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి.


Share/Bookmark

Thursday, June 21, 2012

చాకో ఫ్రెంచ్ టోస్ట్

బ్రెడ్ ఇంట్లో ఉంది అంటే రకరకాల టోస్ట్ లు  చేస్తూనే ఉంటాము.పిల్లలూ 

ఇష్టంగా తింటారు కూడా.రెగ్యులర్ గా చేసే ఫ్రెంచ్ టోస్ట్ నే కొంచెం 

వెరైటీగా చేస్తే బావుంటుంది.చాకో ఫ్లేవర్ తో ఎట్రాక్టివ్ గా ఉంటుంది.కావలసిన పదార్ధాలు:బ్రెడ్                            నాలుగు స్లైసులు 

ఎగ్స్                            రెండు 

పాలు                          అర కప్పు 

పంచదార                     రెండు టేబుల్ స్పూన్స్ 

కోకో పౌడర్                   ఒక టేబుల్ స్పూన్ 

బేకింగ్ పౌడర్                చిటికెడు 

వెనీలా ఎసెన్స్               కొద్దిగా 

నెయ్యి                        రెండు స్పూన్స్

కాజూ,బాదం                 ఒకస్పూన్  తయారు చేసే విధానం:


ముందుగ ఎగ్స్ బ్రేక్ చేసి ఒక బౌల్ లోకి తీసుకుని పంచదార కలిపి బీట్ 

చెయ్యాలి.

ఇందులో పాలు,కోకో పౌడర్ వేసి మళ్ళీ బీట్ చెయ్యాలి.

చివరగా బేకింగ్ పౌడర్,ఎసెన్స్ వేసి కలపాలి.

బ్రెడ్ స్లైసెస్ ను ఈమిశ్రమంలో రెండువైపులా ముంచి తావాపై పెట్టాలి.

నెయ్యి వేసి రెండు వైపులా కాల్చాలి.

ఈ స్లైసెస్ ను రెండుగా కట్ చేసి కాజూ,బాదం పౌడర్ చల్లి సర్వ్ 

చెయ్యాలి.లేదా ఫ్రెష్ ఫ్రూట్ పీసెస్ తో అయినా సర్వ్ చెయ్యొచ్చు.


Share/Bookmark

Wednesday, June 20, 2012

పనీర్ - టమాటా పులావ్

టమాటా ప్యూరీ,పనీర్ కలిపి చేసే ఈ రైస్ డిష్ కోసం ఎక్కువ పదార్ధాలు 

 అవసరం ఉండదు చల్లని ఈ వెదర్ లో స్పైసీగా చాలా బావుంటుంది.
కావలసిన పదార్ధాలు :


సన్నబియ్యం                       ఒక గ్లాస్ 

పనీర్                               వంద గ్రాములు 

టమాటాలు                          మూడు 

ఉల్లిపాయ                           ఒకటి 

పచ్చిమిర్చి                         మూడు 

కరివేపాకు                          ఒక రెమ్మ 

కొత్తిమీర                            ఒక కట్ట 

పుదీనా                            ఒక కట్ట 

ఉప్పు,కారం,పసుపు,అల్లంవెల్లుల్లి పేస్ట్,గరంమసాలా పొడి,నూనె.

లవంగాలు,చెక్క,షాజీర,బిర్యానీ ఆకు 
తయారు చేసే విధానం:


పనీర్ ను చిన్న ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు,కారం,పసుపు,

పావు స్పూన్ గరంమసాలా పొడి వేసి కలిపి ఒక పావుగంట మారినేట్ 

చెయ్యాలి.

బియ్యం కడిగి ఒక పావుగంట నానబెట్టుకోవాలి.

టమాటాలు ఉడికించి గ్రైండ్ చేసి  ప్యూరీ చేసుకోవాలి.లేదా రెడీమేడ్ 

ప్యూరీ అయినా వాడొచ్చు.

పాన్ లో నూనె వేడి చేసి  నాలుగు లవంగాలు,చెక్క,బిర్యానీ ఆకు,ఒక 

స్పూన్ షాజీర వేసి వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేగనివ్వాలి.ఒక 

టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత టమాట ప్యూరీ 

వేయాలి.

సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర వేసి బాగా వేయించి మారినేట్ చేసిన 

పనీర్ ముక్కలు వేసి కలపాలి.

తగినంత కారం,పసుపు,ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి 

బాగా కలిపి రెండుగ్లాసుల నీళ్ళు పోసి మరిగాక బియ్యం,తగినంత 

ఉప్పు వేసి కలిపి మూత  పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయిన తరువాత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి.

వేడివేడిగా పెరుగుపచ్చడితో తింటే ఈపులావ్ చాల రుచిగా ఉంటుంది. 


Share/Bookmark

Tuesday, June 5, 2012

అటుకుల పులిహోర

చాలా ఈజీగా అయిదు నిమిషాల్లో అయిపోయే టిఫిన్ ఇది.ఎన్నో రకాల 

పులిహోరల్లో ఇదీ ఒకటి.లైట్ టిఫిన్ గా ఉదయమైనా,సాయంత్రమైనా 

తినొచ్చు.
 

కావలసిన పదార్ధాలు:


 

అటుకులు                            రెండు మూడు కప్పులు
 

ఉల్లిపాయ                            ఒకటి
 
పచ్చిమిర్చి                           మూడు
 
కరివేపాకు                           ఒక రెమ్మ
 
అల్లం                                చిన్న ముక్క 

చింతపండుపేస్ట్                  రెండు టీ స్పూన్స్

ఉప్పు,నూనె, పసుపు

తాలింపుకు
 
శనగపప్పు,మినపప్పు,ఆవాలు,పల్లీలు,ఎండుమిర్చి


తయారు చేసే విధానం:లావు అటుకులను కడిగి నీరు వంపెయ్యాలి.ఒక ఐదునిమిషాలు 

పక్కన పెడితే మిగిలిన తడికి మెత్తబడి పోతాయి
 
ఉల్లి,మిర్చి,అల్లం సన్నగా తరగాలి.
 
నూనె వేడి చేసి తాలింపు వేసి పల్లీలు బాగా వేగిన తరువాత కరివేపాకు,

ఉల్లి ముక్కల మిశ్రమం వేసి చేయించాలి.
 
పసుపు వేసి అటుకులు,తగినంత ఉప్పు,చింతపండు పేస్ట్ అన్నీ వేసి 

బాగా కలపాలి.
 
అంతే పుల్లపుల్లగా ,కొంచెం కారంగా ఉండే అటుకుల పులిహోర రెడీ.


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP