సేమ్యా ఖీర్
అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరపు తొలిరోజు.ఏడాదంతా బావుండాలని ఎన్నోఆశలు
చిగుళ్ళు వేసే రోజు.అందుకే తీయతీయగా ఈ సేమ్యా ఖీర్.
కావలసిన పదార్ధాలు:
సన్న సేమ్యా ఒక కప్
పాలు అర లీటరు
పంచదార ఒక కప్
ఇలాచీ పొడి అర టీ స్పూన్
నెయ్యి రెండు టీ స్పూన్స్
కాజూ,బాదం,కిస్మిస్,సారపప్పు.
తయారు చేసే పధ్ధతి:
నెయ్యి వేడిచేసి కాజూ,బాదం,కిస్మిస్,సారపప్పు అన్నీ వేయించి
తీసుకోవాలి.
ఇదే నేతిలో సేమియా వేసి వేయించాలి.వేగిన తరువాత కాచిన పాలు
పోసి ఒక నిమిషం ఉడికించాలి.
పంచదార కలిపి మరొక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.ఇలాచీ
పొడి,వేయించిన డ్రై ఫ్రూట్స్ కలపాలి.
నోట్ : సన్న సేమియా బదులు మామూలు వెరైటీ అయినా వాడొచ్చు,
సన్నసేమియా వాడితే ఎక్కువసేపు ఉడికిస్తే ముద్దగా అయిపోతుంది.
అందుకని పాలు వేశాక ఒక నిమిషం ఉడికితే చాలు.

4 comments:
లత గారూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలండీ..
happy new yaer.
హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
సుభ గారు, మాల గారు, శ్రీలలిత గారు
ధన్యవాదాలు మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
Post a Comment