Monday, August 8, 2011

కొబ్బరి (లౌజు) ఉండలు

 పచ్చికొబ్బరి తురుము,బెల్లంతో చేసే ఈ ఉండలు చేయడం అందరికి

తెలిసిందే.అయితే మైక్రోవేవ్ లో చేస్తే చాలా సింపుల్ గా అయిపోతుంది.







కావలసిన  పదార్ధాలు 


కొబ్బరికాయ                        ఒకటి 

బెల్లం                                రెండు కప్పులు

నెయ్యి                               ఒక స్పూన్

యాలకుల పొడి                    ఒక స్పూన్


తయారు చేసే విధానం :


కొబ్బరి తురుము,బెల్లం కలిపి ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో వేసి హై లో 

పెట్టాలి.

బెల్లం కరిగి పాకం వస్తుండగా నెయ్యి వేసి కలిపి మళ్లీ ఓవెన్ లో పెట్టాలి 

మిశ్రమం బాగా దగ్గరపడి ఉండకి వస్తుండగా యాలకుల పొడి వేయాలి.

కొంచెం చల్లారిన తరువాత ఉండలు చుట్టుకుంటే రుచికరమైన కొబ్బరి 

ఉండలు రెడీ అవుతాయి .

మైక్రోవేవ్ లో షుమారు పదినిమిషాలు పడుతుంది.రెండు మూడు 

నిమిషాలకి  ఒకసారి కలుపుతూ ఉండాలి.ఓవెన్ ని బట్టి టైం కొంచెం

ఎక్కువ తక్కువలు పట్టొచ్చు






Share/Bookmark

11 comments:

ఇందు

అబ్బ! లతగారూఉ....పోస్ట్ మొత్తం చదవకుండా కేవలం ఆ పిక్ చూసి కామెంటేస్తున్నా! అర్జెంటుగ్గా తినేయాలనిపిస్తోందండీ!!! బాబోయ్ అంత యమ్మీగా పిక్స్ పెట్టకండీ లతగారూఉ!! :))))

ఇందు

చాలాబాగుంది రెసెపీ :) కొబ్బరిలౌజు ముక్కలుగా కోసుకుని తినడమేగానీ ఇలా ఉండలు చుట్టుకుని తినలేదు....భలే ఉంది :) వీలుంటే చేసి నాకు ఒక క్యాన్ పంపరూఊ!!!!

లత

అలాగే ఇందూ, అంత నచ్చినందుకు వెరీ హాపీ, థాంక్యూ వెరీ మచ్

Unknown

చాల సింపుల్ గా చెప్పారు. వెంటనే చేసుకుని తినాలి అనిపిస్తోంది.

లత

థాంక్యూ శైలగారు,చేసెయ్యండి మరి

శశి కళ

అబ్బ...గుర్తు చెసారు.ఇంక చెసెస్తా...ఒవెన్ లొ అయితె తొన్దరగా
అవుతాయెమొ కదా...

లత

అవును శశిగారు
ఒవెన్ లో త్వరగా అవుతాయి.ఫొటోలోవి ఒవెన్ లో చేసినవే

Raji

లత గారు,
దీనికి ఎండు కొబ్బరి వాడొచ్చా? మేము ఉండే దగ్గర ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది, అది వాడొచ్చా లేక తురుము చేసింది కావాలా?

లత

రాజీగారు, కొబ్బరిఉండలకు ఎండుకొబ్బరి బావుండదు,
పచ్చికొబ్బరితురుము తోనే చెయ్యాలి.

సుజాత వేల్పూరి

మైక్రో వేవ్ లో హై లో ఎంత సేపు పెట్టాలి లత గారూ?

చిన్నప్పుడు ఎండుకొబ్బరి తురుముతో చేసిన కొబ్బరి ఉండలు బడ్డీ కొట్లలో అమ్మేవారు. అవీ బాగానే ఉంటాయి. కొబ్బరి పొడితో బావుండవు. తింటుంటే కొబ్బరి తెలియాలి కదా!

అది సరే లత గారూ,ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉండవనుకుంటాను కదూ?

చూస్తుంటే నోరూరిపోతోంది. మా వూరి నుంచి మా చెట్టు కాయలు వచ్చాయి. చేసేస్తా అయితే! :-)

లత

సుజాతగారు,
నాలుగైదు రోజులు ఉంటాయండి.మైక్రొవేవ్ లో పదినిమిషాలు పట్టింది
ఎండుకొబ్బరితో చేయడం తెలియదండి నాకు

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP