Tuesday, May 31, 2011

మామిడి తురుము పచ్చడి

చాలా సింపుల్ గా చెయ్యగల పచ్చడి ఇది.టిఫిన్స్ లోకి చాలా 

బావుంటుంది.





కావలసిన పదార్ధాలు :


మామిడికాయలు                   రెండు 

కారం                                రెండు టేబుల్ స్పూన్లు 

ఆవపిండి                            ఒక టీ స్పూన్ 

మెంతిపిండి                         అర టీ స్పూన్ 

ఉప్పు                                  తగినంత 

నూనె                                  పావు కప్పు 

తాలింపుకు 

శనగపప్పు ,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు,వెల్లుల్లి 

రెబ్బలు 


తయారు చేసే విధానం:

మామిడికాయలు చెక్కు తీసి తురుముకోవాలి.

ఈ తురుములో కారం,ఉప్పు,ఆవపిండి,మెంతిపిండి అన్నీ వేసి బాగా 

కలపాలి.

నూనె వేడిచేసి తాలింపు వేసి ఇందులో కలిపితే తురుము పచ్చడి రెడీ 

అయిపోతుంది.


Share/Bookmark

Saturday, May 28, 2011

పనీర్ , స్వీట్ కార్న్ పులావ్

చాలా మైల్డ్ ఫ్లేవర్ తో ఎక్కువ మసాలాలు లేకుండా ఉంటుంది ఈ 

పులావ్.ఎప్పుడూ వాడే కూరగాయలు కాకుండా స్వీట్ కార్న్,పనీర్ 

వాడడంతో వెరైటీ రుచితో బావుంటుంది.పెరుగుపచ్చడి కానీ,ఏదైనా 

చికెన్ కర్రీ కానీ ఈ పులావ్ కి మంచి కాంబినేషన్.






కావలసిన పదార్ధాలు: 

బాస్మతి రైస్                             ఒక గ్లాస్ 

స్వీట్ కార్న్                              ఒక కప్ 

పనీర్ ముక్కలు                        ఒక కప్ 

ఉల్లిపాయ                              ఒకటి 

మిర్చి                                  మూడు 

కారట్                                  ఒకటి   

కొత్తిమీర                                అర కప్ 

అల్లంవెల్లుల్లి ముద్ద                    ఒక టీ స్పూన్ 

గరంమసాలాపొడి                      ఒక టీ స్పూన్ 

ఉప్పు                                    తగినంత 

నూనె                                     మూడు టేబుల్ స్పూన్లు

లవంగాలు,చెక్క,యాలకులు 


తయారు చేసే విధానం;


బియ్యం కడిగి పది నిమిషాలు నాననివ్వాలి.

నూనె వేడిచేసి పనీర్ ముక్కలు  కొంచెం వేయించి తీసుకోవాలి.

అదే నూనెలో 3 లవంగాలు,దాల్చినచెక్క ముక్క,రెండు యాలకులు

వేసి వేగాక వాలికలుగా కోసిన ఉల్లి,మిర్చి వేసి వేయించాలి.

ఇప్పుడు తరిగిన కొత్తిమీర,స్వీట్ కార్న్,కారట్ తురుము వేసి కొంచెం 

వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాల పొడి వేయాలి.కొంచెం వేగాక 

బియ్యం వేసి బాగా కలిపి రెండు మూడు నిముషాలు వేయించాలి.

ఇప్పుడు ఒక గ్లాసున్నర నీళ్ళు,తగినంత ఉప్పు వేసి కలిపి కుక్కర్ 

మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

స్టీం అంతా పోయాక ఒకసారి తీసి పనీర్ ముక్కలు వేసి కలిపి మళ్ళీ 

మూత పెట్టాలి.

ఈ పులావ్ కొంచెం కార్న్ స్వీట్ నెస్,కొంచెం స్పైసీ నెస్ తో వెరైటీగా 

ఉంటుంది.


Share/Bookmark

Wednesday, May 25, 2011

గోంగూర - పప్పు

గోంగూర  పచ్చడి ఎంతగా ఇష్టపడతామో కదా.అలాగే ఈ గోంగూర 

శనగపప్పు కూర కూడా పుల్లగా కమ్మగా ఉంటుంది.వేడి వేడి అన్నంలో

నెయ్యి వేసుకుని ఈ కూరతో తింటే ఆ రుచే వేరు.






కావలసిన పదార్ధాలు:


శనగపప్పు                         ఒక కప్పు 

గోంగూర                           మూడు కట్టలు 

ఉల్లిపాయ                          ఒకటి 

మిర్చి                              నాలుగు 

ఉప్పు,కారం                         తగినంత 

పసుపు                             పావు స్పూన్ 

కరివేపాకు                         రెండు రెమ్మలు 

నూనె                              రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు


తయారు చేసే విధానం:

శనగపప్పు కడిగి ఒక అరగంట నానబెట్టాలి.

ఇప్పుడు ఈ పప్పు,కడిగిన గోంగూర,తరిగిన ఉల్లిముక్కలు,మిర్చి అన్నీ 

కలిపి కుక్కర్లో వేసి రెండు కప్పుల నీరు పోసి ఏడెనిమిది విజిల్స్ 

రానివ్వాలి.తక్కువ విజిల్స్ అయితే పులుపుకు పప్పు ఉడకదు.

తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి చిక్కబడేదాకా ఉడికించాలి.

నూనె వేడి చేసి తాలింపు వేసి కూరలో వేయాలి.

వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు ఎక్కువ వేస్తే ఘుమఘుమలాడుతూ కూర 

ఛాలా రుచిగా ఉంటుంది.


Share/Bookmark

Sunday, May 22, 2011

సపోటా మామిడి మిల్క్ షేక్

సపోటా పళ్ళు, మామిడి రసం కలిపి చేసే మిల్క్ షేక్ ఇది.పిల్లలు 

పాలు ఇష్టపడక పోయినా,పళ్ళు తినడానికి పేచీ పెట్టినా ఇలాంటివి 

చేసి ఇస్తే వాళ్ళు,మనం కూడా హాపీస్ కదా



 

కావలసిన పదార్ధాలు:


సపోటాలు                             రెండు 

మామిడి రసం                        అర కప్పు 

పాలు                                  ఒక గ్లాస్  

పంచదార                              రెండు టీ స్పూన్స్ 


తయారు చేసే విధానం ;


సపోటా ముక్కలు.పంచదార మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇందులో మామిడిరసం  వేసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి.

చివరగా చల్లని పాలు పోసి బ్లెండ్ చేస్తే కమ్మని మిల్క్ షేక్ రెడీ 

అవుతుంది





Share/Bookmark

Friday, May 20, 2011

చికెన్ పచ్చడి

చికెన్ పచ్చడి అనగానే నోరూరుతుంది కదూ.చికెన్ కూర ఎంత ఈజీగా 

చేస్తామో ఈ పచ్చడి కూడా అంతే సులువుగా చెయ్యొచ్చు.ఒక్కొక్కరు 

ఒక్కో విధంగా చేస్తారు ఈపచ్చడిని.సింపుల్ గా నేను చేసే విధానం 

చెప్తాను.ఈ పచ్చడి ఫ్రిజ్ లో ఉంటే ఎంత హాయో చెప్పలేను.ఒక్క కూరే 

చేసినా,సాంబారు ఒకటే ఉన్నా,ఒకపూట కూర చెయ్యక పోయినా 

చల్తాహై అన్నమాట.మా ఇంట్లో ఫేవరేట్ ఐటం ఈ చికెన్ పచ్చడి.







కావలసిన  పదార్ధాలు : 


చికెన్                                         కేజీ

అల్లంవెల్లుల్లి ముద్ద                      మూడు టీ స్పూన్లు

కారం                                      నాలుగు టీ స్పూన్లు

ఉప్పు                                      నాలుగు టీ స్పూన్లు

పసుపు                                   పావు టీ స్పూన్ 

నూనె                                      పావు కిలో 

నిమ్మకాయలు                            నాలుగు 

కరివేపాకు                                 రెండు రెమ్మలు 

ఆవాలు                                     కొంచెం


మసాలాకు

లవంగాలు                               పది

చెక్క                                     రెండు పెద్ద ముక్కలు

జీలకర్ర                                  రెండు టీ స్పూన్లు

ధనియాలు                             రెండు టేబుల్ స్పూన్లు

గసగసాలు                              మూడు టేబుల్ స్పూన్లు

ఎండుకొబ్బరి                           పావు చిప్ప


తయారు చేసే విధానం ;


ముందుగ చికెన్ ముక్కలను కడిగి నీరు పోయేలా జల్లెడలో వేసి 

ఉంచుకోవాలి.

నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి వేగాక చికెన్ ముక్కలు 

వేయాలి.నీరంతా ఇగిరిపోయి చికెన్ వేగి నూనె తేలేవరకు మధ్యలో 

తిప్పుతూ ఉడకనివ్వాలి.దీనికి షుమారుగా పావుగంట పడుతుంది.

ఈలోగా అల్లంవెల్లుల్లిని తడి తగలకుండా మెత్తగా ముద్ద చేసుకోవాలి.

మసాలాకు  రాసిన దినుసుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి.

చికెన్ ముక్కలు వేగి నూనె తేలిన తరువాత పసుపు,అల్లంవెల్లుల్లి 

ముద్ద వేసి బాగా కలిపి వేయించాలి.మూడు నిమిషాల తరువాత 

మసాలా పొడి,ఉప్పు వేసి కలిపి సన్నని సెగపై ఈ మిశ్రమం మొత్తం 

వేగి నూనె తేలేవరకు వేయించాలి. 

చివరిగా కారం వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి .

చల్లారిన తరువాత నిమ్మరసం పోసి కలిపితే రుచికరమైన చికెన్ 

పచ్చడి రెడీ అవుతుంది.

ఒక బాటిల్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో ఉంచుకుని తడి తగలకుండా 

వాడుకుంటే దాదాపు ఇరవైరోజులు ఉంటుంది. 

నోట్:  ఎవరి రుచికి తగ్గట్టు ఉప్పు,కారం,మసాలాలు,నిమ్మరసం 

ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.














Share/Bookmark

Wednesday, May 18, 2011

ఐస్ క్రీం ఫ్రూట్ పంచ్

 ఐస్ క్రీం,అన్నిరకాల పళ్ళు కలిపి చేసే మరో రుచికరమైన ఐటం 

ఇది.వేసవిలో చల్లగా అన్నిరకాల ఫ్లేవర్స్ తో చాలాబావుంటుంది.





కావలసిన పదార్ధాలు:

 మిక్స్డ్ ఫ్రూట్స్                           ఒక కప్పు 

మామిడి,అరటి,ద్రాక్ష,పుచ్చకాయ,యాపిల్,పైన ఆపిల్ 

 ఐస్ క్రీం                                  రెండు కప్పులు 

వెనీలా,బటర్ స్కాచ్,స్ట్రా బెర్రీ ఇలా ఏ ఫ్లేవర్ అయినా రెండు రకాల ఐస్ 

క్రీం ఒక్కొక్కటి ఒక్కొక్క కప్పు 

పంచదార                               రెండు మూడు టీ స్పూన్స్ 


తయారు చేసే విధానం:

ముందుగా పళ్ళ ముక్కలు,పంచదార కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు రెండు రకాల ఐస్ క్రీం వేసి బ్లెండ్ చేసి సర్వ్ చేసుకోవాలి.

చిక్కగా ఉంటుంది కనుక కప్స్ లో వేసి పైన ఫ్రూట్ పీసెస్ వేసి 

ఇవ్వొచ్చు 


Share/Bookmark

Sunday, May 15, 2011

బనానా చాక్లెట్ మిల్క్ షేక్

అరటిపండు,చాక్లెట్ కలిపి చేసే మిల్క్ షేక్ ఇది చాలా సింపుల్ గా రెండు 

నిమిషాల్లో చేసి పిల్లలకి ఇచ్చేయ్యొచ్చు.కిట్ కాట్,ఫైవ్ స్టార్,కాడ్బరీ 

ఇలా ఏ చాక్లెట్ అయినా వాడొచ్చు.






కావలసిన పదార్ధాలు 

పాలు                          ఒక కప్పు 

అరటిపండు                    ఒకటి 

చాక్లెట్                          ఒకటి(చిన్నది)

పంచదార                     ఒక టీ స్పూన్ 


తయారు చేసే విధానం :

చాక్లెట్ ముక్కలు,అరటిపండు,పంచదార మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ 

చెయ్యాలి.

ఇందులో చల్లని పాలు పోసి బ్లెండ్ చేసి తీసుకోవాలి.

పైన కొంచెం చాక్లెట్ గ్రేట్ చేసి వేస్తే కలర్ ఫుల్ గా  ఉంటుంది.

టేస్ట్ ను బట్టి పంచదార ఇంకా వేసుకోవచ్చు. 


Share/Bookmark

Sunday, May 8, 2011

ఫ్రూట్ లస్సీ

లస్సీ అనగానే అరటిపండు,మామిడి పండు ఇలా ఏదైనా ఒక పండు 

వేసి చేస్తాము కదా.అలా కాకుండా అన్ని పళ్ళూ కలిపి చేసే ఈ ఫ్రూట్ 

లస్సీ చాలా మంచి ఫ్లేవర్ తో రుచిగా ఉంటుంది.








కావలసిన పదార్ధాలు:


అరటిపండు                           ఒకటి 

మామిడిముక్కలు                   ఒక కప్పు 

పుచ్చకాయముక్కలు              ఒక కప్పు 

ద్రాక్ష                                అర కప్పు

యాపిల్ ముక్కలు                 అర కప్పు 

పెరుగు                              పావు లీటరు 

పంచదార                            అర కప్పు

వెనీలా ఎసెన్స్                     రెండు చుక్కలు 

ఐస్ క్యూబ్స్


తయారు చేసే విధానం :


అన్ని పళ్ళు మిక్సీజార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

ఇందులో పంచదార,ఎసెన్స్,పెరుగు వేసి బ్లెండ్ చెయ్యాలి.

చివరిగా క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసి సర్వ్ చేసుకోవాలి.


Share/Bookmark

Thursday, May 5, 2011

బెండకాయ ఓట్స్ ఫ్రై

లేలేత బెండకాయల ఫ్రై అందరూ చాలా ఇష్టపడతారు.రొటీన్ గా చేసేది  

కాకుండా ఓట్స్,ఉల్లిపాయ వేసి చేస్తే కూడా చాలా బావుంటుంది.

మైక్రో వేవ్ లో చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది.జిగురు లేకుండా 

కూర పొడిపొడిగా వస్తుంది.




కావలసిన  పదార్ధాలు  :

బెండకాయలు                          పావుకిలో 

ఉల్లిపాయ                               ఒకటి 

మిర్చి                                    రెండు 

ఓట్స్                                     మూడు టేబుల్ స్పూన్లు 

ఉప్పు,కారం                             తగినంత 

నూనె                                    మూడు టేబుల్ స్పూన్లు 

కరివేపాకు                               ఒక రెమ్మ 

గరం మసాల పొడి                    అర టీ స్పూన్ 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు 


తయారు చేసే విధానం:

ఒక మైక్రో సేఫ్ బౌల్ లో నూనె,తాలింపు దినుసులు,వెల్లుల్లిరెబ్బలు  

వేసి ఒక నిమిషం హైలో పెట్టాలి.

అవి వేగాక తీసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి రెండు 

నిముషాలు ఉంచాలి.

ఇప్పుడు తరిగిన బెండకాయ ముక్కలు వేసి కలిపి హైలో ఉంచాలి.

ముక్కలు వేగాక ఉప్పు,కారం,ఓట్స్ వేసి బాగా కలిపి మళ్లీ ఓవెన్ లో 

పెట్టాలి.

ఓట్స్ ఉడికి కూర వేగిపోయాక గరంమసాల పొడి చల్లి ఇంకో నిమిషం 

పెడితే సరిపోతుంది.

కూర వేగేటప్పుడు ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి తీసి 

కలుపుకోవాలి.


Share/Bookmark

Monday, May 2, 2011

యాపిల్ బ్రెడ్ హల్వా

హల్వా అనగానే జనరల్ గా కారట్,సొరకాయ,బీట్రూట్ వీటితోనే 

ఎక్కువ చేస్తాము.కొంచెం వెరైటీగా యాపిల్ తురుము,బ్రెడ్ కలిపి చేసే 

ఈ హల్వా రుచిగా డిఫెరెంట్ టేస్ట్ తో పిల్లలకి చాలా నచ్చుతుంది.





 కావలసిన పదార్ధాలు:


యాపిల్                       ఒకటి 

బ్రెడ్                            నాలుగు స్లైసెస్

పాలు                          రెండు కప్పులు 

నెయ్యి                        మూడు టేబుల్ స్పూన్లు 

పంచదార                     ఒకటిన్నర కప్ 

ఇలాచీ పొడి                   పావు స్పూన్

కాజూ,బాదం  


 తయారు చేసే విధానం :

ముందుగ బ్రెడ్ స్లైసెస్ ని క్రంబ్స్ గ చేసుకోవాలి.

ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి ఈ క్రంబ్స్ ను దోరగా వేయించి తీసుకోవాలి 

మైక్రోవేవ్ లో అయితే ఒక నిమిషం హైలో పెట్టి తరువాత టెంపరేచర్ 

తగ్గించి మరో రెండు నిముషాలు పెడితే చక్కగా క్రిస్ప్ గా ఫ్రై అవుతాయి.

ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి కాజూ వేయించి తీసుకోవాలి.ఇదే నేతిలో 

యాపిల్ తురుము వేసి వేయించాలి.

తురుము వేగిన తరువాత బ్రెడ్ క్రంబ్స్ కూడా వేసి కలపాలి 

ఇప్పుడు పాలు,పంచదార వేసి సన్నని మంటపై బాగా దగ్గర పడేవరకు 

ఉడికించి ఇలాచీ పొడి,మిగిలిన నెయ్యి వేయాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కాజూ,బాదంతో అలంకరిస్తే ఎంతో రుచిగా 

ఉండే యాపిల్ బ్రెడ్ హల్వా నోరూరిస్తుంది.  

యాపిల్ పుల్లగా ఉంటే పాలు వేయగానే విరిగిపోయే అవకాశం ఉంది.

అందుకని పులుపు లేకుండా ఉంటే బావుంటుంది.

ఇష్టం ఉన్నవారు ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు.


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP