మామిడి లస్సీ
కాస్త ఎండలు మొదలైతే చాలు చల్లచల్లగా తాగాలనిపిస్తుంటుంది కూల్
డ్రింక్స్ బదులు వీలైనంతవరకూ ఫ్రూట్స్ తో ఏమి చేసినా బావుంటాయి.
చాలా తక్కువ పదార్ధాలతో రెండు నిమిషాల్లో ఈ లస్సీ చేసెయ్యొచ్చు.
కావలసిన పదార్ధాలు:
మామిడి ముక్కలు ఒక కప్పు
ఫ్రెష్ పెరుగు ఒక కప్పు
పంచదార తగినంత
చల్లని నీరు
తయారు చేసే విధానం:
మామిడిముక్కలు,తగినంత పంచదార కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
ఇప్పుడు పెరుగు వేసి బ్లెండ్ చెయ్యాలి.
చివరగా చల్లని నీళ్ళు పోసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి.ఇష్టం ఉంటే నీరు
బదులు ఐస్ క్యూబ్స్ వాడొచ్చు.
గ్లాస్ లో పోసి పైన మామిడి ముక్కలు వేస్తే రుచికరమైన లస్సీ
తయారవుతుంది.

3 comments:
Very nice recipe. I will try it.
Latha garu bagundandi :)
Naku oka chinna help kavali :) Nenu pappu cheyadaniki ani pachi maamidikaya teste.... adi lopala yellow ga undi...inka tiyyagaa gaa koodaa undi. Dantho emanna cheyochu antaaraa???
నీ కామెంట్ ఇప్పుడే చూశాను ఇందూ
ఆ మామిడికాయ ముక్కలు కోసి ఉడికించి తగినంత పంచదర కలిపి గ్రైండ్ చేసెయ్యి.చల్లని నీళ్ళు కలిపితే మంచి జ్యూస్ తయారవుతుంది.
Post a Comment