Thursday, May 31, 2012

మాంగో- స్వీట్ కార్న్ సలాడ్

తీయతీయగా చల్లచల్లగా ఉండే ఈ మామిడి స్వీట్ కార్న్ సలాడ్ 

వేసవిలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అయినా సాయంత్రాలు తిన్నా కూడా 

బావుంటుంది.కిచెన్ లోకి కూడా వెళ్ళకుండా సింపుల్ గా చేసుకోవచ్చు.




 




కావలసిన పదార్ధాలు:


మామిడిపండు                ఒకటి

 
స్వీట్ కార్న్                    ఒక కప్పు
 
టమాటా                        ఒకటి
 
ఉల్లిపాయ                      ఒకటి
 
కొత్తిమీర                       ఒక స్పూన్
 
ఉప్పు                           చిటికెడు
 
నిమ్మరసం                   ఒక టీ స్పూన్


తయారు చేసే విధానం:


 

స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి.
 
మామిడిపండు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
 
ఒక బౌల్ లో మామిడి ముక్కలు,ఉడికించిన కార్న్,సన్నగా తరిగిన 

టమాటా,ఉల్లి,కొత్తిమీర వేయాలి.
 
చిటికెడు ఉప్పు,నిమ్మరసం వేసి బాగా కలపాలి.
 
కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తింటే బావుంటుంది.

ఉల్లిముక్కలు  క్రంచీనెస్ కోసమే ఇష్టం లేకపోతే మానెయ్యొచ్చు.


Share/Bookmark

Wednesday, May 30, 2012

కాజు - బాదం ఖీర్

డ్రై ఫ్రూట్స్ అంటేనే రుచికి,ఆరోగ్యానికి పెట్టింది పేరు.కాజు,బాదం వీటితో 

చేసే ఈ ఖీర్ చాలా రుచిగా ఉంటుంది.పిల్లలకి మంచిది కూడా.


 





కావలసిన పదార్ధాలు:

 

జీడిపప్పు                      25
 
బాదంపప్పు                   25
 
పాలు                        అరలీటరు
 
పంచదార                   అర కప్పు
 
ఇలాచీ పొడి               పావు స్పూన్
 
సాఫ్రాన్                      కొద్దిగా


 
తయారు చేసే విధానం:


బాదంపప్పును వేడి నీళ్ళలో నానబెట్టి పొట్టు తీయాలి.
 
జీడిపప్పును,బాదంపప్పును చిన్న ముక్కలు చేసి మెత్తగా పొడి 

చెయ్యాలి.
 
ఇందులో ఒక పావు కప్పు పాలు పోసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
 
పాలు,పంచదార కలిపి బాగా మరిగించి,ఈ కాజూ,బాదాం పేస్ట్ వేసి 

ఉడికించాలి.
 
ఖీర్ చిక్కగా అయ్యాక ఒక స్పూన్ గోరువెచ్చని  పాలలో వేసిన

సాఫ్రాన్,ఇలాచీపొడి వేసి కలపాలి.
 
ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయ్యాక సర్వ్ చేసేటప్పుడు కాజు,బాదాం సన్నగా

 తరిగి పైన వేసి ఇవ్వాలి.


Share/Bookmark

Monday, May 28, 2012

బనానా స్ట్రా బెర్రీ మిల్క్ షేక్

స్ట్రా బెర్రీస్ ,అరటిపండు కలిపి చేసే రుచికరమైన మిల్క్ షేక్ ఇది.

వెరైటీ టేస్ట్ ఇష్టపడే పిల్లలకు చాలా నచ్చుతుంది




 





కావలసిన పదార్ధాలు:


స్ట్రా బెర్రీస్                     ఆరు
 
అరటిపండు                 ఒకటి
 
చల్లని పాలు                ఒక గ్లాస్
 
వెనీలా ఎసెన్స్             అర టీ స్పూన్
 
పంచదార                   రెండు టీ స్పూన్స్


తయారు చేసే విధానం



స్త్రాబెర్రీస్ ను,అరటిపండును ముక్కలు చేసి పంచదార తో కలిపి మెత్తగా 

గ్రైండ్ చెయ్యాలి.
 
ఇప్పుడు ఎసెన్స్,పాలు వేసి బ్లెండ్ చెయ్యాలి.


Share/Bookmark

Friday, May 25, 2012

గోంగూర పచ్చడి

ఆవకాయ తరువాత అంత ఇష్టంగానూ తినే పచ్చడి గోంగూర.ఈ 

పచ్చడిని కూడా చాలా రకాలుగా చేస్తారు ఎండుమిర్చి వేసి చేసే ఈ 

పచ్చడి కూడా నిలువ ఉంటుంది.


 






కావలసిన పదార్ధాలు:


గోంగూర                            ఆరుకట్టలు

 
ఎండుమిర్చి                         పదిహేను

వెల్లుల్లి రెబ్బలు                       పది

జీలకర్ర                               ఒక టీ స్పూన్ 
 
కరివేపాకు                          రెండు రెమ్మలు
 
ఉప్పు,నూనె
 
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,వెల్లుల్లి రెబ్బలు


 

తయారు చేసే విధానం:


గోంగూర ఆకులు కడిగి ఆరబెట్టాలి.నీరు పోయిన తరువాత రెండు 

మూడు స్పూన్స్ నూనె వేసి బాగా వేయించాలి.
 
మరొక పాన్ లోఒక స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి దోరగా వేయించాలి.
 
ఎండుమిర్చి,తగినంతః ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర మెత్తగా గ్రైండ్ 

చేసుకోవాలి.
 
గోంగూరలో ఈ ఎండుమిర్చి మిశ్రమం వేసి నూరుకోవాలి.
 
తగినంత నూనె వేడి చేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే కమ్మని 

గోంగూర పచ్చడి రెడీ అవుతుంది.

కారాన్ని బట్టి ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.అలాగే 

పులుపు కూడా.గోంగూర బాగా పుల్లగా ఉంటే చింతపండు అక్కర్లేదు,

లేకపోతే కొంచెం చింతపండు కూడా వాడొచ్చు


Share/Bookmark

Monday, May 21, 2012

కాబేజ్ టమాటా పచ్చడి

కాబేజ్ అంటే ఎక్కువగా కూరగా మాత్రమే చేస్తాము.కానీ దీనితో రోటి 

పచ్చడి కూడా చెయ్యొచ్చు.టమాటా,కొత్తిమీర కలిపి చేస్తే అన్నంలోకి, 

టిఫిన్స్ లోకి కూడా బావుంటుంది.

 

 




కావలసిన పదార్ధాలు:


కాబేజ్                                    పావుకిలో

 
టమాటాలు                                రెండు
 
పచ్చిమిర్చి                               పది
 
కొత్తిమీర                                  ఒక కట్ట
 
జీలకర్ర                                  ఒక టీ స్పూన్
 
చింతపండు పేస్ట్                        ఒక టీ స్పూన్
 
వెల్లుల్లి రెబ్బలు                          నాలుగు
 
ఉప్పు,నూనె
 



తయారు చేసే విధానం:


కాబేజ్ ను కడిగి సన్నగా తరగాలి.

 
కాబేజ్,టమాటా ముక్కలు,కొత్తిమీర,పచ్చిమిర్చి కలిపి నూనె వేసి 

వేయించాలి.కాబేజ్ బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
 
కొంచెం చల్లారిన తరువాత మిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి గ్రైండ్ 

 చేసుకోవాలి.
 
ఇప్పుడు కాబేజ్ మిశ్రమం వేసి గ్రైండ్ చెయ్యాలి.
 
ఇష్టమైతే ఈ పచ్చడికి తాలింపు కూడా పెట్టుకోవచ్చు.
 
  పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటుంది.కారం తక్కువ  

తినేవారు మిర్చి ఎడ్జస్ట్ చేసుకోవచ్చు.


Share/Bookmark

Friday, May 18, 2012

పైనాపిల్ - మాంగో మిల్క్ షేక్

రెండు,మూడు రకాల ఫ్రూట్స్ కలిపి మిల్క్ షేక్స్ చేస్తే  ఫ్లేవర్స్ మిక్స్ 

అయ్యి వెరైటీ రుచి వస్తుంది.మామిడి ముక్కలు,పైనాపిల్ కలిపిన ఈ 

మిల్క్ షేక్  పిల్లలకు చాలా నచ్చుతుంది


 







కావలసిన పదార్ధాలు:


పైనాపిల్ జ్యూస్                            ఒక కప్పు

 
మామిడి ముక్కలు                      ఒక కప్పు
 
వెనీలా ఐస్ క్రీం                          అర కప్పు
 
పంచదార                                 తగినంత 
 
చల్లని పాలు                             ఒక కప్పు


తయారు చేసే  విధానం:


 

ముందుగా  మామిడి ముక్కలు,పంచదార కలిపి గ్రైండ్ చేసుకోవాలి.
 
ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ ,ఐస్ క్రీం  వేసి బ్లెండ్ చెయ్యాలి.
 
చివరగా పాలు పోసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి.
 
ఇష్టం ఉంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వాడొచ్చు


Share/Bookmark

Tuesday, May 15, 2012

ఊతప్పం

చాలా మంచి ట్రెడిషనల్ రెసిపీ ఈ ఊతప్పం.చాలా వరకూ మిగిలిన దోశ,

ఇడ్లీ పిండి తో చేస్తారు కానీ ఫ్రెష్ గా తగిన కొలతలతో రుబ్బి చేస్తే చాలా 

బావుంటుంది






 

కావలసిన పదార్ధాలు:


మినప్పప్పు                       ఒక గ్లాస్

 
బియ్యం                          ఒకటిన్నర గ్లాస్
 
ఉప్పుడుబియ్యం                 ఒకటిన్నర గ్లాస్

ఉల్లిపాయలు                      రెండు

 
పచ్చిమిర్చి                       రెండు
 
కరివేపాకు                        ఒక రెమ్మ
 
అల్లం                              చిన్న ముక్క
 
కారట్                              ఒకటి
 
ఉప్పు,నూనె


 
తయారు చేసే విధానం:


 
మినప్పప్పు ,బియ్యం అన్నీ నానబెట్టుకోవాలి.ఉప్పుడు బియ్యం మాత్రం 

ఉదయాన్నే నానబెట్టేస్తే బాగా మెత్తగా నలుగుతాయి.నాలుగైదు గంటలే 

టైం ఉంటే ఉప్పుడుబియ్యం మాత్రం వేడినీళ్ళలో నానబెట్టుకోవాలి.
 
మూడూ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.తెల్లవారి ఉదయానికి పిండి 

పొంగి రెడీ అవుతుంది.
 
తగినంత ఉప్పు కలిపి తవాపై కొంచెం మందంగా ఊతప్పం వేయాలి.
 
పైన సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు,అల్లం.కారట్ తురుము 

చల్లి నూనె వేసి మూత పెట్టెయ్యాలి.
 
చిన్న మంటపై ఉడకనివ్వాలి.రెండో వైపుకు తిప్పనవసరం లేదు పైన 

స్టీం కు ఉడికిపోతుంది.
 
అడుగున క్రిస్ప్ గా కరకరలాడుతూ పైన స్పాంజ్ లా మెత్తగా ఉండే 

ఊతప్పంను వేడిగా కొబ్బరి పచ్చడితో సర్వ్ చేస్తే బావుంటుంది


Share/Bookmark

Saturday, May 12, 2012

సోయా పాలక్ రైస్

ఆరోగ్యానికి ఎంతో మంచివైన సోయా  గ్రాన్యూల్స్, పాలకూర కలిపి చేసే 

హెల్దీ రైస్ ఐటం ఇది.అన్నీ రెడీ చేసుకుంటే త్వరగా చేసెయ్యొచ్చు.







 
కావలసిన పదార్ధాలు :


సోయా గ్రాన్యూల్స్                      ఒక కప్పు
 
పాలకూర                               మూడు కట్టలు
 
అన్నం                                  రెండు కప్పులు
 
ఉల్లిపాయ                               ఒకటి
 
పచ్చిమిర్చి                              రెండు
 
కరివేపాకు                              ఒక రెమ్మ
 
కొత్తిమీర                                ఒక కట్ట
 
పుదీనా                                  కొద్దిగా
 
అల్లంవెల్లుల్లి పేస్ట్                      ఒక టీ స్పూన్
 
గరం మసాలా పొడి                   ఒక టీ స్పూన్
 
ఉప్పు,పసుపు,కారం,నూనె
 
లవంగాలు,చెక్క,షాజీర


తయారు చేసే విధానం:


సోయాగ్రాన్యూల్స్ ను మరిగే నీళ్ళలో రెండు నిముషాలు ఉడికించి 

వడపోయాలి.చల్లని నీళ్ళతో కడిగి నీరు పిండేసి ఉంచుకోవాలి.
 
పాలకూర సన్నగా తరిగి అర స్పూన్ నూనె వేసి ఉడికించి పెట్టుకోవాలి.
 
నూనె వేడి చేసి రెండు లవంగాలు ,చిన్న దాల్చిన చెక్క ముక్క,షాజీర

వేయాలి.
 
సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.
 
అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించి సోయాగ్రాన్యూల్స్ వేయాలి.తడి 

అంతా పోయి డ్రై గా వేయించాలి.
 
ఉడికించిన పాలకూర వేసి బాగా కలిపి పసుపు,కారం,గరం మసాలా 

పొడి వేయాలి.
 
చివరగా అన్నం,తగినంత ఉప్పు,తరిగిన కొత్తిమీర,పుదీనా వేసి బాగా 

కలిపి రెండు మూడు నిముషాలు వేయించాలి.
 


Share/Bookmark

Tuesday, May 8, 2012

సపోటా మిల్క్ షేక్

సీజనల్ గా వచ్చే పాల సపోటాలు చాలా రుచిగా ఉంటాయి.వాటిని 

ఇష్టంగా తినని  పిల్లలూ ఉంటారు.వాళ్లకి ఇలా క్రీమీగా,చిక్కగా మిల్క్ 

షేక్  చేసి ఇస్తే సరిపోతుంది.








కావలసిన పదార్ధాలు:




సపోటాలు                          రెండు

 
చల్లని పాలు                       ఒక కప్పు
 
వెనీలా ఐస్ క్రీం                   ఒక స్కూప్
 
పంచదార,తేనె



తయారు చేసే విధానం:



సపోటాలు గింజలు తీసి చిన్న ముక్కలు చేసి పాలతో కలిపి మెత్తగా 

గ్రైండ్ చెయ్యాలి.
 
ఒక టేబుల్ స్పూన్ పంచదార కానీ,తేనె కానీ వెయ్యాలి.
 
చివరగా ఐస్ క్రీం వేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తే  కమ్మని మిల్క్ షేక్ రెడీ 

అవుతుంది


Share/Bookmark

Friday, May 4, 2012

చింతచిగురు కొబ్బరి పచ్చడి

ఈ సీజన్ లో చింతచిగురు బాగా వస్తుంది.పప్పులో వేసినా,నాన్ వెజ్ తో 

కలిపి వండినా,పచ్చడి చేసినా ఎలా అయినా అంతా ఇష్టపడతారు.

పచ్చికొబ్బరితో చింతచిగురు కలిపి చేసే ఈ పచ్చడి అన్నంలోకి 

బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


చింతచిగురు                   125 గ్రాములు
 
కొబ్బరి తురుము              ఒక కాయ
 
ఎండుమిర్చి                     పదిహేను
 
వెల్లుల్లి రెబ్బలు                  ఎనిమిది
 
జీలకర్ర                           ఒక టీ స్పూన్
 
కరివేపాకు                       రెండు రెమ్మలు
 
ఉప్పు,నూనె

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి


తయారు చేసే విధానం:


చింతచిగురు శుభ్రం చేసి కడగాలి
 
ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చి దోరగా వేయించి 

తీసుకోవాలి
 
మరో రెండు స్పూన్లు నూనె వేసి చింతచిగురు వేసి వేయించాలి.మగ్గిన 

తరువాత కొబ్బరి తురుము కూడా వేసి రెండు నిముషాలు వేయించాలి.
 
ఎండుమిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 
ఇప్పుడు వేగిన చింతచిగురు,కొబ్బరి మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి.
 
రెండు టీ స్పూన్స్  నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి.

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే చాలా రుచిగా 

ఉంటుంది.
 
ఎవరి టేస్ట్ కి తగ్గట్టు ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.




Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP