Monday, October 31, 2011

పనీర్ ఫ్రైడ్ రైస్

చల్లగా ఉండే ఈ శీతాకాలంలో వేడివేడిగా రైస్ వెరైటీస్ నోరూరిస్తాయి.

ఈజీగా చేసుకోగల ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది.కొంచెం 

స్పైసీగా లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది 









కావలసిన పదార్ధాలు:


బాస్మతి బియ్యం                       ఒక గ్లాస్ 

పనీర్                                   వంద గ్రాములు 

పచ్చిబటానీ                            అర కప్పు 

కారట్ తురుము                       అర కప్పు 

కొబ్బరితురుము                       అర కప్పు 

ఉల్లిపాయ                              ఒకటి 

మిర్చి                                  ఒకటి 

కొత్తిమీర                               ఒక కట్ట 

అల్లంవెల్లుల్లి ముద్ద                   ఒక టీ స్పూన్ 

గరంమసాలా పొడి                   ఒక టీ స్పూన్ 

మిరియాలపొడి                       ఒక టీ స్పూన్ 

టమాటాసాస్                         ఒక టేబుల్ స్పూన్ 

రెడ్ చిల్లీ సాస్                         ఒక టేబుల్ స్పూన్

కొద్దిగా కాజూ,తగినంత ఉప్పు,అర టీస్పూన్ కారం,

రెండు టేబుల్ స్పూన్స్ నూనె



తయారు చేసే విధానం:


బియ్యం కడిగి పొడిపొడిగా అన్నం వండుకోవాలి.

ఒక టీ స్పూన్ నూనెలో కాజూ,పనీర్ ముక్కలు వేయించి తీసుకోవాలి.

నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చివేసి దోరగా 

వేయించాలి.

ఇందులో కారట్ తురుము,ఉడికించిన బటానీలు, కొబ్బరితురుము 

కూడా వేసి కలిపి వేయించాలి.

అల్లంవెల్లుల్లి ముద్ద,కారం,సాస్ లు వేసి బాగా కలిపి వేగిన తరువాత 

పనీర్ ముక్కలు,అన్నం వేయాలి.

తగినంత ఉప్పు,మిరియాలపొడి,గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి బాగా 

కలుపుతూ సన్నని మంటపై వేయించుకోవాలి.

ఒక ప్లేట్ లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర,వేయించిన కాజూతో 

అలకరించుకోవాలి. 











Share/Bookmark

Sunday, October 30, 2011

పొంగలి

మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ ఐటం ఇది.ఇందులోకి కొబ్బరి పచ్చడి మంచి 

కాంబినేషన్.వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.

 




కావలసిన పదార్ధాలు :


బియ్యం                             రెండు కప్పులు 

పెసరపప్పు                            ఒక కప్పు 

కరివేపాకు                            ఒక రెమ్మ 

అల్లం                                 చిన్న ముక్క 

ఉప్పు                                 తగినంత 

నెయ్యి,నూనె 

తాలింపుకు కాజూ,శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,మిరియాలు,ఎండుమిర్చి 



తయారు చేసే పధ్ధతి :


పెసరపప్పును దోరగా వేయించి బియ్యంతో కలిపి కడిగి పెట్టుకోవాలి.

ప్రెషర్ పాన్ లో రెండు స్పూన్స్ నెయ్యి,రెండు స్పూన్స్ నూనె వేడిచేసి 

తాలింపు వెయ్యాలి.దోరగా వేగిన తరువాత కరివేపాకు,సన్నగా తరిగిన 

అల్లం ముక్కలు వేసి వేయించాలి.

ఇప్పుడు బియ్యం, పెసరపప్పు  వేసి రెండు నిముషాలు వేయించి నీళ్ళు,

తగినంత ఉప్పు వేసి కలపాలి.

సగం ఉడికిన తరువాత మూతపెట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి.వెంటనే 

మూత పెట్టేస్తే నీరు పొంగిపోతుంది  

స్టీం పోయిన తరువాత ఒకసారి బాగా కలిపి కొబ్బరిపచ్చడితో వడ్డించాలి.


నోట్: తాలింపులో మిరియాలు,జీలకర్ర ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్స్ తో 

స్పైసీగా బావుంటుంది.

అలాగే గ్లాసున్నర(బియ్యం,పెసరపప్పు)కు నేను అయిదు గ్లాసుల 

నీళ్ళు పోశాను.పొంగలి బాగా మెత్తగా జారుగా కావాలి అంటే ఇంకా 

ఎక్కువ వాడొచ్చు.


Share/Bookmark

Friday, October 28, 2011

పూర్ణాలు

పండుగైనా,శుభకార్యమైనా తప్పనిసరిగా చేసుకునే తీపి వంట ఈ 

పూర్ణాలు.వీటినే కొందరు బూరెలు అంటారు.








కావలసిన పదార్ధాలు:


శనగపప్పు                         ఒక గ్లాస్ 

బెల్లం                              ఒకటిన్నర గ్లాస్ 

పంచదార                          అర గ్లాస్ 

పచ్చికొబ్బరి                       ఒక కప్పు

ఇలాచీపొడి                       ఒక టీ స్పూన్ 


పూతపిండి కోసం 


మినప్పప్పు                       ఒక  గ్లాస్ 

బియ్యం                          రెండు గ్లాసులు 

ఉప్పు,నూనె




తయారు చేసేవిధానం:


మినప్పప్పు,బియ్యం అయిదారుగంటలు నానబెట్టి మెత్తగా 

రుబ్బుకోవాలి.

ఈపిండిని కొంచెం పొంగేవరకు ఉంచి,తగినంత ఉప్పు కలిపి అప్పుడు 

పూర్ణాలు వండితే పైపూత  కూడా మృదువుగా ఉంటుంది.



పూర్ణం తయారు చేయడానికి 


శనగపప్పు మెత్తగా ఉడికించాలి.ఇందులో తరిగిన బెల్లం,పంచదార,

కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు ఉడికించాలి.

ఇందులో ఇలాచీపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.

ఈమిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసి వీటిని పిండిలో ముంచి కాగిన 

నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.





Share/Bookmark

Wednesday, October 26, 2011

మలై లడ్డు

అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

పండుగ కదా.వెరైటీ స్వీట్ చేసుకుంటే బావుంటుంది.సింపుల్ గా

చాలా తక్కువ పదార్ధాలతో అయిదు నిమిషాల్లో రెడీ అయ్యే ఈ లడ్డు 

రుచి కూడా చాలా బావుంటుంది.











కావలసిన పదార్ధాలు : 


పనీర్                                  రెండు కప్పులు 

మిల్క్ మెయిడ్                       ఒక కప్పు 

నెయ్యి                                ఒక టీ స్పూన్ 

ఇలాచీపొడి                           పావు టీ స్పూన్ 

కాజూ,బాదం


తయారు చేసే విధానం:


పనీర్ ను తురుముకోవాలి.

ఒక నాన్ స్టిక్ పాన్ లో పనీర్ తురుము,మిల్క్ మెయిడ్ వేసి బాగా 

కలపాలి.

ఈ మిశ్రమాన్ని సన్నని సెగపై కలుపుతూ ఉడికించాలి.కొంచెం 

దగ్గరవుతుండగా నెయ్యి,సన్నగా కట్ చేసిన కాజు,బాదం,ఇలాచీపొడి 

వేయాలి.

ముద్దగా వస్తున్నప్పుడు దించేసి బాగా చల్లారిన తరువాత లడ్డూలు 

చేసుకోవాలి.ఇవి  కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి పేపర్ కప్స్ లో 

పెట్టి సర్వ్ చేస్తే బావుంటుంది.


Share/Bookmark

Monday, October 24, 2011

బొబ్బట్లు

పండగలు అంటేనే స్పెషల్స్,పిండివంటలు తప్పనిసరి.అందులో బాగమే 

ఈ తియ్య తియ్యని బొబ్బట్లు.వీటినే భక్ష్యాలు అని కూడా అంటారు.









కావలసిన పదార్ధాలు 


మైదాపిండి                         రెండు కప్పులు 

వెన్నపూస                         రెండు టేబుల్ స్పూన్స్ 

 ఉప్పు                               చిటికెడు 

నూనె                              ఒక టీ స్పూన్ 



శనగపప్పు                         ఒక గ్లాస్ 

బెల్లం                              ఒకటిన్నర గ్లాస్ 

పంచదార                          అర గ్లాస్ 

పచ్చికొబ్బరి                       ఒక కప్పు

ఇలాచీపొడి                       ఒక టీ స్పూన్


 తయారు చేసేవిధానం:


శనగపప్పు మెత్తగా ఉడికించాలి.ఇందులో తరిగిన బెల్లం,పంచదార,

కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు ఉడికించాలి.

ఇందులో ఇలాచీపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.

ఈలోగా మైదాపిండిలో ఉప్పు,వెన్నపూస కలిపి తగినన్ని నీళ్ళతో 

చపాతీపిండిలా మృదువుగా కలపాలి.ఈ పిండికి కొంచెం నూనె రాసి 

ఒక గంట నాననివ్వాలి.

ఇప్పుడు నానిన పిండిని చిన్న ఉండ తీసుకుని  కొంచెం వత్తి మధ్యలో 

శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్నివైపులా మూసి ఉండ చేసుకోవాలి.

దీన్ని పలుచని చపాతీలా వత్తి తవాపై  రెండువైపులా నేతితో కాల్చాలి.



Share/Bookmark

Saturday, October 22, 2011

కారప్పూస

పిండివంటల్లో ఎక్కువ చేసుకునేది కారప్పూస.శలవులు వచ్చాయంటే 

పిల్లలకి  ఇదో,జంతికలో ఏవో ఒకటి ఉండాల్సిందే.







కావలసిన పదార్ధాలు:



శనగపిండి                          అరకిలో 

బియ్యంపిండి                       అరకిలో 

వెన్నపూస                         వంద గ్రాములు 

ఉప్పు,కారం                         తగినంత 

వాము పొడి                        రెండు టీ స్పూన్స్ 

నూనె 


 
తయారు చేసే విధానం:


శనగపిండి,బియ్యంపిండి జల్లించి ఉప్పు,కారం,వాముపొడి,వెన్న వేసి 

బాగా కలుపుకోవాలి. 

కొంచెం పిండిని తగినన్ని నీళ్ళతో ముద్ద చేసుకుని జంతికల గిద్దలో పెట్టి

కాగిన నూనెలో వత్తుకోవాలి.

రెండువైపులా వేయించి తీసుకోవాలి.

చిన్నటిప్: మొత్తం పిండి ఒక్కసారే ముద్దగా కలిపి వండితే కారప్పూస 

ఎర్రగా వస్తుంది,అందుకని ప్రతిసారీ వత్తేముందు కొంచెం కొంచెంగా 

కలుపుకోవాలి.



Share/Bookmark

Thursday, October 20, 2011

చోలే - బటూరే

అందరూ ఇష్టపడే పాపులర్ బ్రేక్ ఫాస్ట్ ఐటం ఇది. చోలే కర్రీతో సాఫ్ట్ గా 

ఉండే బటూరాలు చాలా రుచిగా ఉంటాయి.






కావలసిన పదార్ధాలు:


మైదా పిండి                     రెండు కప్పులు 

బొంబాయిరవ్వ                 ఒక టేబుల్ స్పూన్ 

పెరుగు                          రెండు టేబుల్ స్పూన్స్

బేకింగ్ పౌడర్                   ఒక టీ స్పూన్ 

పంచదార                        అర టీ స్పూన్ 

ఉప్పు,నూనె 


తయారు చేసే విధానం:


మైదాపిండి,బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి.పిండిలో అన్నీ కలిపి 

చపాతీ పిండిలా సాఫ్ట్ గా ముద్ద చేసుకుని ఒక అరగంట నాననివ్వాలి.

ఇప్పుడు ఒకసారి బాగా మర్దించి చిన్న చిన్న ఉండలు చేసి పూరీలు 

వత్తుకోవాలి.

కాగిన నూనెలో దోరగా వేయించి చోలేకూరతో వడ్డించాలి.


చోలే ఆలూ మసాలా :


చోలే                                      రెండు కప్పులు

ఆలూ                                     రెండు 

ఉల్లిపాయలు                              రెండు 

మిర్చి                                     రెండు 

కరివేపాకు                                ఒక రెమ్మ 

కొత్తిమీర                                  ఒక కట్ట

టమాటాలు                               రెండు 

అల్లం వెల్లుల్లి ముద్ద                     ఒక టీ స్పూన్

చోలేమసాలా పొడి                      ఒక  టీ స్పూన్

నూనె                                    రెండు టేబుల్ స్పూన్స్ 

ఉప్పు ,కారం,పసుపు

లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానిఆకు, జీలకర్ర 


తయారు చేసే పధ్ధతి :


శనగలను నానబెట్టుకోవాలి 

నూనె వేడిచేసి నాలుగు లవంగాలు,చిన్న దాల్చినచెక్క, రెండు 

యాలకులు, బిర్యానీ ఆకు వేయాలి.

సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,మిర్చి,కరివేపాకు వేసి దోరగా 

వేయించాలి.  

అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటాముక్కలు వేయాలి.

ఇప్పుడు పసుపు,కారం వేసి ఆలూ ముక్కలు చోలే కూడా వేసి కలపాలి.

తగినంత ఉప్పు వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 

ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయాక చోలేమసాలా పొడి,కొత్తిమీర వేసి కొంచెం చిక్కబడ్డాక 

స్టవ్ ఆఫ్ చెయ్యాలి.ఆలూ వెయ్యడం వలన గ్రేవీ బాగా వస్తుంది.






Share/Bookmark

Tuesday, October 18, 2011

బ్రెడ్ రోల్స్

పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఈ బ్రెడ్ రోల్స్.కూర రెడీగా ఉంటే 

అయిదు నిమిషాల్లో చేసిపెట్టొచ్చు.లోపల ఫిల్లింగ్ మన ఇష్టం.ఆలూ 

కర్రీ,మిక్స్డ్ వెజ్ కర్రీ,పనీర్,కాలీఫ్లవర్ ఇలా ఏ కూర అయినా వాడొచ్చు.








కావలసిన పదార్ధాలు :


బ్రెడ్                                నాలుగు స్లైసులు 

ఆలూ కర్రీ                         ఒక కప్ 

నూనె,టమాటా సాస్ 


తయారు చేసే విధానం;


బ్రెడ్ స్లైసెస్ అంచులు కట్ చేసుకోవాలి.

ఒక బౌల్ లో నీళ్ళు తీసుకుని బ్రెడ్ ను వేసి వెంటనే తీసి అరచేతుల  

మధ్య ఉంచి నొక్కి నీళ్ళు వత్తెయ్యాలి.

స్లైస్ మధ్యలో కూర పెట్టి రోల్ లాగా చెయ్యాలి.ఇలా అన్నిరోల్స్ రెడీ 

చేసుకుని కాగిన నూనెలో ఎర్రగా వేయించి తీయాలి.

వేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి.


Share/Bookmark

Friday, October 14, 2011

బీట్రూట్ వడ

బీట్రూట్ హెల్త్ కి మంచిది.కూరగా ఇష్టపడనివారు వెరైటీగా ఈ వడలు 

చేసుకోవచ్చు.కొంచెం బీట్రూట్ స్వీట్ ఫ్లేవర్ తో,కొంచెం స్పైసీగా,

కలర్ ఫుల్ గా బావుంటాయి.






కావలసిన పదార్ధాలు:


శనగపప్పు                               రెండు కప్పులు 

బీట్రూట్ తురుము                      ఒక కప్పు 

ఉల్లిపాయ                               ఒకటి 

పచ్చిమిర్చి                             మూడు 

కరివేపాకు                             రెండు రెమ్మలు 

అల్లం                                  చిన్న ముక్క 

జీలకర్ర                                 ఒక టీస్పూన్ 

బియ్యంపిండి                         రెండు టేబుల్ స్పూన్స్ 

ఉప్పు                                    తగినంత  

నూనె 


తయారు చేసే విధానం:


శనగపప్పు రెండు గంటలు నానబెట్టుకోవాలి.

రెండుమూడు స్పూన్స్ పప్పును విడిగా తీసి మిగిలిన పప్పులో  జీలకర్ర,

అల్లం,మిర్చికలిపి గ్రైండ్ చేసుకోవాలి 

ఇందులో బీట్రూట్ తురుము, బియ్యంపిండి,తగినంత ఉప్పు,సన్నగా 

తరిగిన ఉల్లిపాయ,కరివేపాకు వేసి బాగా కలపాలి.

తీసి ఉంచిన శనగపప్పు కూడా వేసి చిన్నచిన్నవడలు చేసి కాగిన 

నూనెలో వేయించుకోవాలి.

సాస్ తో కానీ,చట్నీ తో కానీ వేడివేడిగా తింటే బావుంటాయి.


Share/Bookmark

Tuesday, October 11, 2011

కారట్ - పెసరపప్పు ఫ్రై

కారట్ తురుము,స్ప్రింగ్ ఆనియన్స్,పెసరపప్పు కలిపి చేసే ఈ కూర 

చాలా త్వరగా అయిపోతుంది.రైస్ లోకి బావుంటుంది.






కావలసిన పదార్ధాలు:


కారట్ తురుము                   ఒక కప్

పెసరపప్పు                          ఒక కప్ 

ఉల్లికాడలు                         ఒక కప్ 

మిర్చి                              రెండు 

కరివేపాకు                        ఒక రెమ్మ 

ఉప్పు,కారం                       తగినంత 

పసుపు                           చిటికెడు 

నూనె                             రెండు టీస్పూన్స్

గరంమసాలాపొడి                పావు టీస్పూన్

తాలింపుకు శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,వెల్లుల్లిరెబ్బలు


తయారు చేసే విధానం:


పెసరపప్పు కొంచెం ఉడికించి వార్చాలి.

నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన మిర్చి,ఉల్లికాడలు,

కారట్ తురుము వేసి పచ్చిదనం పోయేవరకూ వేగనివ్వాలి,

ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు వేసి బాగా కలిపి వేయించాలి,

ఉప్పు,కారం,పసుపు వేసి బాగా వేయించి చివరగా గరంమసాలాపొడి 

చల్లాలి.ఉల్లికాడల బదులు కొత్తిమీర వేసినా బావుంటుంది.


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP