Thursday, January 12, 2012

సగ్గుబియ్యం పునుగులు

ఎన్ని కొత్త కొత్త వెరైటీలు వచ్చినా ట్రెడిషనల్ గా ఉండే వంటలు కొన్ని 

ఉంటాయి.కమ్మని రుచితో నోరూరిస్తాయి.వాటిలో ఈ సగ్గుబియ్యం 

పునుగులు ఒకటి.క్రిస్పీగా కరకరలాడుతూ బావుంటాయి.








కావలసిన పదార్ధాలు:


సగ్గుబియ్యం                    ఒక కప్పు 

పెరుగు                          ఒక కప్పు 

మైదాపిండి                     రెండు కప్పులు 

బియ్యంపిండి                   ఒక కప్పు 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     నాలుగు 

కరివేపాకు,కొత్తిమీర,అల్లం ,ఉప్పు,వంటసోడా,నూనె 



తయారు చేసే విధానం : 


సగ్గుబియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి 

ఇందులో మైదా,బియ్యంపిండి,తగినంత ఉప్పు,చిటికెడు వంటసోడా 

వేసి తగినంత పెరుగుతో పిండి కలిపి ఒక గంట ఉంచాలి.పెరుగు 

లేకపోతే కొద్ది నీళ్ళతో కలపొచ్చు.అయితే పెరుగుతో కలిపితే రుచి 

చాలా బావుంటుంది.

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,కరివేపాకు,కొత్తిమీర వేసి బాగా కలిపి 

స్పూన్ తో చిన్నచిన్న పునుగుల్లా కాగిన నూనెలో వేయాలి.

రెండువైపులా వేయించి తీసుకుని టిష్యూ పేపర్ పైన పెడితే ఎక్సెస్ 

ఆయిల్ ఉంటే పోతుంది.

వేడిగా సాస్ తో కానీ చట్నీతో కానీ  తింటే ఛాలా బావుంటాయి.


Share/Bookmark

5 comments:

మాలా కుమార్

ఇదేదో బాగుందే . చేస్తాను .

లత

చేసి ఎలా ఉన్నాయో చెప్పండి మాలగారు

జ్యోతిర్మయి

మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన పునుగులు ఇవి..ఇప్పుడు ఇక్కడ మంచి సగ్గుబియ్యం దొరకట్లేదు, చేసి చాలా రోజులే అయింది.

మధురవాణి

భలే ఉన్నాయి. నేనూ ట్రై చేసి చూస్తా! :)

లత

మా ఇంట్లో కూడా డిటో జ్యోతిగారూ

చేసి చూడు మధురా, నచ్చుతాయి.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP