Tuesday, January 24, 2012

కారట్ - పాలక్ పులావ్

కారట్,పాలకూర రెండూ ఆరోగ్యానికి మంచివే.ఈ రెండూ కలిపి పులావ్ 

చేస్తే చాలా హెల్దీ రైస్ ఐటం రెడీ అవుతుంది.పిల్లలకి లంచ్ బాక్స్ లోకి  

ఇవ్వడానికి కూడా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                          రెండు కప్పులు

పాలకూర                             మూడు కట్టలు 

కారట్                                 మూడు 

ఉల్లిపాయ                             ఒకటి 

పచ్చిమిర్చి                           రెండు 

కొత్తిమీర                               ఒక కట్ట  

అల్లంవెల్లుల్లి పేస్ట్                      రెండు టీ స్పూన్స్ 

గరం మసాలా పొడి                   రెండు టీ స్పూన్స్ 

ఉప్పు,కారం,పసుపు,నూనె.

లవంగాలు,చెక్క,యాలకులు,షాజీర 


తయారు చేసే విధానం:


బియ్యం కడిగి పదినిమిషాలు నాననివ్వాలి.కారట్ తురుముకోవాలి.

పాలకూర,కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకోవాలి.

నూనె వేడిచేసి మసాల దినుసులు వేయాలి.సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి

వేసి వేయించాలి. 

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత పాలకూర,కారట్ తురుము 

వేసి వేగనివ్వాలి.

చిటికెడు పసుపు,కారం,గరం మసాలాపొడి,కొత్తిమీర వేసి కలపాలి.

ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి మరిగాక బియ్యం,తగినంత ఉప్పు వేసి

కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయాక తీసి ఒకసారి కలిపి వేడిగా రైతాతో వడ్డిస్తే రుచిగా 

ఉంటుంది.


Share/Bookmark

2 comments:

జయ

హమ్మయ్యా! ఈజీగా అనిపిస్తోంది. చేసేస్తాను. బాగుందండి.

లత

థాంక్యూ జయగారు,
అవును ఈజీగా చేసెయ్యొచ్చు.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP