Wednesday, January 4, 2012

వెజ్ మసాలా రైస్

ఈ రైస్ ఐటం అన్ని ఫ్లేవర్స్ తో బిర్యానీ లాగానే ఉంటుంది.చాలా ఈజీగా 

చేసెయ్యొచ్చు.లంచ్ బాక్స్ లోకి కూడా బావుంటుంది. 







కావలసిన పదార్ధాలు:


అన్నం                          రెండు కప్పులు 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     రెండు 

కరివేపాకు                      ఒక రెమ్మ 

ఆలూ                           ఒకటి చిన్నది 

కారట్                            ఒకటి 

కాలీఫ్లవర్                       అర కప్పు (తరిగిన తురుము)

టమాటాలు                      రెండు 

పుదీనా,కొత్తిమీర               కొద్దిగా 

ఉప్పు,కారం,పసుపు,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాలాపొడి,నూనె.

తాలింపుకు షాజీర.లవంగాలు,చెక్క,అనాసపువ్వు 


తయారు చేసే విధానం:


రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి మసాల దినుసులు వేయాలి.

ఇవి వేగాక సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఆలూ,కాలీఫ్లవర్,కారట్ తురుము వేసి 

వేయించాలి.

ఇవి ఉడికిన తరువాత టమాటా ముక్కలు వేయాలి. తరిగిన పొదీనా,

కొత్తిమీర,పసుపు,కారం,అర టీ స్పూన్ అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా 

కలిపి వేగనివ్వాలి.

చివరగా అన్నం,తగినంత ఉప్పు,అర టీ స్పూన్ గరంమసాలాపొడి వేసి 

సన్నని సెగపై వేయించాలి.కొంచెం కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే 

మసాలా రైస్ రెడీ అయిపోతుంది 

ఇంకా ఇందులో ఉడికించిన బీన్స్,బటానీలు కూడా వేయొచ్చు.

టమాటా మిశ్రమం అంతా ఉడికిన తరువాత రెండు ఎగ్స్ బ్రేక్ చేసి 

వేసి పొడిపొడిగా వేగాక అప్పుడు అన్నం వేసి వేయించినా చాలా 

బావుంటుంది.






Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP