Showing posts with label ఎగ్స్. Show all posts
Showing posts with label ఎగ్స్. Show all posts

Tuesday, July 24, 2012

పనీర్ ఎగ్ కర్రీ

పనీర్,ఎగ్  రెండూ పిల్లలు ఇష్టంగా తినేవే.ఈ రెంటితో సింపుల్ గా 

అయిపోయే ఈ కూర అన్నంలోకి,చపాతీ లోకీ కూడా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు :




పనీర్                          100 గ్రాములు 

ఎగ్స్                            రెండు 

టమాటాలు                    రెండు 

ఉల్లిపాయ                     ఒకటి 

పచ్చిమిర్చి                   రెండు 

కరివేపాకు                    ఒక రెమ్మ 

కొత్తిమీర                      కొద్దిగా 

అల్లం తురుము             అర స్పూన్ 

వెల్లుల్లి                       రెండు రెబ్బలు 

ఉప్పు,కారం,పసుపు,నూనె,గరంమసాలా పొడి.

తాలింపుకు ఆవాలు,జీలకర్ర,శనగపప్పు,ఎండుమిర్చి.



తయారు చేసే విధానం:




పనీర్ ను పొడిపొడిగా చిదిమి ఉంచుకోవాలి.

నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి 

వేయించాలి.

ఇప్పుడు సన్నగా తురిమిన అల్లం,వెల్లుల్లి,కరివేపాకు వేసి వేగిన 

తరువాత టమాట ముక్కలు వేయాలి.

తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి టమాటా బాగా మెత్తగా అయ్యేదాకా 

ఉడికించాలి.

ఈలోగా మరొక పాన్ లో ఒక టీ స్పూన్ నూనెలో ఎగ్స్ బ్రేక్ చేసి వేసి 

పొడిగా వేయించాలి.

టమాట మెత్తగా ఉడికిన తరువాత పనీర్ ను,వేయించుకున్న ఎగ్స్ ను

 వేసి బాగా కలపాలి.

చివరగా గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి కలిపి కొంచెంసేపు వేయించి 

దింపెయ్యాలి.


ఇష్టం ఉంటే ఇందులో ఉడికించిన పచ్చిబటానీ లేదా కాప్సికం కూడా 

వేసుకోవచ్చు.


Share/Bookmark

Monday, July 11, 2011

పాలక్ - ఎగ్ ఫ్రై

ఎగ్ కర్రీ రెగ్యులర్ గా చేస్తుంటాము ఎవరమైనా.అందులోనే పాలకూర,

మెంతికూర ఇలాంటివి కలిపితే కొత్తరుచితో కూర బావుంటుంది.కొంచెం 

వెరైటీగా ఉంటుంది.ఆకుకూరలు ఎక్కువ వాడినట్టు ఉంటుంది.





కావలసిన పదార్ధాలు

ఎగ్స్                          మూడు

 
పాలకూర                   రెండు కట్టలు
 
ఉల్లిపాయ                   ఒకటి పెద్దది
 
మిర్చి                         రెండు
 
ఉప్పు,కారం                  తగినంత
 
పసుపు                      కొంచెం
 
నూనె                        రెండు టేబుల్ స్పూన్లు
 
గరంమసాల పొడి          అర టీ స్పూన్    

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి.కరివేపాకు 


తయారు చేసే విధానం:


 
నూనె వేడి చేసి తాలింపు వేయాలి.
 
సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి కరివేపాకు వేసి వేయించాలి.
 
ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూర వేసి చిటికెడు ఉప్పు వేసి నీరంతా 

పోయేవరకూ ఉడికించాలి.
 
పసుపు,కారం,తగినంత ఉప్పు వేసి కలిపి కొంచెం వేయించి, గుడ్లు 

కొట్టి ఇందులో వేయాలి.
 
కొంచెం ఉడికాక ఒకసారి కలిపి గరంమసాలాపొడి చల్లి  పొడిపొడిగా 

వేయించుకోవాలి.
 
ఈ కూర అన్నంలోకి,చపాతీ లోకి బావుంటుంది.ఇందులో పాలకూర 

బదులు మెంతికూర కూడా వేసి చెయ్యొచ్చు


Share/Bookmark

Sunday, June 5, 2011

ఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం

ఈజీగా చాలా త్వరగా అయిపోయే బ్రేక్ ఫాస్ట్ ఇది.నేనూ మొదటిసారి ట్రై 

చేశాను.చాలా నచ్చింది.సాస్ తో కూడా బావుంది కానీ, కొబ్బరిచట్నీతో 

అయితే ఇంకా బావుంటుంది అన్నారు ఇంట్లో.సో ఈసారి 

చట్నీతో ట్రై చేస్తాను.






కావలసిన  పదార్ధాలు:


బొంబాయిరవ్వ                           ఒక కప్ 

బియ్యంపిండి                             రెండు కప్పులు 

పెరుగు                                    ఒక కప్ 

ఉల్లిపాయ                                ఒకటి

మిర్చి                                    మూడు 

కారట్                                    ఒకటి 

టమాట                                 ఒకటి

కరివేపాకు                              ఒక రెమ్మ 

కొత్తిమీర                                 అర కప్పు 

అల్లం                                     చిన్న ముక్క 

ఎగ్స్                                      రెండు

ఉప్పు                                    తగినంత 

మిరియాలపొడి                       ఒక స్పూన్

వంటసోడా                              పావు స్పూన్   

నూనె 


తయారు చేసే విధానం:

ముందుగా రవ్వ,బియ్యంపిండి  ఒక బౌల్ లోకి తీసుకుని పెరుగు,ఉప్పు 

వంటసోడా వేసి తగినన్ని నీళ్ళతో జారుగా కలుపుకుని ఒక అరగంట 

నాననివ్వాలి.

ఉల్లి,మిర్చి,టమాట.అల్లం,కరివేపాకు,కొత్తిమీర అన్ని చాల సన్నగా 

తరిగి ఉంచుకోవాలి.కారట్ తురుముకోవాలి.

ఎగ్స్ ఒక బౌల్ లోకి బ్రేక్ చేసి ఉప్పు,మిరియాలపొడి వేసి బీట్ చెయ్యాలి.

నాన్ స్టిక్ తవా వేడి చేసి కొంచెం పిండిని దోశలాగ వేయాలి.వేశాక 

గరిటతో స్ప్రెడ్ చెయ్యడానికి రాదు.అందుకని తవాని గుండ్రంగా తిప్పితే 

కొంచెం స్ప్రెడ్ అవుతుంది.ఊతప్పం కనుక కొంచెం మందంగా ఉన్నా 

బాగానే ఉంటుంది.

ఇప్పుడు పైన తరిగిన ఉల్లి మిశ్రమాన్ని వేయాలి.చివరగా బీట్ చేసిన 

ఎగ్ కూడా వేసి నూనె వేయాలి.

కొంచెం ఉడికాక జాగ్రత్తగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి.

వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఊతప్పం.ఎగ్స్ తిననివారు

అది లేకుండా ఊతప్పంలా ట్రై చెయ్యొచ్చు.


 




Share/Bookmark

Sunday, March 27, 2011

సింపుల్ ఎగ్ టోస్ట్

చాలా త్వరగా చేయగల స్నాక్ ఇది స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఇస్తే

చాలా ఇష్టంగా తింటారు.ఎందుకోగానీ బ్రెడ్ ఆమ్లెట్ కంటే ఇది ఎక్కువగా 

ఇష్టపడతారు.







కావలసిన పదార్ధాలు :

బ్రెడ్                             నాలుగు స్లైసులు 

ఎగ్స్                             రెండు 

ఉల్లిపాయ                      ఒకటి 

మిర్చి                          రెండు 

కొత్తిమీర                       పావుకప్పు 

ఉప్పు,కారం                    తగినంత 

నెయ్యి                        రెండు స్పూన్లు 


కారట్ తురుము కానీ,తురిమిన చీజ్ కానీ,పనీర్ కానీ ఇష్టాన్ని బట్టి 

ఏదో ఒకటి కలుపుకోవచ్చు,నేను కొంచెం చీజ్ తురుము కలిపాను 


తయారు చేసే విధానం:

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,తగినంత ఉప్పు,కారం అన్నీ ఒక 

బౌల్ లో వేసి కలపాలి.

ఎగ్స్ బ్రేక్ చేసి ఇందులో వేసి కొంచెం బీట్ చెయ్యాలి.

చివరిగా కారట్,పనీర్,చీజ్ ఏదో ఒకటి తురుము వేసి కలపాలి.

ఇప్పుడు ఒకో బ్రెడ్ స్లైస్ నీ ఈ మిశ్రమంలో ముంచి రెండువైపులా పట్టించి

జాగ్రత్తగా పెనంపై పెట్టాలి 

కొంచెం నెయ్యివేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేవరకూ వేయించి 

టమాట కెచప్ తో ఇస్తే బావుంటుంది.


Share/Bookmark

Saturday, March 12, 2011

బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై

బాయిల్డ్ ఎగ్స్ తో చేసే ఈజీ కూర ఇది.ఉల్లిపాయలు,గుడ్లు ఉంటే చాలు 

ఈ కూర రెడీ అయిపోతుంది.అన్నంలోకి,చపాతీలోకి కూడా 

బావుంటుంది.




కావలసిన పదార్ధాలు:

ఎగ్స్                          రెండు

ఉల్లిపాయలు               రెండు పెద్దవి

మిర్చి                         రెండు  

అల్లంవెల్లుల్లి పేస్ట్           అర టీ స్పూన్

గరం మసాల పొడి          అర స్పూన్

ఉప్పు,కారం                   తగినంత

పసుపు                       కొంచెం 

నూనె                          మూడు టేబుల్ స్పూన్లు 

కొత్తిమీర                       కొంచెం

తాలింపుకు  శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి  


తయారు చేసే విధానం :


నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,మిర్చి,

కరివేపాకు వేసి సన్నని సెగపై వేయించాలి.

ఉల్లిపాయ బాగా వేగిన తరువాత అల్లంవెలుల్లి పేస్ట్,ఉప్పు,కారం,పసుపు,

ఉడికించిన గుడ్లు వేసి రెండు నిమిషాలు వేయించి గరంమసాల పొడి,

కొత్తిమీర చల్లాలి.

బాగా కలిపి మరో రెండు నిమిషాలు  ఉంచి దింపెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి 




          
 


Share/Bookmark

Friday, January 7, 2011

వెరైటీ ఎగ్ ఫ్రై

ఎగ్స్ తో కర్ర్రీ అనగానే సాధారణంగా పొరటు కానీ,బాయిల్డ్ ఎగ్ కూర 

కానీ చేస్తాము కదా.ఎప్పుడూ అదే కాకుండా ఇలా చేస్తే వెరైటీ గా 

ఉంటుంది.రైస్ లోకి అయినా చపాతి లోకి అయినా బావుంటుంది








కావలసిన పదార్ధాలు:  


ఎగ్స్                      మూడు 

ఉల్లిపాయ                ఒకటి 

టమాటాలు              రెండు పెద్దవి 

మిర్చి                    రెండు 

అల్లంవెల్లుల్లిముద్ద      అరస్పూను

గరంమసాలా పొడి      ఒక స్పూను 

కరివేపాకు                ఒక రెమ్మ 

కొత్తిమీర                  అర కప్పు 

ఉప్పు,కారం               తగినంత 

నూనె                      రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు  శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,జీలకర్ర.


తయారు చేసే విధానం:



ముందుగా ఎగ్స్ ఒక గిన్నెలో వేసి బాగా బీట్ చెయ్యాలి.తరువాత 

కొంచెం ఉప్పు,కారం వేసి ఇంకోసారి బీట్ చెయ్యాలి.

ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో వేసి ఆవిరి మీద ఉడికించి, చల్లారాక 

ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. 


నూనె వేడి చేసి తాలింపు వేసి ,కరివేపాకు ,సన్నగా తరిగిన ఉల్లి మిర్చి 

ముక్కలు వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు తరిగిన టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి.తరువాత ఉప్పు,

కారం,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద  వేసి బాగా వేయించాలి.


కూర దగ్గరవుతుండగా ఎగ్ పీసెస్ ని వేసి గరం మసాలా పొడి వేసి 

బాగా కలిపి ఒక నిమిషం తరువాత దించెయ్యాలి.


సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి వేడిగా వడ్డిస్తే  కమ్మని  ఎగ్ ఫ్రై  రెడీ.


ఎగ్స్ బీట్ చెయ్యడం,ఉడికించడం పని అనుకుంటే సింపుల్ గా ఆమ్లెట్ 

వేసి ఆ పీసెస్ తో ఈ కర్రీ చేసుకుంటే ఆమ్లెట్ కర్రీ సిద్దం.






 


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP