Thursday, June 30, 2011

టమాటా పెప్పర్ చికెన్

చికెన్ తో ఎన్ని రకాల వెరైటీలు అయినా ఈజీగా చేసెయ్యొచ్చు

టమాటా,మిరియాలపొడి  వేసి చేసే ఈ కర్రీ కొంచెం స్పైసీగా అన్నంలోకి

అయినా,చపాతీ లోకి అయినా బావుంటుంది.







కావలసిన పదార్దాలు :



చికెన్                              పావుకిలో

ఉల్లిపాయ                         ఒకటి

టమాటా                           ఒకటి 

మిర్చి                              రెండు

కరివేపాకు                         ఒక రెమ్మ

అల్లంవెల్లుల్లి ముద్ద              ఒక టీ స్పూన్
 
గరం మసాలా పొడి             ఒక టీ స్పూన్

కొత్తిమీర                             కొంచెం

మిరియాలపొడి                    రెండు టీ స్పూన్స్ 

పసుపు                             కొంచెం

ఉప్పు,కారం                        తగినంత

నూనె                              రెండు టేబుల్ స్పూన్స్


తయారు చేసే విధానం:


నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు,మిర్చి,కరివేపాకు

వేసి దోరగా వేయించాలి.

అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటా ముక్కలు వేసి

వేయించాలి.

ఇప్పుడు చికెన్ వేసి కలిపి మూతపెట్టి సన్నని సెగపై ఉడికించాలి.కొంచెం

ఉడికిన తరువాత పసుపు,కారం,ఉప్పు,వేసి కొంచెం నీరు పోయాలి.

చికెన్ మెత్తగా ఉడికిన తరువాత గరంమసాల పొడి,మిరియాలపొడి,

కొత్తిమీర వేసి కలిపి బాగా ఫ్రై చెయ్యాలి.ఒక బౌల్ లోకి తీసుకుని

కొత్తిమీర చల్లి ఉల్లి చక్రాలతో అలంకరించుకోవాలి.


Share/Bookmark

Tuesday, June 28, 2011

చోలే - బ్రెడ్ ఛాట్

ఛాట్ ఐటమ్స్ ఏవైనా సరే అందరం ఇష్టంగా తింటాము.చోలే, బ్రెడ్ 

కలిపి చేసే ఈ ఛాట్ వెరైటీగా బావుంటుంది.






కావలసిన పదార్ధాలు:


చోలే                                    రెండు కప్పులు 

బ్రెడ్                                    నాలుగు స్లైసులు 

ఉల్లిపాయలు                           రెండు 

మిర్చి                                  మూడు

ఆలూ                                  రెండు 

టమాట                                రెండు 

అల్లంవెల్లుల్లి ముద్ద                   ఒక టీ స్పూన్ 

చోలే మసాల                         ఒక టేబుల్ స్పూన్ 

కొత్తిమీర                              ఒక కట్ట 

ఉప్పు,కారం                          తగినంత 

పసుపు                              కొంచెం

సన్నకారప్పూస                     కొద్దిగా 

నూనె                                రెండు టేబుల్ స్పూన్స్

ఛాట్ మసాల                        అర టీ స్పూన్ 

 నిమ్మరసం                          ఒక టీ స్పూన్

జీలకర్ర                                పావు స్పూన్ 

కరివేపాకు                           ఒక రెమ్మ


తయారు చేసే విధానం:


శనగలను  నానబెట్టుకోవాలి.

నూనె వేడిచేసి జీలకర్ర,కరివేపాకు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి 

దోరగా వేయించాలి .

ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి,ఆలూ ముక్కలు,శనగలు 

వేసి కలపాలి.

రెండు నిముషాలు వేయించి,ఉప్పు,కారం,పసుపు,వేసి కలిపి టమాట 

ముక్కలు కూడా వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి పాన్ మూత పెట్టెయ్యాలి.

ఆరేడు విజిల్స్ రానిస్తే శనగలు మెత్తగా ఉడుకుతాయి,

స్టీం పోయిన తరువాత తీసి చోలే మసాల ,కొత్తిమీర  వేసి  కూర 

చిక్కబడేదాక  ఉడికించుకోవాలి.

ఈలోగా బ్రెడ్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో వేయించి 

తీసుకోవాలి.లేదా నెయ్యి,వెన్న వేసి తవాపై కూడా టోస్ట్ చేసుకోవచ్చు

కానీ క్రిస్ప్ గా ఉండాలి.

ఇప్పుడు బ్రెడ్ ముక్కలు ఒక ప్లేట్లో పెట్టి పైన చోలే కూర వేయాలి.కొన్ని 

బ్రెడ్ ముక్కలు  పైన కూడా వేయాలి.

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,కొంచెం ఛాట్ మసాల చల్లి,

నిమ్మరసం వేసి పైన సన్న కారప్పూసతో అలంకరిస్తే నోరూరించే ఛాట్ 

రెడీ అవుతుంది.


Share/Bookmark

Friday, June 24, 2011

దోసకాయ - టమాటా పచ్చడి

దోసకాయ పచ్చడి అనగానే ముక్కలపచ్చడే ఎక్కువ గుర్తొస్తుంది.

అలా కాకుండా టమాటా,కొత్తిమీర వేసి చేసే ఈ పచ్చడి అన్నంలోకి,

టిఫిన్స్ లోకి కూడా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:

దోసకాయ                          ఒకటి 

టమాటాలు                         రెండు

పచ్చిమిర్చి                         ఆరేడు 

కొత్తిమీర                           అరకప్పు 

చింతపండు                       కొంచెం

వెల్లుల్లి రెబ్బలు                   నాలుగు 

జీలకర్ర                           అర స్పూన్ 

ఉప్పు                              తగినంత 

నూనె                            మూడు టేబుల్ స్పూన్స్ 

తాలింపుకు  శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు 


తయారు చేసే విధానం:

దోసకాయ గింజలు తీసేసి సన్నని ముక్కలుగా తరిగి, టమాటాలు,

మిర్చి,కొత్తిమీరతో కలిపి నూనె వేసి సన్నని సెగపై నీరంతా ఇగిరిపోయే

వరకు వేయించాలి.బాగా దగ్గరయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

చల్లారిన తరువాత మిర్చి,జీలకర్ర, వెల్లుల్లి,చింతపండు ఉప్పు వేసి గ్రైండ్ 

చెయ్యాలి.

తరువాత దోసకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి.

నూనె వేడి చేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. 

పచ్చడి ఇంకా స్పైసీగా కావాలంటే మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు.        
 


Share/Bookmark

Monday, June 20, 2011

చక్రపొంగలి

తియ్యగా కమ్మగా నేతితో ఘుమఘుమలాడిపోయే చక్రపొంగలి అంటే 

అందరికీ ఇష్టమే.సంసారంఒకచదరంగం సినిమాలో గొల్లపూడి అంటారు 

అసలు చక్రపొంగలి అంటే నెయ్యి టప్పూటప్పూమని కారాలి అప్పుడే 

రుచి అని.ఆరోగ్యరీత్యా ఆ లెవెల్లో కాకపోయినా,కాస్త ఎక్కువ వేస్తేనే 

కమ్మని రుచి వస్తుంది .







కావలసిన పదార్ధాలు:

బియ్యం                         ఒక కప్ 

పెసరపప్పు                     అర కప్ 

పాలు                           ఒకటిన్నర కప్ 

నీళ్ళు                           ఒకటిన్నర కప్ 

బెల్లం                            రెండు కప్పులు 

పంచదార                       ఒక కప్ 

నెయ్యి                           తగినంత 

కాజూ,కిస్మిస్,బాదాం,ఎండుకొబ్బరి ముక్కలు


తయారు చేసే విధానం:

ముందుగా పెసరపప్పును దోరగా వేయించుకోవాలి.

బియ్యం,పెసరపప్పు కడిగి పాలు,నీళ్ళు పోసి కుక్కర్లో వండుకోవాలి.

కొంచెం నెయ్యి వేడిచేసి కాజూ,కిస్మిస్,ఎండుకొబ్బరి ముక్కలు వేయించి 

తీసుకోవాలి. 

ఇప్పుడు ఉడికిన అన్నంలో తరిగిన బెల్లం,పంచదార వేసి బాగా కలిపి ,

అంతా కరిగి పాకం వచ్చేవరకూ ఉడికించుకోవాలి. 

కొంచెం చిక్కబడుతుండగా నెయ్యి పోసి కలుపుతూ దగ్గరయ్యాక స్టవ్ 

ఆఫ్ చెయ్యాలి.

వేయించిన కాజూ,కిస్మిస్ ఎండుకొబ్బరి ముక్కలు కలిపితే కమ్మని 

చక్రపొంగలి రెడీ అవుతుంది.


Share/Bookmark

Friday, June 17, 2011

కాబేజ్ - ఎగ్ ఫ్రై

కాబేజ్ ఆరోగ్యానికి మంచిది.కానీ అంతగా నచ్చదు ఎవరికీ.అందుకే 

రకరకాల వెరైటీలు చెయ్యడం తప్పనిసరి.వాటిలో చాలా ఇష్టంగా తినే 

ఐటం ఎగ్స్ తో కలిపి చేసే ఈ ఫ్రై.అన్నంలోకి,చపాతిలోకి కూడా ఇది 

బావుంటుంది





కావలసిన పదార్ధాలు:


కాబేజ్                                       పావుకిలో 

ఎగ్స్                                         రెండు 

ఉల్లిపాయ                                   ఒకటి

మిర్చి                                       మూడు 

అల్లంవెల్లుల్లి ముద్ద                      ఒక టీస్పూన్

గరంమసాల పొడి                        ఒక టీ స్పూన్ 

ఉప్పు,కారం                                తగినంత 

పసుపు                                    చిటికెడు 

నూనె                                       రెండు టేబుల్ స్పూన్లు

కొత్తిమీర                                    కొంచెం 

కరివేపాకు                                 ఒక రెమ్మ 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి


తయారు చేసే విధానం;


కాబేజ్ ను సన్నగా తరిగి కుక్కర్ లో వేసి ఒక విజిల్ రానివ్వాలి.ఇంకా 

ఎక్కువ విజిల్స్ రానిస్తే మెత్తగా అయిపోయి కూర బావుండదు. 

నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు 

వేసి దోరగా వేయించాలి.

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి పచ్చివాసన పోయాక కాబేజ్ వేసి 

ఉప్పు,పసుపు వేసి నీరు ఇగిరిపోయేవరకు బాగా వేయించాలి.

ఇప్పుడు కారం వేసి కలిపి దగ్గరయ్యాక,ఎగ్స్ బ్రేక్ చేసి వేయాలి,

ఒకసారి కలిపి సిమ్ లో ఉంచి ఉడకనివ్వాలి.ఎగ్స్ ఉడికాక గరం

మసాలపొడి,కొత్తిమీర వేసి కలిపి కొంచెం వేగాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లాలి.



Share/Bookmark

Wednesday, June 15, 2011

అల్లం పచ్చడి

తీయతీయగా,కారం కారంగా ఉండే అల్లం పచ్చడి ఇడ్లీ, దోశ లాంటి 

టిఫిన్స్ లోకి బావుంటుంది.వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ 

పచ్చడితో వడియాలు కాంబినేషన్ ఉంటే చాలు. 








కావలసిన పదార్ధాలు:


అల్లం                          యాభై గ్రాములు 

కారం                          యాభై గ్రాములు 

చింతపండు                    వంద గ్రాములు 

బెల్లం                          యాభై గ్రాములు 

పంచదార                      యాభై గ్రాములు 

వెల్లుల్లి                         ఒక పాయ 

మెంతులు                    ఒక టీ స్పూన్ 

ఎండుకొబ్బరి                 రెండు టేబుల్ స్పూన్లు 

గసగసాలు                    రెండు టేబుల్ స్పూన్లు

ఉప్పు                            తగినంత 

నూనె 

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు

వెల్లుల్లి రెబ్బలు 


తయారు చేసే విధానం :


ముందుగా అల్లం చెక్కుతీసి కడిగి తుడిచి ముక్కలు కోసి ఆరబెట్టాలి.

శుభ్రం చేసిన చింతపండులో  కొంచెం నీరుపోసి ఉడికించాలి.

మెంతులు దోరగా వేయించి ఉంచాలి.

రెండు స్పూన్లు నూనె వేడి చేసి గసగసాలు,ఎండుకొబ్బరి ముక్కలు 

దోరగా వేయించి తీయాలి.

ఇంకో స్పూన్ నూనె వేడిచేసి ఆరిన అల్లం ముక్కలు కూడా దోరగా 

వేయించాలి. 

మెంతులు,గసగసాలు,ఎండుకొబ్బరి,వెల్లుల్లిరెబ్బలు,అన్నీమెత్తగా 

గ్రైండ్ చేయాలి.ఇందులోనే వేయించిన అల్లం ముక్కలు కూడా వేసి 

మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

ఇప్పుడు ఉడికించిన చింతపండు వేసి రుబ్బి, కారం,ఉప్పు కూడా వేసి 

రుబ్బుకోవాలి.

చివరగా తరిగిన బెల్లం ,పంచదార వేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది.

పచ్చడి కొంచెం పలచగా కావాలి అంటే కొంచెం వేడినీళ్ళు పోయొచ్చు.

ఇప్పుడు నూనె వేడి చేసి తాలింపు వేసి కలిపితే ఘుమఘుమలాడుతూ 

అల్లం పచ్చడి నోరూరిస్తుంది.

మొత్తం తాలింపు పెట్టకుండా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు 

కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. 


                        




Share/Bookmark

Saturday, June 11, 2011

స్వీట్ కార్న్ పకోడా

చల్లచల్లగా తొలకరి చినుకులు పడుతుంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది.

ఎపుడూ వేసే పకోడీలే వెరైటీగా చేస్తే బావుంటుంది.స్వీట్ కార్న్ తో చేస్తే 

కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్ ఫ్లేవర్ తో డిఫెరెంట్ గా ఉంటాయి.







కావలసిన  పదార్ధాలు :


స్వీట్ కార్న్                               ఒక కప్ 

శనగపిండి                                 రెండు కప్పులు 

బియ్యం పిండి                            ఒక కప్ 

ఉల్లిపాయ                                  రెండు 

పచ్చిమిర్చి                               అయిదు 

అల్లం                                      చిన్నముక్క 

కరివేపాకు                                ఒక రెమ్మ

కొత్తిమీర                                  ఒక కట్ట 

వంట సోడా                              పావు స్పూన్ 

ఉప్పు                                     తగినంత 

నూనె 


తయారు చేసే విధానం :


స్వీట్ కార్న్ లో కొంచెం నీరు పోసి మైక్రోవేవ్ లో రెండునిముషాలు 

పెడితే ఉడికిపోతాయి

ఒక బౌల్ లోశనగపిండి,బియ్యంపిండి,ఉప్పు,వంటసోడా వేసుకోవాలి.

ఇందులో వాలికలుగా తరిగిన ఉల్లిపాయలు,సన్నగా తరిగిన మిర్చి,

అల్లం,కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.అల్లం మిర్చి 

ముద్దగా నూరి అయినా వేసుకోవచ్చు

చివరిగా ఉడికించిన కార్న్ ను వేసి తగినన్ని నీళ్ళతో పకోడీల పిండిలా 

కలుపుకోవాలి.

నూనె కాగాక పకోడీలు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకూ వేయించి 

తీసుకోవాలి .

టమాటా సాస్ తో వేడిగా సర్వ్ చేస్తే క్రిస్పీగా కార్న్ పకోడా రుచిగా 

ఉంటాయి.





Share/Bookmark

Wednesday, June 8, 2011

మసాలా పోహా

అటుకులతో వంట అనగానే ఉప్మా,పులిహోర ఎక్కవగా చేస్తుంటాము. 

కొంచెం వెరైటీగా పులావ్ లాగా కూరగాయముక్కలు,మసాలా వేసి చేస్తే 

చాలా రుచిగా ఉంటుంది.సాయంత్రం పూట అయినా,రాత్రిపూట టిఫిన్ 

లాగా చేసుకున్నా కూడా ఓకే. త్వరగా అయిపోతుంది  





కావలసిన పదార్ధాలు :

అటుకులు                          రెండు కప్పులు 

ఉల్లిపాయ                           ఒకటి 

మిర్చి                               మూడు 

ఆలూ                               ఒకటి 

కారట్                               ఒకటి 

టమాటా                           ఒకటి 

అల్లంవెల్లుల్లి ముద్ద                 అర స్పూన్ 

గరం మసాల పొడి                  అర స్పూన్ 

కరివేపాకు                            ఒక రెమ్మ 

కొత్తిమీర                              అర కట్ట 

పల్లీలు ,జీడిపప్పు                   కొంచెం

నూనె,ఉప్పు                        తగినంత 

పసుపు                              చిటికెడు

నిమ్మకాయ                        ఒకటి   

తాలింపుకు శనగపప్పు,ఆవాలు ,జీలకర్ర,ఎండుమిర్చి  

తయారు చేసే విధానం :

ముందుగా అటుకులు  కడిగి నీరు వంపేసి పెట్టుకోవాలి 

నూనె వేడిచేసి తాలింపు వేసి జీడిపప్పు,కరివేపాకు కూడా వేసి దోరగా 

వేయించాలి.

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,ఆలూ.కారట్ తురుము  వేసి వేయించాలి.

ఆలూ ఉడికిన తరువాత తరిగిన టమాట వేసి మగ్గనివ్వాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లిముద్ద ,పసుపు,గరంమసాలపొడి వేసి బాగా కలిపి 

మెత్తబడ్డ అటుకులను,తగినంత ఉప్పు కలిపి రెండునిమిషాలు సన్నని 

సెగపై ఉంచాలి .

చివరిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి దించెయ్యాలి.నిమ్మరసం పిండి ఒక

బౌల్ లోకి తీసుకుని వేయించిన పల్లీలు,జీడిపప్పుతో అలంకరించి వేడిగా 

సర్వ్ చయ్యాలి.

ఇష్టం ఉంటే ఇందులో ఇంకా కాప్సికం,బీన్స్,బటానీ  ఇవి కూడా 

వేసుకోవచ్చు.


Share/Bookmark

Sunday, June 5, 2011

ఇన్ స్టెంట్ ఎగ్ ఊతప్పం

ఈజీగా చాలా త్వరగా అయిపోయే బ్రేక్ ఫాస్ట్ ఇది.నేనూ మొదటిసారి ట్రై 

చేశాను.చాలా నచ్చింది.సాస్ తో కూడా బావుంది కానీ, కొబ్బరిచట్నీతో 

అయితే ఇంకా బావుంటుంది అన్నారు ఇంట్లో.సో ఈసారి 

చట్నీతో ట్రై చేస్తాను.






కావలసిన  పదార్ధాలు:


బొంబాయిరవ్వ                           ఒక కప్ 

బియ్యంపిండి                             రెండు కప్పులు 

పెరుగు                                    ఒక కప్ 

ఉల్లిపాయ                                ఒకటి

మిర్చి                                    మూడు 

కారట్                                    ఒకటి 

టమాట                                 ఒకటి

కరివేపాకు                              ఒక రెమ్మ 

కొత్తిమీర                                 అర కప్పు 

అల్లం                                     చిన్న ముక్క 

ఎగ్స్                                      రెండు

ఉప్పు                                    తగినంత 

మిరియాలపొడి                       ఒక స్పూన్

వంటసోడా                              పావు స్పూన్   

నూనె 


తయారు చేసే విధానం:

ముందుగా రవ్వ,బియ్యంపిండి  ఒక బౌల్ లోకి తీసుకుని పెరుగు,ఉప్పు 

వంటసోడా వేసి తగినన్ని నీళ్ళతో జారుగా కలుపుకుని ఒక అరగంట 

నాననివ్వాలి.

ఉల్లి,మిర్చి,టమాట.అల్లం,కరివేపాకు,కొత్తిమీర అన్ని చాల సన్నగా 

తరిగి ఉంచుకోవాలి.కారట్ తురుముకోవాలి.

ఎగ్స్ ఒక బౌల్ లోకి బ్రేక్ చేసి ఉప్పు,మిరియాలపొడి వేసి బీట్ చెయ్యాలి.

నాన్ స్టిక్ తవా వేడి చేసి కొంచెం పిండిని దోశలాగ వేయాలి.వేశాక 

గరిటతో స్ప్రెడ్ చెయ్యడానికి రాదు.అందుకని తవాని గుండ్రంగా తిప్పితే 

కొంచెం స్ప్రెడ్ అవుతుంది.ఊతప్పం కనుక కొంచెం మందంగా ఉన్నా 

బాగానే ఉంటుంది.

ఇప్పుడు పైన తరిగిన ఉల్లి మిశ్రమాన్ని వేయాలి.చివరగా బీట్ చేసిన 

ఎగ్ కూడా వేసి నూనె వేయాలి.

కొంచెం ఉడికాక జాగ్రత్తగా తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి.

వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ ఊతప్పం.ఎగ్స్ తిననివారు

అది లేకుండా ఊతప్పంలా ట్రై చెయ్యొచ్చు.


 




Share/Bookmark

Friday, June 3, 2011

మాంగో,బనానా మిల్క్ షేక్

మామిడిపండు,అరటిపండు,తేనె కలిపి చేసే ఈ మిల్క్ షేక్ చాలా 

రుచిగా ఉంటుంది.ఇందులో బంగినపల్లి ముక్కలు కానీ,లేదా మామిడి

రసం కానీ వాడొచ్చు .






కావలసిన పదార్ధాలు:


మామిడిముక్కలు                 ఒక కప్పు 

అరటిపండు                          ఒకటి

పాలు                               ఒక గ్లాస్ 

తేనె                                 రెండు స్పూన్స్ 

పంచదార                         రెండు టీ స్పూన్స్ 


తయారు చేసే విధానం:

ముందుగా మామిడిముక్కలు,అరటిపండు,పంచదార వేసి మెత్తగా 

గ్రైండ్ చేసుకోవాలి.

ఇందులో తేనె,పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి.

గ్లాస్ లో పోసి పైన మామిడిముక్కలు వేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా 

తాగుతారు.

పంచదార ఎవరి రుచికి తగ్గట్టు వారు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP