Friday, May 4, 2012

చింతచిగురు కొబ్బరి పచ్చడి

ఈ సీజన్ లో చింతచిగురు బాగా వస్తుంది.పప్పులో వేసినా,నాన్ వెజ్ తో 

కలిపి వండినా,పచ్చడి చేసినా ఎలా అయినా అంతా ఇష్టపడతారు.

పచ్చికొబ్బరితో చింతచిగురు కలిపి చేసే ఈ పచ్చడి అన్నంలోకి 

బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


చింతచిగురు                   125 గ్రాములు
 
కొబ్బరి తురుము              ఒక కాయ
 
ఎండుమిర్చి                     పదిహేను
 
వెల్లుల్లి రెబ్బలు                  ఎనిమిది
 
జీలకర్ర                           ఒక టీ స్పూన్
 
కరివేపాకు                       రెండు రెమ్మలు
 
ఉప్పు,నూనె

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి


తయారు చేసే విధానం:


చింతచిగురు శుభ్రం చేసి కడగాలి
 
ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చి దోరగా వేయించి 

తీసుకోవాలి
 
మరో రెండు స్పూన్లు నూనె వేసి చింతచిగురు వేసి వేయించాలి.మగ్గిన 

తరువాత కొబ్బరి తురుము కూడా వేసి రెండు నిముషాలు వేయించాలి.
 
ఎండుమిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 
ఇప్పుడు వేగిన చింతచిగురు,కొబ్బరి మిశ్రమం వేసి గ్రైండ్ చేసుకోవాలి.
 
రెండు టీ స్పూన్స్  నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి.

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి తింటే చాలా రుచిగా 

ఉంటుంది.
 
ఎవరి టేస్ట్ కి తగ్గట్టు ఎండుమిర్చి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.




Share/Bookmark

1 comments:

ఇందు

enta baagundoooooo!!! naku ikkada chintachiguru dorakadu :(((((

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP