Tuesday, May 8, 2012

సపోటా మిల్క్ షేక్

సీజనల్ గా వచ్చే పాల సపోటాలు చాలా రుచిగా ఉంటాయి.వాటిని 

ఇష్టంగా తినని  పిల్లలూ ఉంటారు.వాళ్లకి ఇలా క్రీమీగా,చిక్కగా మిల్క్ 

షేక్  చేసి ఇస్తే సరిపోతుంది.








కావలసిన పదార్ధాలు:




సపోటాలు                          రెండు

 
చల్లని పాలు                       ఒక కప్పు
 
వెనీలా ఐస్ క్రీం                   ఒక స్కూప్
 
పంచదార,తేనె



తయారు చేసే విధానం:



సపోటాలు గింజలు తీసి చిన్న ముక్కలు చేసి పాలతో కలిపి మెత్తగా 

గ్రైండ్ చెయ్యాలి.
 
ఒక టేబుల్ స్పూన్ పంచదార కానీ,తేనె కానీ వెయ్యాలి.
 
చివరగా ఐస్ క్రీం వేసి ఒక్కసారి బ్లెండ్ చేస్తే  కమ్మని మిల్క్ షేక్ రెడీ 

అవుతుంది


Share/Bookmark

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni

లత గారు..ఈ వంటలు సందడి చూస్తుంటే...మీ ఇంటి ప్రక్కనే ఇల్లు తీసుకుంటే బాగుండును అనిపిస్తుంది.
ఎమ్ చేయను చెప్పండి? జిహ్వ కో రుచి అన్నారు. మీరేమో అన్నీ చేసి ఊరిన్చేస్తారు. ఎక్కడ టెంప్ట్ అవకుండా ఉండగలం!? ఏ వూరు ఏ వాడ చెప్పండి. ఉన్న పళంగా వచ్చేస్తాను. రోజు వంట చేసి బోర్ కొడుతుంది.

లత

స్వాగతం వనజగారూ.వెంటనే హైదరాబాద్ వచ్చెయ్యండి మరి..
రోజూ వంట చెయ్యడం బోర్ అంటారా,కానీ తప్పదు కద అందుకే ఈ సింపుల్ వెరైటీస్
మీ అభిమానానికి థాంక్స్ అండి, థాంక్యూ వెరీ మచ్

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP