రాజ్ మా - పనీర్ గ్రేవీ
పూరీ,చపాతీ వీటిలోకి వెరైటీగా ఉండే కూరలు బావుంటాయి.తక్కువ
ఆయిల్ తో చేసుకోగల ఈ కర్రీ ఆరోగ్యానికి కూడా మంచిది.రాజ్మా ను
ఉడికించి రెడీగా ఉంచుకుంటే పదినిమిషాల్లో అయిపోతుంది.
కావలసిన పదార్ధాలు:
రాజ్ మా ఒక కప్పు
పనీర్ ఒక కప్పు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
టమాటాలు మూడు
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర కొద్దిగా
మీగడ రెండు స్పూన్స్
అల్లం,వెల్లుల్లి ఒక టీ స్పూన్
గరంమసాలాపొడి ఒక టీ స్పూన్
ఉప్పు,కారం,పసుపు,నూనె,తాలింపు దినుసులు
తయారు చేసే విధానం:
రాజ్ మాను నానబెట్టి ఉడికించాలి.
రెండు టీస్పూన్స్ నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన
ఉల్లి,మిర్చి ముక్కలు,కరివేపాకు వేసి వేయించాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం,వెల్లుల్లి తురుము వేసి వేగనివ్వాలి.
టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి.
పసుపు,కారం,తగినంత ఉప్పు వేసి కలిపి రాజ్ మా,పనీర్ ముక్కలు
కూడా వేసి కలిపి కొద్దిగా నీరు పోసి ఉడికించాలి,
గ్రేవీ చిక్కగా అయ్యాక గరంమసాలాపొడి చల్లి ,మీగడ కూడా వేసి
కలపాలి.
చివరగా తరిగిన కొత్తిమీర చల్లి వేడివేడిగా చపాతీలతో తింటే చాలా
రుచిగా ఉంటుంది.

1 comments:
చాలా బాగుంటుంది
Post a Comment