Saturday, October 13, 2012

మెంతికూర - టమాటా పచ్చడి

కమ్మని సువాసనతో ఉండే మెంతికూరతో చేసే ఈ పచ్చడి అన్నం 

లోకీ,ఇడ్లీ,దోశ లోకి కూడా బావుంటుంది.ఇందులో తీపి ఇష్టం లేని 

వారు బెల్లం వేయకుండా చేసుకోవచ్చు.









కావలసిన పదార్ధాలు:


మెంతి కూర                          మూడు కట్టలు 

టమాటాలు                           రెండు 

ఎండుమిర్చి                          నాలుగైదు 

కరివేపాకు                            ఒక రెమ్మ 

వెల్లుల్లి రెబ్బలు                       నాలుగు 

జీలకర్ర                                ఒక టీ స్పూన్ 

శనగపప్పు                           ఒక టీ స్పూన్ 

చింతపండు                           కొద్దిగా 

బెల్లం                                 ఒక టీ స్పూన్ 

ఉప్పు,నూనె,తాలింపు దినుసులు 



తయారు చేసే విధానం:



మెంతికూర ఆకులు మాత్రం తీసి కడిగి పెట్టుకోవాలి.

ఒక స్పూన్ నూనె వేడి చేసి శనగపప్పు,జీలకర్ర,ఎండుమిర్చివెల్లుల్లి 

వేసి  దోరగా వేయించి తీయాలి.

మరొక స్పూన్ నూనె వేసి టమాటా ముక్కలు.మెంతి కూర వేసి 

వేయించాలి.

చల్లారిన తరువాత ఎండుమిర్చి మిశ్రమం,ఉప్పు,చింతపండు వేసి 

గ్రైండ్ చెయ్యాలి.

ఇప్పుడు టమాట,మెంతికూర,బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

అవసరం అయితే కొంచెం నీరు వాడొచ్చు.

ఒక స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడి అందులో వేసి 

కలపాలి. 


Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP