అరటికాయ కోఫ్తా
ఉడికించిన అరటికాయతో చేసిన కోఫ్తాలు ఇవి.ఇలాగే స్నాక్స్ లాగా
కానీ,అన్నంలో కలుపుకునీ, గ్రేవీలో వేసి చపాతీతో అయినా తినొచ్చు.
సాంబారు,రసం వీటితో తిన్నా బావుంటాయి.
కావలసిన పదార్ధాలు:
అరటికాయ ఒకటి
ఉల్లిపాయ ఒకటి
మిర్చి రెండు
అల్లం చిన్నముక్క
కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్స్
జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్
జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్
గరంమసాలాపొడి అర స్పూన్
పొదీనా,కొత్తిమీర కొంచెం
ఉప్పు,నూనె
తయారు చేసే విధానం:
అరటికాయ ఉడికించి తురుముకోవాలి.
ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,పొదీనా,కొత్తిమీర,కాజూ
ముక్కలు వేసి కలపాలి.
ముక్కలు వేసి కలపాలి.
తగినంత ఉప్పు,మసాలాపొడి,కార్న్ ఫ్లోర్ కూడా వేసి ముద్దచేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసి కాగిన నూనెలో వేయించి
తీసుకోవాలి.
స్నాక్స్ గా అయితే టమాటాసాస్ లేదా గ్రీన్ చట్నీ తో బావుంటాయి.

3 comments:
Super...bale simple items cheptaaru meru. Nachhesindi.will try sure
మరీ గ్రేవీ లొ కూడా అన్నారు. అది చెప్పలేదేంటండీ..బాగుంది వంట.నేను కూడా ప్రయత్నిస్తా..
శైలూ థాంక్యూ
సుభగారూ,ఇప్పుడు చెయ్యలేదు కదా అని రాయలేదు,
ఈ సారి చేసినప్పుడు రాస్తానండీ,
థాంక్యూ
Post a Comment