Saturday, December 10, 2011

ఓట్స్ దోశ

ఇన్ స్టంట్ గా ఐదునిముషాలు కేటాయించి పిండి కలిపేసుకుంటే 

చక్కగా ఈ ఓట్స్ దోసెలు వేసుకోవచ్చు.ఎక్కువసేపు నానితే రవ్వ

దోశలాగా పలుచగా బాగా వస్తాయి. 








కావలసిన పదార్ధాలు:


ఓట్స్                           రెండు కప్పులు 

బొంబాయి రవ్వ                ఒక కప్పు 

గోధుమపిండి                  ఒక కప్పు 

బియ్యం పిండి                 ఒక కప్పు 

ఉప్పు                            తగినంత 

నూనె 


తయారు చేసే విధానం;


ఓట్స్ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఇందులో మిగిలినవి అన్నీవేసి తగినంత ఉప్పు,నీళ్ళు కలిపి దోసెల 

పిండిలా కలుపుకోవాలి.

పెనం వేడిచేసి రవ్వదోశ వేసినట్టు పిండిని గరిటతో పోసెయ్యాలి. కొంచెం 

నూనెవేసి రెండువైపులా కాల్చాలి.

కావాలంటే ఉల్లి,మిర్చి,అల్లం అన్నీసన్నగా తరిగి కలుపుకోవచ్చు.

వేడిగా ఏదైనా చట్నీతో తింటే బావుంటాయి.


Share/Bookmark

4 comments:

జ్యోతిర్మయి

వంటలన్నీ భలేగా ఉన్నాయి. మీ ఇంటిపక్కన ఇల్లేదయినా ఖాళీగా ఉందండీ..ఏం లేదు మీకు రుచి చూసే శ్రమ తగ్గిద్దామని..

లత

థాంక్యూ జ్యోతిర్మయిగారూ,
వచ్చేస్తారా మరి రుచి చూడడానికి

lakshmisravya

hi latha garu....me blog na lanti modern ammayilaki chala help ayindadi....i mean ma entlo kanisam naku omlet kuda veyadam radu but me blog lo simple but very tasty vantalu naku help ayindi.....ma atta garu ayite naku pure ga vandatam vachemo anukuni chala murisipitunaru....meeku chala chala thanks....i mean it...

లత

శ్రావ్యగారూ,మీలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి,తరువాత మా పిల్లలకి, ఇలా నాకు తెలిసినవి కొందరికైనా ఉపయోగపడతాయి అనే ఈ బ్లాగ్ మొదలుపెట్టాను.
మీ కామెంట్ చూశాక నిజంగా చాలా ఆనందంగా ఉంది,
థాంక్యూ వెరీమచ్

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP