Sunday, December 18, 2011

నేతిబీరకాయ పచ్చడి



కార్తీకమాసంలో తప్పనిసరిగా తినే ఈ నేతిబీర పచ్చడి చాలా ఫేమస్.

మామూలు బీరకాయలా కాకుండా ఈకాయ నున్నగా ఉంటుంది








కావలసిన పదార్ధాలు:


నేతిబీరకాయలు                       రెండు 

టమాటా                               ఒకటి

పచ్చిమిర్చి                           ఆరేడు 

వెల్లుల్లిరెబ్బలు                        నాలుగు 

ఉప్పు,చింతపండు,జీలకర్ర,నూనె 


తయారుచేసే పధ్ధతి :


బీరకాయలు చెక్కు తీసి ముక్కలు కోయాలి.

టమాటా,మిర్చి ఈ ముక్కలు కలిపి రెండు స్పూన్స్ నూనె వేసి బాగా 

దగ్గరయ్యేవరకు మగ్గనివ్వాలి.

చల్లారిన తరువాత ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి,చింతపండు, మిర్చి గైండ్ 

చేసుకుని,బీరకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి.

కావాలంటే కొంచెం కొత్తిమీర,కొంచెం పచ్చికొబ్బరి కూడా వేసుకోవచ్చు.
 


Share/Bookmark

4 comments:

శశి కళ

chaalaa manchi pachchadi gurtu chesaaru....rolu
undi danchukunte inkaa baaguntundemo...

Unknown

My favourite.
Thank you

మౌనముగా మనసుపాడినా

అబ్బా చూస్తుంటేనే నోరుఉరుతుంది ఇక ఆరగిస్తే ఎలా ఉంటుందో !!!

లత

శశిగారూ
రోటిలో చేస్తే పచ్చళ్ళు చాలా బావుంటాయండి,అది అది లేకపోవడంతో మిక్సీలో చెయ్యడం తప్పడంలేదు
శైలుగారు మా ఇంట్లో కూడా చాలా ఇస్టమండీ,ఇంటి దగ్గరనుండి కాయలు రాగానే పచ్చడి చేసేశాను
మౌనముగా మనసుపాడినా
రుచి కూడా బావుంటుందండీ

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP