Saturday, August 27, 2011

కాలీఫ్లవర్ బటానీ ఫ్రై

కాలీఫ్లవర్ ను దేనితో కలిపి వండినా రుచిగా ఉంటుంది.చాలా సన్నగా 

తురుములాగా తరిగి,పచ్చిబటానీ వేసి వండితే చాలా బావుంటుంది.

బటానీలను కొంచెం మెదిపి ఈ కూరతో పరోటాలు కూడా చేసుకోవచ్చు.




 



కావలసిన పదార్ధాలు:


కాలీఫ్లవర్                         ఒకటి చిన్నది 

పచ్చిబటానీ                      ఒక కప్పు 

ఉల్లిపాయ                         ఒకటి

మిర్చి                              రెండు

కరివేపాకు                         ఒక రెమ్మ 

అల్లంవెల్లుల్లి ముద్ద              ఒక స్పూన్ 

గరంమసాలా పొడి                ఒక స్పూన్

ఉప్పు,కారం                       తగినంత 

పసుపు                            కొంచెం 

నూనె                               రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు  శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 


తయారు చేసే విధానం :


నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి 

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి సన్నగా 

తరిగిన కాలీఫ్లవర్ తురుము,పచ్చిబటానీలు వేసి కొంచెం వేయించాలి.

ఇప్పుడు పసుపు,తగినంత ఉప్పు,కారం,వేసి కలిపి మూత పెట్టి సన్నని 

సెగపై మగ్గనివ్వాలి.నీరు అంతా ఇగిరిపోయాక గరంమసాల పొడి,

కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేయించి తీసేయ్యాలి.






     
 




Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP