కార్న్- పల్లీ పకోడా
మొక్కజొన్న పొత్తులతో చేసే మరో రుచికరమైన స్నాక్ ఇది.
వేయించిన పల్లీలు కూడా కలపడంతో క్రంచీగా బావుంటాయి.
కావలసిన పదార్ధాలు:
మొక్కజొన్న కండెలు రెండు
వేయించిన పల్లీలు ఒక కప్పు
ఉల్లిపాయ ఒకటి
మిర్చి నాలుగు
కొత్తిమీర అర కప్పు
అల్లం చిన్నముక్క
శనగపిండి కొద్దిగా
కరివేపాకు ఒక రెమ్మ
ఉప్పు,నూనె
తయారు చేసే విధానం:
మొక్కజొన్నలు వలుచుకోవాలి.వేయించిన పల్లీలు పొట్టు తీయాలి.
అల్లం,రెండు మిర్చి తగినంత ఉప్పు వేసి మొక్కజొన్నగింజలను మరీ
మెత్తగా కాకుండా కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కొత్తిమీర,కరివేపాకు
వేయాలి.బైండింగ్ కోసం శనగపిండి వేసి కలపాలి.
చివరిగా పల్లీలు కలిపి చిన్నచిన్న వడలు చేసి కాగిన నూనెలో ఎర్రగా
వేయించాలి.
వేడిగా టమాటా సాస్ తో తింటే చాలా బావుంటాయి

2 comments:
లతగారు..మీబ్లాగు చూసీ..నేను శనగల వడలు,కార్న్ పకోడా,కొబ్బరి లౌజు లడ్లు చేసానండీ :) మూడు ముచ్చటగా కుదిరాయి :)
చాలా సంతోషం ఇందూ, థాంక్యూ వెరీమచ్
Post a Comment