కారట్ రైస్
కారట్,నిమ్మరసం కలిపి చేసే ఈ రైస్ ఐటం లంచ్ బాక్స్ లోకి
బావుంటుంది.నిమ్మరసం వేయడంతో అచ్చం పులిహోర లానే
ఉంటుంది.
కావలసిన పదార్ధాలు:
అన్నం రెండు కప్పులు
కారట్ తురుము ఒక కప్పు
పచ్చిమిర్చి మూడు
అల్లం చిన్న ముక్క
కరివేపాకు ఒక రెమ్మ
నిమ్మకాయ ఒకటి
ఉప్పు,పసుపు,నూనె
తాలింపుకు
శనగపప్పు,మినప్పప్పు,ఎండుమిర్చి,ఆవాలు,పల్లీలు
తయారు చేసే విధానం ;
నూనె వేడిచేసి తాలింపు వేయాలి.
దోరగా వేగిన తరువాత సన్నగా తరిగిన అల్లం,మిర్చి,కరివేపాకు వేసి
వేయించాలి.
ఇప్పుడు కారట్ తురుము వేసి తడి లేకుండా బాగా వేయించాలి.
.
చివరగా అన్నం,తగినంత ఉప్పు,పసుపు వేసి కలిపి కొంచెం వేయించాలి
చల్లారిన తరువాత నిమ్మరసం వేసి కలిపితే కలర్ ఫుల్ గా ఉండే కారట్
రైస్ రెడీ అవుతుంది.

3 comments:
మీరు ఏమి చేసినా సూపరులెండి :) మీ బ్లాగు దయవల్ల నేను కొత్తకొత్త వంటలు తెగ చేస్తున్నా అని పేరు గడించా మా అత్తరింట్లో ;) కాని మేటర్ ఏంటి అంటే....మీ బ్లాగులో చూసి బాగా చేయగలుగుతున్నా కానీ నాకు సొంతగా మీలాగా ఐడియాలు రావెందుకబ్బా? అలాగే మళ్ళిమళ్ళి ఆ వంటలు చేయలన్నా మీ బ్లాగు చూడాల్సిందే! మళ్ళి చూడకపోతే సరిగ్గా రావేమో అని డౌట్! మీలాగా మంచిమంచిగా వంటలు సొంతంగా చేయాలంటే ఎలా? ఎమన్నా చిట్కాలు?
థాంక్స్ ఇందూ
ఎక్స్పీరియన్స్ వచ్చేకొద్దీ అన్నీ వచ్చేస్తాయి..డోంట్ వర్రీ.
మామూలు పులిహోర కంటే డిఫరెంట్ గా, చూడటానికి కలర్ ఫుల్ గా వుంది .
Post a Comment