చోలే మసాలా
రోటీ,చపాతీ,బటూరే ఇలా దేనిలోకైనా చోలే కర్రీ బావుంటుంది.చాలా
సింపుల్ గా చేసెయ్యొచ్చు కూడా.
కావలసిన పదార్ధాలు :
చోలే రెండు కప్పులు
ఉల్లిపాయలు రెండు
మిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర ఒక కట్ట
టమాటాలు రెండు
అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్
గరంమసాలా పొడి ఒక టీ స్పూన్
నూనె రెండు టేబుల్ స్పూన్స్
టీ బాగ్ ఒకటి
ఉప్పు ,కారం,పసుపు
లవంగాలు, చెక్క, యాలకులు, బిర్యానిఆకు, జీలకర్ర
తయారు చేసే పధ్ధతి :
శనగలను నానబెట్టుకోవాలి
నూనె వేడిచేసి నాలుగు లవంగాలు,చిన్న దాల్చినచెక్క, రెండు
యాలకులు, బిర్యానీ ఆకు వేయాలి.
సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,మిర్చి,కరివేపాకు వేసి దోరగా
వేయించాలి.
అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటాముక్కలు వేయాలి.
ఇప్పుడు పసుపు,కారం వేసి కలిపి చోలే కూడా వేసి కలపాలి.
తగినంత ఉప్పు,టీ బాగ్ వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి
ఏడెనిమిది విజిల్స్ రానివ్వాలి.
స్టీం పోయాక టీ బాగ్ తీసేసి గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి కొంచెం
వేడిగా చపాతీ తో వడ్డిస్తే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది.

6 comments:
eppatilaage chala baagundu lata garu :)
థాంక్స్ ఇందూ
bale bale vantakaalu gurtuchestunnaru....super
థాంక్యూ శశిగారు
ఓహో కలర్ రహస్యం టీ బ్యాగా...ఇప్పుడు తెలిసింది ..ఇకపై పాటిస్తా :))
కానీ మరి టీ రుచి రాదా కూరకి??
కొంచెం డిఫెరెంట్ టేస్ట్ తెలుస్తుంది సౌమ్య గారూ,అలా అని మరీ ఎక్కువ ఉండదు
థాంక్యూ
Post a Comment