పల్లీ - పుట్నాల పొడి
వేడివేడి అన్నంలో కారప్పొడీ,నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు.
పల్లీలు,పుట్నాలపప్పు, కలిపి చేసే ఈ పొడి కూడా చాలా రుచిగా
ఉంటుంది.అన్నంలోనే కాకుండా ఇడ్లీ,దోశ, ఉప్మాలతో కూడా ఈ
పొడి చాలా బావుంటుంది.
కావలసిన పదార్ధాలు :
వేయించిన పల్లీలు ఒక కప్పు
పుట్నాల పప్పు ఒక కప్పు
ఎండుకొబ్బరి ఒక కప్పు
ఎండుమిర్చి పది
జీలకర్ర ఒక టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు
ఉప్పు తగినంత
నూనె అర టీస్పూన్
తయారు చేసే పధ్ధతి :
పల్లీలు పొట్టు తీసుకోవాలి.
నూనె వేడిచేసి ఎండుమిర్చి వేయించుకోవాలి.
మిర్చి,సన్నగా తరిగిన ఎండుకొబ్బరి ముక్కలు,జీలకర్ర,వెల్లుల్లిరెబ్బలు,
ఉప్పు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
ఇప్పుడు పుట్నాలపప్పు వేసి గ్రైండ్ చేసి చివరగా పల్లీలు కూడా వేసి
గ్రైండ్ చేసుకుంటే రుచికరమైన పల్లీ పుట్నాలపొడి రెడీ అవుతుంది.
ఇదే పొడిని అచ్చంగా పల్లీలతోను,లేదా పుట్నాలతో చేసుకున్నా
బావుంటుంది.

4 comments:
ఈ పొడి నాకు బలే ఇష్టం చాల చాల బావుంటుంది.
నాకు కూడా చాలా ఇష్టం శైలుగారు
అబ్బా..నీళ్ళు ఊరుతున్నాయి మీ మాటలు చదివి...అర్జెంట్ గా చెయ్యాలి.
శశిగారూ, చేసేశారా మరి
Post a Comment