Saturday, March 12, 2011

బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై

బాయిల్డ్ ఎగ్స్ తో చేసే ఈజీ కూర ఇది.ఉల్లిపాయలు,గుడ్లు ఉంటే చాలు 

ఈ కూర రెడీ అయిపోతుంది.అన్నంలోకి,చపాతీలోకి కూడా 

బావుంటుంది.




కావలసిన పదార్ధాలు:

ఎగ్స్                          రెండు

ఉల్లిపాయలు               రెండు పెద్దవి

మిర్చి                         రెండు  

అల్లంవెల్లుల్లి పేస్ట్           అర టీ స్పూన్

గరం మసాల పొడి          అర స్పూన్

ఉప్పు,కారం                   తగినంత

పసుపు                       కొంచెం 

నూనె                          మూడు టేబుల్ స్పూన్లు 

కొత్తిమీర                       కొంచెం

తాలింపుకు  శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి  


తయారు చేసే విధానం :


నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,మిర్చి,

కరివేపాకు వేసి సన్నని సెగపై వేయించాలి.

ఉల్లిపాయ బాగా వేగిన తరువాత అల్లంవెలుల్లి పేస్ట్,ఉప్పు,కారం,పసుపు,

ఉడికించిన గుడ్లు వేసి రెండు నిమిషాలు వేయించి గరంమసాల పొడి,

కొత్తిమీర చల్లాలి.

బాగా కలిపి మరో రెండు నిమిషాలు  ఉంచి దింపెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి 




          
 


Share/Bookmark

2 comments:

జ్యోతి

లతగారు, నేను ఇప్పుడే ఈ కూర చేసి ఇలా వచ్చా. కాని నేను రెండు టమాటాలు కూడా వేసాను...

లత

అవును జ్యోతి గారూ.ఇస్టం ఉంటే టమాటాలు వేసుకోవచ్చు.
కానీ నేను ఎక్కువ ఇలాగే చేస్తాను వట్టి ఉల్లి గుజ్జుతో ఇదొక రుచి అని

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP