Sunday, March 27, 2011

సింపుల్ ఎగ్ టోస్ట్

చాలా త్వరగా చేయగల స్నాక్ ఇది స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఇస్తే

చాలా ఇష్టంగా తింటారు.ఎందుకోగానీ బ్రెడ్ ఆమ్లెట్ కంటే ఇది ఎక్కువగా 

ఇష్టపడతారు.







కావలసిన పదార్ధాలు :

బ్రెడ్                             నాలుగు స్లైసులు 

ఎగ్స్                             రెండు 

ఉల్లిపాయ                      ఒకటి 

మిర్చి                          రెండు 

కొత్తిమీర                       పావుకప్పు 

ఉప్పు,కారం                    తగినంత 

నెయ్యి                        రెండు స్పూన్లు 


కారట్ తురుము కానీ,తురిమిన చీజ్ కానీ,పనీర్ కానీ ఇష్టాన్ని బట్టి 

ఏదో ఒకటి కలుపుకోవచ్చు,నేను కొంచెం చీజ్ తురుము కలిపాను 


తయారు చేసే విధానం:

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,తగినంత ఉప్పు,కారం అన్నీ ఒక 

బౌల్ లో వేసి కలపాలి.

ఎగ్స్ బ్రేక్ చేసి ఇందులో వేసి కొంచెం బీట్ చెయ్యాలి.

చివరిగా కారట్,పనీర్,చీజ్ ఏదో ఒకటి తురుము వేసి కలపాలి.

ఇప్పుడు ఒకో బ్రెడ్ స్లైస్ నీ ఈ మిశ్రమంలో ముంచి రెండువైపులా పట్టించి

జాగ్రత్తగా పెనంపై పెట్టాలి 

కొంచెం నెయ్యివేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేవరకూ వేయించి 

టమాట కెచప్ తో ఇస్తే బావుంటుంది.


Share/Bookmark

4 comments:

కథాసాగర్

ఎగ్ టోస్ట్ ..
తిని చాల రోజులయ్యింది ..
ఈ టపా లో మళ్ళి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

లత

థాంక్యూ సాగర్ గారూ

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు

ఈ రోజు ట్రై చేశామండీ.నేను మా అబ్బాయి కలిసి మా ఆవిడకీ, పాపకి చేసి పెట్టాము.మా పాపకయితే తెగ నచ్చేసింది.నాక్కూడా నచ్చింది. ఉగాది నాడు నేను, పిల్లలు కలిసి మీ బ్రెడ్ కారట్ బాసుందీ చేసి పెడతామని మా ఆవిడకి ప్రామిస్ చేశాము.

లత

మీకు నచ్చినందుకు చాలా హాపీ క్రిష్ణ గారూ
థాంక్యూ వెరీమచ్

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP