చాకో నట్ లాలీపప్స్
చాక్లెట్,బిస్కట్స్,నట్స్ ఇలా అన్నీ ఇష్టమైనవి కలిపి వాటిని లాలీపప్స్
లా ఇస్తే పిల్లలు ఎంతో ఇష్టపడతారు పది నిమిషాల్లో చేసి వెరైటీగా
ఇవ్వొచ్చు.చెపితే తప్ప ఇందులో బిస్కట్స్ కలిపినట్టు తెలియదు
మారీ బిస్కట్స్ ఒక చిన్నపాకెట్
ఫైవ్ స్టార్ చాక్లెట్ ఒకటి 50 గ్రామ్స్
పంచదార రెండు టీ స్పూన్స్
నెయ్యి లేదా వెన్న రెండు టీ స్పూన్స్
క్రీం రెండు టీ స్పూన్స్
వెనీలా ఎసెన్స్ కొద్దిగా
కాజూ,బాదం,కిస్మిస్ అన్నీ కలిపి ఒక చిన్న కప్
తయారు చేసే విధానం:
మారీ బిస్కట్స్ ను పొడి చేసుకోవాలి
చాక్లెట్ ను ముక్కలు చేసి మెల్ట్ చేసుకోవాలి.ఇందులో నెయ్యి,క్రీం
వేసి కలపాలి.
పంచదారను పొడి చేసి బిస్కట్ పొడిలో వేయాలి.
కాజూ,బాదం ను కొన్నింటిని కోర్స్ గా గ్రైండ్ చేసి ,మరి కొన్నింటిని
సన్నగా తరిగి ఈ మిశ్రమంలో వేయాలి.కిస్మిస్ కూడా వేయాలి.
చివరగా ఎసెన్స్,కరిగిన చాక్లెట్ మిశ్రమం కూడా వేసి బాగా కలిపి చిన్న
చిన్న బాల్స్ చేయాలి.
ఈ బాల్స్ కి టూత్ పిక్స్ గుచ్చి ఇస్తే లాలీపప్స్ రెడీ.
ఒకవేళ బాల్స్ చెయ్యడానికి రాక పొడిపొడిగా ఉంటె ఒక స్పూన్ పాలు
చల్లుకుని చెయ్యొచ్చు.
కావాలంటే చాక్లెట్ ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు

2 comments:
Bhale undandi :) chocolates biscuits tho koodaa vanta cheyochani niroopincharu :)
థాంక్యూ ఇందూ
Post a Comment