Monday, March 7, 2011

పాలకూర పకోడీలు

అత్యంత సులభంగా,పదినిమిషాల్లో అయిపోయే స్నాక్స్ అంటే పకోడీలే.

అందరూ ఇష్టంగా తినేవి కూడా ఇవే.వీటికి అప్పుడప్పుడు ఆకుకూర 

జోడిస్తే రుచికి రుచి, పిల్లలకి వెరైటీ.అలా పాలకూరతో చేసిన ఈ 

పకోడీలు చాలా బావుంటాయి.






కావలసిన పదార్ధాలు :

పాలకూర                         మూడు కట్టలు 

ఉల్లిపాయ                         ఒకటి 

మిర్చి                               నాలుగు 

అల్లం                               చిన్న ముక్క 

కరివేపాకు                        ఒక రెమ్మ 

కొత్తిమీర                          ఒక చిన్నకట్ట 

శనగపిండి                       ఒక కప్పు 

వరిపిండి                         రెండు టేబుల్ స్పూన్లు 

ఉప్పు                               తగినంత 

వంటసోడా                       చిటికెడు 

నూనె , టమాటాసాస్ 

తయారుచేసే విధానం:

పాలకూర కడిగి సన్నగా తరిగి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఇందులోవాలికలుగా తరిగిన ఉల్లిపాయ,సన్నగా తరిగిన మిర్చి,అల్లం,

కొత్తిమీర,కరివేపాకు కలపాలి 

శనగపిండి,వరిపిండి,ఉప్పు,సోడా వేసి కొంచెం నీటితో ముద్దగా 

చేసుకుని నూనె కాగాక పకోడీలు వేసుకోవాలి.

వేగాక  టమాటాసాస్ తో వేడివేడిగా తింటే కరకరలాడే  కమ్మని 

పాలకూర  పకోడీలు  ఊరిస్తాయి.


Share/Bookmark

4 comments:

sneha

చాలా బాగుంటున్నాయి మీ వంటలు.చాలా ట్రై చేసాను బాగా వచ్చాయి

లత

థాంక్యూ స్నేహా

ఇందు

నాకు ఇవి తెలుసు :) భలే ఉంటాయ్! మీ బ్రెడ్ మంచురియా....కారెట్ బాసుంది కూడా ట్రై చేసా! భలే వచ్చాయ్! అసలు బ్రెడ్ మంచురియా ఐతె..కేక పుట్టించిందనుకోండీ! కానీ బ్రెడ్-కారెట్ బాసుందీలో కారెట్ వేయగానే పాలు విరిగిపోయాయి ఎలా మరి??

లత

అయ్యొ అలా విరగదు ఇందూ
నేను ముందు బ్రెడ్ క్రంబ్స్ వేసి తరువాత కారట్ తురుము వేసి చేశాను ఏమీ విరగలేదు మరి

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP