Wednesday, June 15, 2011

అల్లం పచ్చడి

తీయతీయగా,కారం కారంగా ఉండే అల్లం పచ్చడి ఇడ్లీ, దోశ లాంటి 

టిఫిన్స్ లోకి బావుంటుంది.వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ 

పచ్చడితో వడియాలు కాంబినేషన్ ఉంటే చాలు. 








కావలసిన పదార్ధాలు:


అల్లం                          యాభై గ్రాములు 

కారం                          యాభై గ్రాములు 

చింతపండు                    వంద గ్రాములు 

బెల్లం                          యాభై గ్రాములు 

పంచదార                      యాభై గ్రాములు 

వెల్లుల్లి                         ఒక పాయ 

మెంతులు                    ఒక టీ స్పూన్ 

ఎండుకొబ్బరి                 రెండు టేబుల్ స్పూన్లు 

గసగసాలు                    రెండు టేబుల్ స్పూన్లు

ఉప్పు                            తగినంత 

నూనె 

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు

వెల్లుల్లి రెబ్బలు 


తయారు చేసే విధానం :


ముందుగా అల్లం చెక్కుతీసి కడిగి తుడిచి ముక్కలు కోసి ఆరబెట్టాలి.

శుభ్రం చేసిన చింతపండులో  కొంచెం నీరుపోసి ఉడికించాలి.

మెంతులు దోరగా వేయించి ఉంచాలి.

రెండు స్పూన్లు నూనె వేడి చేసి గసగసాలు,ఎండుకొబ్బరి ముక్కలు 

దోరగా వేయించి తీయాలి.

ఇంకో స్పూన్ నూనె వేడిచేసి ఆరిన అల్లం ముక్కలు కూడా దోరగా 

వేయించాలి. 

మెంతులు,గసగసాలు,ఎండుకొబ్బరి,వెల్లుల్లిరెబ్బలు,అన్నీమెత్తగా 

గ్రైండ్ చేయాలి.ఇందులోనే వేయించిన అల్లం ముక్కలు కూడా వేసి 

మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

ఇప్పుడు ఉడికించిన చింతపండు వేసి రుబ్బి, కారం,ఉప్పు కూడా వేసి 

రుబ్బుకోవాలి.

చివరగా తరిగిన బెల్లం ,పంచదార వేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది.

పచ్చడి కొంచెం పలచగా కావాలి అంటే కొంచెం వేడినీళ్ళు పోయొచ్చు.

ఇప్పుడు నూనె వేడి చేసి తాలింపు వేసి కలిపితే ఘుమఘుమలాడుతూ 

అల్లం పచ్చడి నోరూరిస్తుంది.

మొత్తం తాలింపు పెట్టకుండా ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు 

కొంచెం తాలింపు వేసుకుంటే ఇంకా ఫ్రెష్ గా ఉంటుంది. 


                        




Share/Bookmark

4 comments:

ఆ.సౌమ్య

నాకు చాలా ఇష్టం అల్లం పచ్చడి. :)

లత

మాకు కూడా సౌమ్యగారూ

Praveen Mandangi

అల్లం పచ్చడి ఒకప్పుడు తినేవాడ్ని. కొన్ని రోజులు నిల్వ ఉంచితే గబ్బు వాసన వచ్చేది. అందుకే తినడం మానేశాను.

లత

ఫ్రిజ్ లో ఉంచి చూడండి ప్రవీణ్ గారు ఎన్నాళ్ళు ఉన్నా ఫ్రెష్ గా ఉంటుంది

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP