Wednesday, September 28, 2011

స్వీట్ కార్న్ హల్వా

స్వీట్ కార్న్ తో హల్వా చేసుకుంటే వెరైటీగా ఉంటుంది.మామూలు 

మొక్కజొన్నపొత్తులతో కూడా ఇలాగే చేసుకోవచ్చు.







కావలసిన  పదార్ధాలు:


స్వీట్ కార్న్                         ఒక కప్పు 

పాలు                                ఒక కప్పు 

పంచదార                           అర కప్పు 

నెయ్యి                             రెండు మూడు టేబుల్ స్పూన్స్ 

ఇలాచీ పొడి                        అర స్పూన్ 

కాజూ,కిస్మిస్


తయారు చేసే విధానం:


స్వీట్ కార్న్ ఉడికించుకోవాలి. కొంచెం నీళ్ళు పోసి మైక్రోవేవ్ లో రెండు 

నిముషాలు పెడితే సరిపోతుంది.

వీటిని కొంచెం పాలతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

నెయ్యి వేడిచేసి కార్న్ ముద్దను కొంచెం వేయించి పాలు పోసి 

ఉడకనివ్వాలి.

ఇప్పుడు పంచదార వేసి కలిపి దగ్గరయ్యేవరకూ ఉడికించాలి.

చివరగా ఇలాచీపొడి వేయాలి.ఇష్టం ఉంటే నెయ్యి ఇంకొంచెం 

వేసుకోవచ్చు.

ఒక బౌల్ లోకి తీసుకుని నేతిలో వేయించిన కాజూ,కిస్మిస్ తో 

అలంకరించుకోవాలి.


Share/Bookmark

2 comments:

శశి కళ

సింపుల్ గా బాగుంది.చక్కెర తక్కువ వెసుకొవాలెమొ కదా.

లత

అవును శశిగారు, చక్కెర తక్కువే పడుతుంది.
థాంక్యూ

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP