Saturday, September 24, 2011

అటుకుల కట్లెట్

ఎప్పుడూ పకోడీలు,బజ్జీలు స్నాక్స్ అంటే ఇవేనా అనుకున్నప్పుడు 

వెరైటీగా ఉండాలంటే ఈ కట్లెట్స్ చెయ్యొచ్చు.అటుకులు,ఆలూ కలిపి 

చేసే ఈ కట్లెట్ చేయడం కూడా సింపుల్.







కావలసిన పదార్ధాలు:


అటుకులు                        ఒక కప్పు 

బంగాళదుంప                   ఒకటి (కొంచెం పెద్దది)

శనగపిండి                       రెండు టేబుల్ స్పూన్స్ 

ఉల్లిపాయ                         ఒకటి 

మిర్చి                             మూడు 

కొత్తిమీర                          అర కప్పు 

అల్లం తురుము                  అర స్పూన్

కరివేపాకు                        ఒక రెమ్మ 

ఉప్పు,నూనె,టమాటా సాస్


తయారు చేసే విధానం:


అటుకులు కడిగి నీరు వంపి ఉంచాలి.ఆలూ ఉడికించి తీసుకోవాలి.

మెత్తబడ్డ అటుకులు,మాష్ చేసిన ఆలు ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,అల్లం,కరివేపాకు 

వేయాలి.

తగినంత ఉప్పు,శనగపిండి వేసి అన్నీ బాగా కలిపి ముద్ద చేసుకోవాలి.

అవసరం అయితే కొంచెం నీరు చల్లుకోవచ్చు.

ఇష్టమైన షేప్ లో కట్లెట్స్ చేసుకుని కాగిన నూనెలో వేయించుకోవాలి.

వేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి.




Share/Bookmark

5 comments:

Padmarpita

Sunday I will try this....
thank Q!

Unknown

సింపుల్ గా బావుందండి.
ట్రై చేస్తాను.
అసలు ఈ ట్రై చేయడం లేకుండా మీ ఇంటి ప్రక్కన ఒక ఇల్లు చూస్తే చక్కగా మీరు చేసినవే రుచి చూడచ్చు కదా

లత

ట్రై చెయ్యండి పద్మగారు

అలాగే శైలూ,మరి వచ్చెయ్యండి మా ఇంటి పక్కకి అన్నీ రుచి చూపిస్తాను

శశి కళ

లత గారు బాగున్నాయండి.మరి బియ్యం పిండి కలిపితె రావా?
చూడాలి..

లత

వేసి చూడండి శశిగారు,యేదైనా బైండింగ్ కోసమే కదా.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP