Friday, June 3, 2011

మాంగో,బనానా మిల్క్ షేక్

మామిడిపండు,అరటిపండు,తేనె కలిపి చేసే ఈ మిల్క్ షేక్ చాలా 

రుచిగా ఉంటుంది.ఇందులో బంగినపల్లి ముక్కలు కానీ,లేదా మామిడి

రసం కానీ వాడొచ్చు .






కావలసిన పదార్ధాలు:


మామిడిముక్కలు                 ఒక కప్పు 

అరటిపండు                          ఒకటి

పాలు                               ఒక గ్లాస్ 

తేనె                                 రెండు స్పూన్స్ 

పంచదార                         రెండు టీ స్పూన్స్ 


తయారు చేసే విధానం:

ముందుగా మామిడిముక్కలు,అరటిపండు,పంచదార వేసి మెత్తగా 

గ్రైండ్ చేసుకోవాలి.

ఇందులో తేనె,పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి.

గ్లాస్ లో పోసి పైన మామిడిముక్కలు వేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా 

తాగుతారు.

పంచదార ఎవరి రుచికి తగ్గట్టు వారు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.


Share/Bookmark

2 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు

ఒక నెలలో ఖచ్చితంగా పది వంటాకాలే రాస్తారా?

లత

ఖచ్చితంగా అలా అని కాదు క్రిష్ణగారూ
రెసిపీస్ చేసి ఫొటోస్ తీసి కొంచెం ప్రాసెస్సే కదా. ఒకోసారి చెయ్యలేదనుకోండి కష్టం అయిపోతుంది.అందుకని ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను.
ఇంకా ఎక్కువ రాయమంటారా

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP