Saturday, February 19, 2011

పాలకూర, పండుమిర్చి పచ్చడి

పండుమిరపకాయ పచ్చడి అందరి ఇళ్ళల్లో ఉంటుంది.  గోంగూర 

పండుమిరప పచ్చడి కూడా ఎక్కువగా చేస్తాము.అలాగే పాలకూర,

పండుమిర్చి కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. 

పండుమిర్చిపచ్చడి పెట్టినప్పుడు తాలింపు వెయ్యకుండా కాస్త పచ్చడి

ఫ్రిజ్ లోఉంచుకుంటే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకోవచ్చు.

 





కావలసిన పదార్ధాలు :

పాలకూర                                       మూడు కట్టలు

పండుమిరప పచ్చడి                  ఒక కప్పు 

నూనె                                  పావు కప్పు 

కరివేపాకు                              రెండు రెమ్మలు 

వెల్లుల్లి రెబ్బలు                      రెండు మూడు

ఉప్పు                                    చిటికెడు 

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు ,ఎండుమిర్చి


తయారు చేసే విధానం:

ముందుగా రెండు స్పూన్లు నూనె వేడి చేసి సన్నగా తరిగిన పాలకూర,

చిటికెడు ఉప్పు వేసి తడి లేకుండా వేయించాలి.

బాగా మగ్గిన తరువాత కొంచెం చల్లార్చి పండుమిరప పచ్చడితోకలిపి 

మిక్సీ లో గ్రైండ్ చెయ్యాలి 

ఇప్పుడు నూనె వేడిచేసి వెల్లుల్లిరెబ్బలు,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,

ఎండుమిర్చివేసి దోరగా వేయించాలి.కరివేపాకు కూడా వేసి, పోపును 

పచ్చడిలో కలిపితే ఘుమఘుమలాడే పచ్చడి సిద్దం 

వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది.

ఫ్రిజ్ లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది 


Share/Bookmark

10 comments:

sneha

మీ బ్లాగ్ చాలా బాగుంది అండి .సింపుల్ గా ఉన్నాయి వంటలు.థేంక్ యు

లత

థాంక్యూ స్నేహా

జ్యోతి

లతగారు, నేను చింతకాయ పచ్చడి కోసం పండుమిరపకాయలు తెచ్చాను. కాని మీ పచ్చడి చూసి వెంటనే పాలకూరతోనూ, టమాటాలతోనూ పండుమిరపకాయలు కలిపి పచ్చడి రుబ్బేసా. చాలా బావుంది. నేను ఈ నూరిపెట్టుకున్న పండుమిరపను అప్పుడప్పుడు టమాటా పచ్చడిలో కలిపి రుబ్బేస్తాను. ..

Rajendra Devarapalli

అర్థరాత్రి పన్నెండవబోతున్నప్పుడు చూసానేంటండీ బాబు ఈ టపాను ?అసలా ఫొటొలో పచ్చడి చూసిన క్షణం నుంచీ నోట్లో నీళ్ళు ఊరుతూ.............నే ఉన్నాయి.ప్చ్! రేపు మధ్యాహ్నం దాకా ఆగాలి,హయినా ఈ పచ్చడిలేదు మా దగ్గర:(

లత

జ్యోతిగారూ,మీకు నచ్చినందుకు చాలా సంతోషం వేసింది.అమ్మ పచ్చడి పంపగానే టమాటాతో ట్రై చేస్తాను ఈసారి
థాంక్యూ.

లత

థాంక్యూ రాజేంద్ర గారూ
ఇప్పుడు పండుమిరపకాయల సీజనే కదా. వెంటనే పచ్చడి పెట్టేసుకోండి మరి

కృష్ణప్రియ

లత గారూ,
నేనూ ఎప్పుడూ పండుమెరపకాయల స్టాక్ పెట్టుకుంటాను. బెంగుళూరు లో సంవత్సరం పొడుగునా.. దొరుకుతాయి.. పచ్చళ్లలో బాగానే వాడతాను. పాలకూర/చుక్కకూర తో చేసుకోవచ్చు అని ఎందుకో ఆలోచన రాలేదు.. ట్రై చేస్తానీసారి :)

లత

థాంక్యూ క్రిష్ణప్రియగారూ
చుక్కకూరతో కూడా చేసి చూస్తాను

జ్యోతి

లతగారు, ఇదిగోండి నేను చేసిన పాలకూర,పండుమిర్చి పచ్చడి.. http://shadruchulu.com/telugu/?p=1523

ఒకసారి నాకు మెయిల్ పెడతారా??

లత

థాంక్యూ జ్యోతి గారూ.
అలాగే మెయిల్ ఇస్తాను

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP