వంకాయ, దోసకాయ పచ్చడి
ఎన్ని కూరలున్నా,రోటి పచ్చళ్ళు చాలా మంది ఇష్టంగా తింటారు.మన
తెలుగునాట చాలా రకాల వెరైటీ పచ్చళ్ళు చేస్తారు.వాటిలో ఈ పచ్చడి
చాలా ముఖ్యమైనది.ముద్దపప్పు,ఈ పచ్చడి కాంబినేషన్ పెళ్ళిళ్ళు,
ఫంక్షన్స్ లోకూడా తప్పనిసరిగా ఉంటుంది.వేడి అన్నంలో నెయ్యి
వేసుకుని తింటే చాలా బావుంటుంది.
కావలసిన పదార్ధాలు :
వంకాయలు పావు కిలో
దోసకాయ ఒకటి
పచ్చిమిర్చి పది
టమాటా ఒకటి
కొత్తమీర సగం కట్ట
చింతపండు కొంచెం
ఉప్పు తగినంత
జీలకర్ర అర టీ స్పూను
వెల్లుల్లి రెబ్బలు ఆరు
పసుపు చిటికెడు
నూనె నాలుగుస్పూన్లు
కరివేపాకు రెండు రెమ్మలు
తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి
తయారు చేసే విధానం:
వంకాయముక్కలు,టమాటా,మిర్చి,కొత్తిమీర ఒక పాన్ లో వేసి రెండు
స్పూన్లు నూనె వేసి వేయించాలి.
సన్నని సెగపై బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
ముందు మిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి,చింతపండు మిక్సీలో గ్రైండ్
చెయ్యాలి.తరువాత వేయించిన వంకాయ,టమాటా ముక్కలు వేసి
మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
ఈ పచ్చడిలో సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు కలపాలి.
మిగిలిన నూనె వేడి చేసి పప్పులు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు,
చిటికెడు పసుపు వేసి,ఈ తాలింపును పచ్చడిలో కలపాలి.
దోసకాయ ముక్కలు పచ్చడిలో ఊరి కరకరలాడుతూ బావుంటుంది.

4 comments:
dosakaya,vankaya separate ga pachchadi vinnaanu...meru rendu kalipi combo pachadi chesaru :) bhale undi.
కొంచెం స్పైసీగా రుచి కూడా బావుంటుంది.మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు
థాంక్స్ ఇందూ
Hai Indu,
Mee recipe ippude chusanu.Ventane chesanu.Chaala
ba undi.Thanks a lot.Write some more recipies.
మీకు నచ్చినందుకు చాలా హాపీ జమునగారూ,థాంక్యూ
Post a Comment