Tuesday, December 21, 2010

రవ్వ దోశ

సామాన్యంగా దోసెలు ఇష్టపడని వారు ఉండరు.వేడి వేడి దోసెలు,

కొబ్బరి పచ్చడి చాలా మందికి హాట్ ఫేవరేట్ టిఫిన్,అలాగే ఈ దోసెల్లో ఎన్నిరకాలో. 

అన్ని దోసెల్లొనూ ఈ రవ్వ దోశ చేసుకోవడం చాలా తేలిక. 

పప్పు,బియ్యం నానబెట్టుకోడం,రుబ్బుకోడం ఇలాంటి పని ఏమి ఉండదు.

రవ్వ దోసెను కొందరు అప్పటికప్పుడు కలిపి వేస్తారు కానీ రాత్రి

పూట కలిపేసి నాననిచ్చి ఉదయం వేసుకుంటే చాలా బావుంటాయి.

ఎంత నానితే అంత బాగా తీగల్లా వస్తాయి.

కావలసిన  పదార్ధాలు:

బొంబాయిరవ్వ                  మూడు  కప్పులు

వరిపిండి                         ఒకటిన్నర కప్పు 

మైదా పిండి                      ముప్పావు కప్పు  

ఉల్లిపాయ                        ఒకటి 

మిర్చి                             మూడు 

అల్లం                              చిన్న ముక్క 

కరివేపాకు                        ఒక రెమ్మ 

కారట్ తురుము                 అర కప్పు 

కొత్తిమీర                          కొంచెం 

ఉప్పు                              తగినంత 


తయారు చేసే విధానం:

బొంబాయిరవ్వ,మైదా ,వరిపిండి  ఒక బౌల్ లో వేసుకుని నీళ్ళతో 

జారుగా  కలుపుకుని నాననివ్వాలి. 

ఉదయం ఈ పిండిలో తగినంత ఉప్పు,సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం 
 కరివేపాకు ,కొత్తిమీర కలపాలి.

కారట్ తురుము  కూడా కలిపి మరిన్ని నీళ్ళు పోసి బాగా పల్చగా చేసుకోవాలి. 

పేనం వేడెక్కాక ఈ పిండిని బాగా కలిపి  దోసె లాగ గుండ్రంగా పోసెయ్యాలి.

కదపడం అదీ చెయ్యకూడదు.

చుట్టూ నూనె వేసి బాగా కాలనివ్వాలి.

కొంచెం కలర్ వచ్చాక తిరగేసి రెండోవేపు కూడా కాలనివ్వాలి.

కొబ్బరి చట్నీ లేదా పల్లీల  పచ్చడి తో వడ్డిస్తే క్రిస్పీ గా ఉండే రవ్వ దోశ నోరూరిస్తుంది.

ఇష్టం ఉంటె ఇంకా ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు,జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. 
Share/Bookmark

7 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు

లత గారూ,చంద్రబాబు అరెస్టు పుణ్యమా అని సోమవారం మా పిల్లలకి సెలవు వచ్చింది. మా అవిడని పక్కన పెట్టి నెనూ, పిల్లలూ మీరు రాసిన బ్రెడ్ పకోడా చేశాం. అది బాగా ఆయిలీగా వచ్చింది. బ్రెడ్‍ని నూనెలో వేస్తే బాగా నూనె లాగుతుందని మా ఆవిడ చెప్పింది. దీనికి ఏదైనా రెమెడీ ఉందా?

లత

బ్రెడ్ కనుక కొంచెం ఆయిల్ ఉంటుంది అండీ. కానీ మరీ అంత కారేలా అయితే ఉండదు.వంటసోడా ఎక్కువ వేసినా ఆయిల్ లాగుతుంది.
ఆయిల్ లో నుండీ తీశాక టిష్యూ పేపర్ పై కాసేపు ఉంచితే ఎక్సెస్ ఆయిల్ అంతా పొతుంది.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు

అవును.మేము టిష్యూ పేపర్ వాడి ఆయిల్ తగ్గించాం.

లత

థాంక్స్ క్రిష్ణ గారూ

మాలా కుమార్

నేను రవ దోశ గంట నానవేసి చేసేదానిని . ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చేసాను . బాగా వచ్చింది .
నేను ఎక్కువగా వంటల పోస్ట్ లు చూడను . మా జయ చెప్పటం తో మీ అభిరుచి కి వచ్చాను . మీ వంట లన్నీ ఈజీగా బాగున్నాయి .

లత

థాంక్యూ మాలగారూ

lalithag

ఈ రెసిపీ చాలా ఉపయోగకరంగా ఉంది నాకు. Thanks. ఈ రోజే చేశాను. బాగా వచ్చాయి. ఇంతకు ముందు మా ఇంట్లో కాసిన పచ్చి టమాటాలతో ఏమన్నా చెయ్యాలి అని ఆలోచిస్తుంటే మీ పచ్చి టమాటా రెసిపీ కనిపించింది. ఇప్పటికే మూడు సార్లు చేశాను. చాలా బావుంది. Thanks again.

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP