Saturday, May 28, 2011

పనీర్ , స్వీట్ కార్న్ పులావ్

చాలా మైల్డ్ ఫ్లేవర్ తో ఎక్కువ మసాలాలు లేకుండా ఉంటుంది ఈ 

పులావ్.ఎప్పుడూ వాడే కూరగాయలు కాకుండా స్వీట్ కార్న్,పనీర్ 

వాడడంతో వెరైటీ రుచితో బావుంటుంది.పెరుగుపచ్చడి కానీ,ఏదైనా 

చికెన్ కర్రీ కానీ ఈ పులావ్ కి మంచి కాంబినేషన్.






కావలసిన పదార్ధాలు: 

బాస్మతి రైస్                             ఒక గ్లాస్ 

స్వీట్ కార్న్                              ఒక కప్ 

పనీర్ ముక్కలు                        ఒక కప్ 

ఉల్లిపాయ                              ఒకటి 

మిర్చి                                  మూడు 

కారట్                                  ఒకటి   

కొత్తిమీర                                అర కప్ 

అల్లంవెల్లుల్లి ముద్ద                    ఒక టీ స్పూన్ 

గరంమసాలాపొడి                      ఒక టీ స్పూన్ 

ఉప్పు                                    తగినంత 

నూనె                                     మూడు టేబుల్ స్పూన్లు

లవంగాలు,చెక్క,యాలకులు 


తయారు చేసే విధానం;


బియ్యం కడిగి పది నిమిషాలు నాననివ్వాలి.

నూనె వేడిచేసి పనీర్ ముక్కలు  కొంచెం వేయించి తీసుకోవాలి.

అదే నూనెలో 3 లవంగాలు,దాల్చినచెక్క ముక్క,రెండు యాలకులు

వేసి వేగాక వాలికలుగా కోసిన ఉల్లి,మిర్చి వేసి వేయించాలి.

ఇప్పుడు తరిగిన కొత్తిమీర,స్వీట్ కార్న్,కారట్ తురుము వేసి కొంచెం 

వేయించి అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాల పొడి వేయాలి.కొంచెం వేగాక 

బియ్యం వేసి బాగా కలిపి రెండు మూడు నిముషాలు వేయించాలి.

ఇప్పుడు ఒక గ్లాసున్నర నీళ్ళు,తగినంత ఉప్పు వేసి కలిపి కుక్కర్ 

మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

స్టీం అంతా పోయాక ఒకసారి తీసి పనీర్ ముక్కలు వేసి కలిపి మళ్ళీ 

మూత పెట్టాలి.

ఈ పులావ్ కొంచెం కార్న్ స్వీట్ నెస్,కొంచెం స్పైసీ నెస్ తో వెరైటీగా 

ఉంటుంది.


Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP