Tuesday, January 4, 2011

బ్రెడ్ 65 (మంచూరియా )

బ్రెడ్ తో రకరకాల వెరైటీలు నిమిషాల్లో చేసుకోవచ్చు.ఉదయం టిఫిన్

కోసం అయినా, సాయంత్రం స్నాక్స్ కోసమైనా బ్రెడ్ ఇంట్లో ఉంటే హ్యాపీ.

నాలుగు స్లైసులు బ్రెడ్ ఉంటే ఈ రోజు బ్రెడ్ 65 చేశాను. తోటకూర పప్పు 

కూరలోకి జతగా చాలా బావుంది.మీరూ ట్రై చెయ్యండి.
















కావలసిన పదార్ధాలు:


బ్రెడ్                    నాలుగు స్లైసులు 

ఉల్లిపాయ              ఒకటి 

మిర్చి                  నాలుగు 

కారట్ తురుము      కొంచెం 

కాప్సికం               ఒకటి చిన్నది 

ఉప్పు,కారం           తగినంత

పెరుగు                ఒక కప్పు 

వెల్లుల్లి                  నాలుగు రెబ్బలు 

కరివేపాకు              రెండు రెమ్మలు 

నూనె                   తగినంత



తయారు చేసే విధానం:

ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని నీళ్ళల్లో వేసి వెంటనే పిండి ఒక బౌల్ లో 

వేసుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి, ఒక మిర్చి,కాప్సికం, కారట్ తురుము,

కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి ఉంచుకోవాలి.

నూనె వేడి చేసి ఈ ఉండలు వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.

ఇప్పుడు వేరే పాన్ లో ఒక స్పూన్ నూనె వేడి చేసి సన్నగా తరిగిన 

వెల్లుల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.

కొంచెం వేగిన తరువాత బ్రెడ్ ఉండలు వేసి చిటికెడు ఉప్పు,కారం వేయాలి.

ఇప్పుడు పెరుగును కొంచెం బీట్ చేసి ఇందులో వేసి సన్నని సెగపై

అంతా  ఇగిరి పోయి పొడిపొడిగా అయ్యెవరకూ వేయించాలి

ఒక బౌల్ లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడి గా సర్వ్ 

చేస్తే బ్రెడ్ 65 నోరూరిస్తుంది.

ఇంకా ఇష్టం ఉన్నవారు సన్నగా తరిగిన కాబేజ్,ఉల్లి కాడలు కూడా 

కలుపుకోవచ్చు.

బ్రెడ్ మంచూరియా:

నూనె వేడిచేసి వెల్లుల్లి,మిర్చికరివేపాకు వేయించి,ఫ్రై చేసిన బ్రెడ్ 

ఉండలని వేసి ఒక స్పూన్ సోయాసాస్,ఒక స్పూన్ టమాటాసాస్,

ఒక స్పూన్ రెడ్ చిల్లి సాస్ వేసి,ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ని నీటిలో

కలిపి పోసి డ్రై గా అయ్యేవరకూ వేయించితే బ్రెడ్ మంచూరియా రెడీ 

అవుతుంది.


 


Share/Bookmark

8 comments:

ఇందు

Wow latha garu. Superb item chepparugaa! Nenu tappakunda ivala evening try chesta.Marchipoyaa nenu monna mee palakrice chesa.sooper vachhcindi.asalu meeku keka chef andi :)

లత

అబ్బో మనసూ,కడుపూ నిండిపొయింది ఇందూ,
ఇక ఈ పూట భోజనం అక్కర్లేదు నాకు.
మీ అభిమానానికి బోలెడు థాంక్యూలు.
చేసి ఎలా వచ్చిందో చెప్పండి.

ఇందు

ఈ ఐటం ట్రై చేసా లతగారూ....కానీ ఆ ఉండలు అలా నూనెలో ఏయించగానె...ఇలా చందుగారు తినేసారు :)) దాన్ని మంచురియా చేసే అవకాశం కూడా ఇవ్వలేదు...హ్హహ్హహ్హా!

లత

చందుగారు మెల్లగా బ్రెడ్ కి ఫాన్ అయిపోతున్నారు అన్నమాట
వెరీ గుడ్ ఇందూ

ఇందు
This comment has been removed by the author.
ఇందు

నిన్న కష్టపడి మళ్ళి బ్రెడ్-మంచురియా చేసా! భలే ఉంది! అచ్చు వెజ్జి మంచురియా లాగే! మా చందుకి బాగ నచ్చింది ఇది కూడా! అవును చందు బ్రెడ్ ఫాన్ ఐపోతున్నారు! మొన్న బ్రెడ్ టోస్ట్ [మీరు చెప్పిన పధ్ధతిలో]చేయమని తనే బ్రెడ్ పాకెట్ తీసుకొచ్చారు ;) అంటే ఇక మీరే అర్ధం చేసుకోవచ్చు ఏ రేంజ్ లొ మీ వంటలు నచ్చేసాయో! మీకు బోలెడు థాంకూలు :))

సుమలత

లత గారు
మళ్ళి కొత్త రకం వంటకం మొన్న పాయసం యిరోజు బ్రెడ్ బాగుంది ఇలా నోరు ఊరించేస్తే ఎలాగ మరి ...
మీ వంటకాలన్ని ఇండియా వెళ్ళాక చేస్తాను అప్పటివరకు మీరు రాసిన రాతలతో సర్దుకుంటానులే ....

లత

మీకు అంతగా నచ్చుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇందూ, థాంక్యూ

థాంక్యూ సుమలతా
ఇండియా వచ్చేవరకూ కుదరదు అంటారా సర్దుకోండి మరి

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP