Saturday, April 30, 2011

కసూరి మేథీ చికెన్

కసూరిమేథి చాల మంచి ఫ్లేవర్ ఇస్తుంది.తాజా మెంతికూర బదులు ఈ 

కసూరి మేథి వేసి చేసిన చికెన్ ఐటం ఇది.మంచి సువాసనతో చాలా 

రుచిగా బావుంటుంది.






కావలసిన పదార్ధాలు :

 చికెన్                                  అర కేజీ 

కసూరిమేతీ                           పావు కప్పు 

ఉల్లిపాయ                             ఒకటి 

మిర్చి                                  రెండు 

కరివేపాకు                            ఒక రెమ్మ 

టమాటప్యూరీ                        అర కప్పు 

అల్లంవెల్లుల్లిముద్ద                  రెండు టీ స్పూన్లు

ఉప్పు,కారం,నూనె                   తగినంత 

పసుపు                               కొంచెం

కొత్తిమీర                              ఒక కట్ట

నిమ్మరసం                           ఒక టేబుల్ స్పూన్ 

మసాలకు 

లవంగాలు                        ఆరు

చెక్క                               చిన్న ముక్క 

జీలకర్ర                           ఒక టీ స్పూన్ 

ధనియాలు                     ఒక టేబుల్ స్పూన్ 


తయారు చేసే విధానం:

చికెన్ లో కొంచెం ఉప్పు,కారం,అల్లంవెల్లుల్లి ముద్ద,నిమరసం వేసి కలిపి 

ఒక అరగంట నాననివ్వాలి 

కసూరిమేతి ని నీళ్ళలో వేసి ఉంచాలి.

మసాలాలు అన్నీ మెత్తగా పొడి కొట్టి ఉంచుకోవాలి.

నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు వేసి 

దోరగా వేగనివ్వాలి.

ఇప్పుడు నీళ్ళలో నానబెట్టిన కసూరిమేతి వేసి కొంచెం వేయించి అల్లం

వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించాలి.

పసుపు,కారం,టమాట ప్యూరీ,మసాల పొడి వేసి బాగా కలిపి రెండు 

స్పూన్ల నీరు వేసి నూనె తేలేవరకు వేయించాలి.

నానబెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి  సన్నని సెగపై అయిదు 

నిముషాలు ఉంచి,తగినంత ఉప్పు,ఒక కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి 

చికెన్ మెత్తగా ఉడికేవరకు ఉంచాలి.

సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కూర బాగా దగ్గరయ్యాక దించెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసి కొంచెం కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడుతూ 

మేథి ఫ్లేవర్ తో చికెన్ కూర రెడీ అవుతుంది.


Share/Bookmark

3 comments:

Rajendra Devarapalli

కసూరిమేథి???

లత

రాజేంద్ర గారు,కసూరిమేథీ అంటే ఎండిన మెంతికూర అండి
షాప్స్ లొ పాకెట్స్ లో దొరుకుతుంది.

Rajendra Devarapalli

అమ్మయ్య బతికించారు :)

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP