Monday, April 4, 2011

ఉగాది పచ్చడి, కారట్ పూర్ణాలు

తెలుగువారికి అతిముఖ్యమైన పండుగ ఉగాది.మామిడితోరణాలూ,

పచ్చిమామిడికాయలూ,పిండివంటలతో పాటూ ఉగాదిపచ్చడితో అన్ని 

లోగిళ్ళూ ఘుమఘుమలాడి పోతాయి.తీపీ,పులుపూ,వగరూ,ఉప్పూ 

ఇలా అన్నిరకాల రుచులతో కూడినది ఈ ఉగాది పచ్చడి






కావలసిన పదార్ధాలు :

మామిడిముక్కలు                          అరకప్పు 

చింతపండు గుజ్జు                            అర కప్పు 

బెల్లం                                         అరకప్పు 

అరటిపండు                                  ఒకటి 

ద్రాక్షపళ్ళు                                   పది

వేపపువ్వు                                   కొంచెం 

ఉప్పు                                         చిటికెడు

కొబ్బరి తురుము                          కొంచెం



తయారు చేసే విధానం :

చింతపండు నానబెట్టి చిక్కగా పులుసు తీసుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన బెల్లం వేసి మెదిపి కరగనివ్వాలి.

సగం అరటిపండు ముక్కలు వేసి కొంచెం మెత్తగా మెదిపి,మిగిలిన 

పండు ముక్కలు వెయ్యాలి.

ఇప్పుడు మామిడిముక్కలు,శుభ్రంచేసిన వేపపువ్వు,కొబ్బరితురుము,

ద్రాక్షముక్కలు,చిటికెడు ఉప్పువేసి ఒకసారి కలిపితే  రుచికరమైన 

ఉగాదిపచ్చడి సిద్దం.


కారట్  పూర్ణాలు



కొన్నిచోట్ల పూర్ణాలు అన్నా,కొన్నిచోట్ల బూరెలు అన్నా పండుగ అంటే 

 ఇవి తప్పనిసరిగా ఉంటాయి.ఎక్కువగా శనగపప్పు,బెల్లం ఉడికించి 

చేసినా, అప్పుడప్పుడు ఇలా కారట్ తో చేసుకుంటే వెరైటీగా ఉంటాయి





కావలసిన పదార్ధాలు :

కారట్ తురుము              రెండు కప్పులు

పంచదార                      ఒక కప్పు

పాలు                           ఒక కప్పు

నెయ్యి                          రెండు స్పూన్లు

కాజు,బాదం,కిస్మిస్

పూత పిండికి

మినప్పప్పు           ఒక కప్పు

బియ్యంపిండి        రెండు కప్పులు 

ఉప్పు                   తగినంత

నూనె


తయారు చేసే విధానం


బియ్యంపిండిని కొంచెం నీటితో ముద్దగా కలుపుకోవాలి

మినప్పప్పు రెండు గంటలు నానబెట్టుకుని మెత్తగా రుబ్బుకుని తడిపిన 

బియ్యంపిండిలో వేసి తగినంత ఉప్పు  కలిపి ఒక గంట నాననివ్వాలి

నెయ్యి వేడి చేసి కాజు,బాదం,కిస్మిస్ వేయించి తీసుకోవాలి.

అదే నెయ్యిలో కారట్ తురుము వేసి వేయించి పాలు పోసి ఉడికించాలి

పాలు ఇగిరిన తరువాత పంచదార వేసి ,అది కరిగి మళ్లీ బాగా 

దగ్గరయ్యే వరకు ఉడికించాలి.

చల్లారిన తరువాత డ్రై ఫ్రూట్స్ కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి

ఈ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేయించి 

తీసుకోవాలి.

అంతే, కమ్మని రుచితో కారట్ బూరెలు  రెడీ  అవుతాయి,




Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP