సోయా - గ్రీన్ పీస్ కర్రీ
పూరీ,చపాతీ ఇలాంటి వాటికి ఈ కూర మంచి జోడీ .అన్నంలోకి కూడా
అయిపోతుంది.
కావలసిన పదార్ధాలు:
సోయా గ్రాన్యూల్స్ ఒక కప్పు
పచ్చి బటానీలు ఒక కప్పు
టమాటాలు రెండు
ఉల్లిపాయ ఒకటి
పచ్చిమిర్చి రెండు
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర కొద్దిగా
అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్
గరంమసాలాపొడి అర టీ స్పూన్
ఉప్పు,కారం,పసుపు,నూనె,తాలింపు దినుసులు
తయారు చేసే విధానం:
సోయా గ్రాన్యూల్స్ ను మరిగే నీటిలో వేసి రెండు మూడు నిముషాలు
ఉడికించాలి.
చల్లారక వడపోసి చల్లని నీళ్ళతో రెండుసార్లు కడిగి నీరు పిండేసి
ఉంచాలి.
నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు
వేయించాలి.ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి టమాటా
ముక్కలు వేయాలి.
టమాటా బాగా ఉడికిన తరువాత సోయా గ్రాన్యూల్స్,తగినంత
ఉప్పు,కారం,పసుపు వేసి వేయించాలి.
చివరగా ఉడికించిన బటానీలు,కొత్తిమీర,మసాలాపొడి కూడా వేసి బాగా
కలిపి కూర డ్రైగా అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
కలిపి కూర డ్రైగా అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
2 comments:
సోయా గ్రాన్యుల్స్ అంటే మీల్ మేకరా?? బావుంది..నేను చేస్తూ ఉంటాను ఇది :)
అవును సౌమ్యగారూ.పెద్దవి సోయా చంక్స్ కాకుండా గ్రాన్యూల్స్ దొరుకుతాయి కదా అవి
Post a Comment