Thursday, March 31, 2011

మేథీ టమాటాపులావ్

ఆకుకూరలు అందులోనూ మెంతికూర చాల మంచిది డయాబెటిక్ 

వాళ్ళని కూడా మెంతి కూర ఏదో ఒక రూపంలో ఎక్కువ తీసుకోమని 

చెప్తారు.కొంచెం మెంతిఆకు,టమాటాలు వేసి కొబ్బరిపాలతో రైస్ వెరైటీ 

చేస్తే రుచి భలే ఉంటుంది.మెంతాకు ఫ్లేవర్, కొబ్బరిపాల రుచి కలిసి 

ఈ పులావ్ చాలా  బావుంటుంది.







కావలసిన పదార్ధాలు;


బియ్యం                                       ఒక గ్లాస్ 

మెంతికూర                                  మూడు కట్టలు

ఆలుగడ్డ                                     ఒకటి   

టమాటాలు                                  రెండు  

ఉల్లిపాయ                                    ఒకటి

మిర్చి                                        మూడు 

కరివేపాకు                                    ఒక రెమ్మ 

కొత్తిమీర                                      ఒక కట్ట

కొబ్బరి పాలు                                ఒక గ్లాస్    

అల్లంవెల్లుల్లి ముద్ద                        రెండు స్పూన్లు 

గరం మసాల పొడి                          రెండు టీస్పూన్స్ 

పసుపు                                       చిటికెడు 

ఉప్పు,నూనె                                  తగినంత 

లవంగాలు  ౩ .చెక్క చిన్న ముక్క,ఇలాచీ ఒకటి 


తయారు చేసే విధానం :


బియ్యం కడిగి ఒక పావుగంట నాననివ్వాలి 

మెంతికూర ఆకులు మాత్రం కడిగి పెట్టుకోవాలి.

పాన్ లో నూనె వేడిచేసి లవంగాలు,చెక్క,ఇలాచి వేసి వాలికలుగా 

తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు,ఆలూముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు తరిగిన టమాటా వేసి ఉడికిన తరువాత మెంతి ఆకు వేసి 

కొంచెం వేయించాలి.

అల్లంవెల్లుల్లిముద్ద ,పసుపు,గరంమసాలపొడి వేసి కొంచెం వేగాక ఒక 

గ్లాస్ కొబ్బరిపాలు ,మిగిలినవి నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేయాలి.

పాన్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చాక తీసేయ్యాలి 

ఉల్లిపాయ పెరుగు పచ్చడితో  ఈ పులావ్ బావుంటుంది.











Share/Bookmark

5 comments:

Sravya V

మంచి టిఫిన్ బాక్స్ రెసిపి , ట్రై చేసి చెబుతాను :)

లత

చేసి చూడండి శ్రావ్యా,తప్పకుండా నచ్చుతుంది

ఆ.సౌమ్య

హ్మ్ బావుంది...ట్రై చేస్తా ఈసారి. మెంతి కూర రుచి నాకు బాగా నచ్చుతుంది.

లత

ట్రై చెయ్యండి సౌమ్యా, బావుంటుంది

Madhavi Pavani

chaala bagundandi....nenu try chestanu
www.maavantalu.com

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP